అగస్త్యమహాముని శ్రీరామచంద్రునికి "ఆదిత్యస్తోత్ర ప్రాభవమును" వివరిస్తూ మహాబాహో-శృణు -ఇతి గుహ్యం.ఇతి సనాతనం అని అంటారు.ఆ శబ్దములలో దాగిన విశేషములను తెలుసుకునే ప్రయత్నమును చేద్దాము.
"యద్భాసా భాస్యతే సూర్యో-యద్భాసా భాస్యతే జగత్".
దేని కాంటి వలన సూర్యుడు ప్రకాశిస్తున్నాడో-జగములు ప్రకాశిస్తున్నాయో దానికి మూలమే గుహ్యము అయిన పరమాత్మ.
అదే విషయమును శ్రీ లలితా రహస్య సహస్రనామము
1." భక్తహార్ద్ర తమోభేద భానుమత్ భాను సంతతిః" అని,
2. హృదయస్థా-రవిప్రఖ్యా త్రికోణాంతర దీపికా" అని మరొక్కసారి పరమాత్మను ప్రస్తుతిస్తున్నది.
3.పరమేశ్వరి యొక్క సూక్ష్మరూపము "గుహ్యముగా" భావింపబడుచున్నది.భజింపబడుచున్నది.
4. స్థూలమునకు వస్తే
" పరేన నాకం నిహితం గుహాయాం" అని హృదయగుహ యందలి చైతన్య రూపముగాను ప్రణతులనందుకుంటున్నది.
5."పంచకోశానాం గుహా సబ్దేన గీయతే" అంటూ రహస్యోపనిషత్తులచే ఉద్ఘటింపబడుచున్నది.
గుహ్యము అంటే రహస్యము గా అనిపించే రహస్యము కానిది.అందుకే అది సనాతనమైనది.
ఎప్పటినుంచో ఉన్నప్పటికిని నిత్యనూతనముగా భావింపచేయునది.అది అప్రమేయమైనది.
ప్రమేయము అను శబ్దమునకు కారణము/పరిమాణము అను అర్థములను గ్రహిస్తే దాని ఉనికి కారణము అంటూ ఏదీ లేనిది.దాని ఉపాధి ఇది అని విస్తీర్ణతను నిర్ణైంచలేనిది.
కనుక అది గుహ్యం మరియును సనాతనము.