" కదంబ వనవాసినీం కనకవల్లకీ ధరిణీం
మహార్ణమణిహారిణీం ముఖసముల్లస్ద్వారుణీం
దయా విభవకారిణీం విశదరోచనాచారిణీం
త్రిలోచచన కుటుంబుణీం త్రిపురసుందరీం ఆశ్రయే."
శ్రీచక్రములో బిందురూపముగా ఏకాత్మకమైనపరమాత్మ,సృష్టిచేయ సంకల్పించి కామేశుడై,
మహత్తు-అహంకారము
శివశక్తులు
స్థావర-జంగమము
ప్రకృతి-పురుషులు గా
ప్రకటింపబడుతూ,
పంచకృత్యాసక్తులై,
పురోభవ గా శ్లాఘింపబడు పరమేశ్వరి,
మూడు అవస్థలను-జాగ్రత్-నిద్రా-సుషుప్తులను
మూడు కాలములను-భూత-వర్తమాన-భవిష్యత్తులను
మూడుకూటములను-వాగ్భవ-మధ్య-శక్తి
మూడు కార్యములను-సృష్టి-స్థితి-సంహారములను
మూడు గుణములను-సత్వ-రజో-తమో గుణములను విస్తరించి తాను పర్యవేక్షించుచున్నది.
ఆ పరాశక్తియే ఒక ఆనందమయ దివ్యరూపమును సంతరించుకున్నది కనుక"త్రిపురసుందరి"గా,సర్వాంగసుందరిగా సంకీర్తింపబదుతుంది.
సర్వాంగసుందరి నవావరనములలో తన వంటి రూపురేఖా లావణ్యములు కలిగిన త్రిపురలను విస్తరింపచేసి నవమావరనములో తాను మహాత్రిపురసుందరిగా పూజింపబడుతున్నది.
త్రిపురాను ఉపసర్గనుపొందిన,
1.త్రిపుర
2.త్రిపుర+ఈశి
3.త్రిపుర+సుందరి
4.త్రిపుర+వాసిని
5.త్రిపురా+శ్రీ
6.త్రిపుర+మాలిని
7.త్రిపుర+సిద్ధే
8.త్రిపుర+అంబే
9.మహా త్రిపుర సుందరిగా,
చక్రేశ్వరులై సాధకుని సహాయపడుతుంటారు.ఆవరననుండి నిష్క్రమించునపుడు చక్రేశ్వరికి నమస్కారముచేసి,మరొక ఆవరనము లోనికి ప్రవేశించుట సంప్రదాయము.
భూపురమునందు మూడు పురముల ప్రసక్తి వచ్చింది.
సులభమైన భాషలోసూటిగా చెప్పలంటే "ఆత్మ అనే సుందర చైతన్యము"స్థూల-సూక్ష్మ-కారన సరీరములను మూడింటిని కప్పుకుని యున్నది.
ఆత్మచైతన్యమే త్రిపుర సుందరి.ఆ చైతన్యము పరిపాలించువేళ త్రిపురేశి,సుందరముగా మలచువేళ త్రిపురసుందరి,అంతర్వాసినియైనవేళ త్రిపురవాసిని,సౌభాగ్యననుగ్రహించువేళ త్రిపురాశ్రీ,సర్వ వ్యాపకమైనవేళ త్రిపురమాలిని,వ్యక్తీకరింపబడుచున్నవేళ త్రిపురసిద్ధే,జగన్మాత కనుక త్రిపురాంబే,
అమ్మలకన్న అమ్మకనుక "మహాత్రిపురసుందరి"గా
భావించి,దర్శించి ధన్యులగువారెందరో.
శ్రీ మాత్రే నమః