శ్లో : అసారే సంసారే నిజ-భజన-దూరే జడ ధియా
భ్రమన్తం మామ్-అంధం పరమ-కృపయా పాతుమ్ ఉచితమ్
మత్-అన్యః కో దీన:-తవ కృపణ- రక్షాతి - నిపుణః
త్వత్-అన్యః కో వా మే త్రి-జగతి శరణ్యః పశు-పతే 13
ఆదిశంకరులు అసార సంసారమును గురించి, "పునరపి జననం-పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుఃఖారే " అని ఏవిధముగా నిస్సారమో తెలియచేసారు. ప్రస్తుత శ్లోకములో ఆదిశంకరులు అవలక్షనములను చెబుతూనే వాటిని అర్హతలుగా భాసింపచేస్తున్నారు. ఇక్కడ రెండు పూర్తి విరుద్ధ భావములు ఒకటి ప్రకాశకత్వమునకు-మరొకటి అంధకారత్వమునకు ప్రతీకలుగా చెబుతున్నారు. భక్టుడు ఈ విధముగా తన అసమర్థలను చెబుతూ,దానిని నివారించగలిగిన శక్తి పరమేశ్వరునకు తక్క వేరెవరికి లేదని విన్నవించుకొనుచున్నారు. భక్టుడు-చైతన్యరహితుడు కాని భగవంతుడు -అజడుడు-సంపూర్ణ చైతన్యము. భక్తుడు-కృపణుడు-తన స్వస్వరూపమును తెలిసికొనలేని స్థితిలో నున్నవాడు-భగవంతుడు సమస్తము స్వస్వరూపముగా కలవాడు. భగవంతుడు కృపయ ధియ-కృపతో రక్షించు సుమనస్కుడు భక్తుడు కృపణుడు-భగవంతుడు కృపయనిపుణుడు. భక్తుడు పశువు-అనగా పశ్యంతీ తవ పశుః-చూడగలినశక్తి మాత్రమే కలవాడు.కాని చూసినదానిలో దాగిన మర్మమును గ్రహించలేనివాడు. భగవంతుడు పశుపతి-చూసినదానిలోని మర్మమును తెలియచేయువాడు. అంతేకాదు త్రిభువన/త్రిజగః మత్ అన్యః శరణ్య-నిన్ను శరణుకోరువారిలో దీనుడులేడు. నా దీనత్వమును నిర్మూలించగలిగిన, తవ్త్-అన్యః నిన్ను మించిన శరణాగతరక్షకుడును లేడు. కనుక ఓ పరమేశా!అసారమైన సంసారము నుండి విముక్తిని ప్రసాదించి,భవపాదాబ్జసేవనాసక్తిని అనుగ్రహించుము అంటున్నారు శంకరులు. సర్వం పార్వతీ పరమేశ్వర చరణారవిందార్పణమస్తు.