మీడుష్టమ శివతమ-17
***********************
న రుద్రో రుద్రమర్చయేత్-రుద్రుడు కాని వాడు రుద్రుని సేవింపలేడు.
ఒకేఒక చైతన్యము అనేకానేక నామరూపములతో ప్రకాశిస్తున్నదా.ఎంతటి అద్భుతము ఇది.పుట్టుత-పెరుగుట-అదృశ్యమగుట ఒకే మూలశక్తి మూడుపనులు చేయుచున్నదా అనుకుంటుండగానేఏమాలోచిస్తున్నావయ్యా నేను వచ్చినది గమనించలేనంత ఏమరుపాటులో నున్నావు అన్నాడు రుద్రుడు సాధకునితో.
రుద్రా! ఏమిటి ఈ విచిత్రము.రుద్రచమకులో భక్తుడు పరమాత్మను జాత్యంచమే-జనిష్యమానంచమే అని అడుగుతుంతే విన్నాను.వాడు పుట్టిన తరువాతనే కదా నమక-చమకములు చదువుచున్నాడు.మళ్ళీ నేను పుట్టాలి-వంసము ప్రగాలి అంటున్నాడు తన ఉనికిని తాను మరిచి అని సందేహమును వెలిబుచ్చాడు.
మందహాసముతో దాని మర్మమును వివరిస్తున్నాడు రుద్రుడు.
నాయినా నీవు బాహ్యమును మాత్రమే చూస్తున్నావు.అనుసరిస్తున్నావు.నిజానికి నీవు చూసేదంతా తాత్కాలిక నామరూపములే.వాటిని ఉపాఢి అంటారు.దేనిద్వారా చైతన్యము ప్రసరిస్తుందో అది ఉపాఢి.
అంటే చైతన్య ప్రసరనకు ద్వారము అది.కాని నిరాకారము చిన్నిచిన్నిభాగములుగా విస్తరిస్తూ,నామరూపములనే విసేషములను తనతో కలుపుకొని,వాటిని శక్తివంతము చేయుచు పంచీకృతమవుతున్నది.మనలో అవయవములుగా తనశక్తులను విస్తరింపచేస్తున్నది.
అందులకు భక్తుడు తన అవయవములలో శక్తులను అదే దృశ్యశక్తి-శ్రవణసక్తి-వాక్సక్తి మొదలగు వాటిని మనము కన్ను-చెవి-నోరు అని అవి పొందిన ఉపాధి పేరుతో పిలుస్తున్నాము.ఈ ఇంద్రియములు చైతన్యశక్తిని కలుపుకొని కర్మేంద్రియములు/జ్ఞానేంద్రియములుగా పిలువబడుచున్నవి.అదే విధముగా మనమే కాడు ఈశ్వరుడు కూద అవతారముల పేరుతో ఎన్నెన్నో నామరూపములు గల ఉపాధులతో ప్రకటితమగుతుంటాడు.
కాని మనకు పరమాత్మకు ఉన్న వ్యత్యాసము ఒక్కతే .
పరమాత్మకు ఆ ఉపాధిని ఎందుకు స్వీకరిస్తున్నాడో ఎంతవరకు ఆ ఉపాధిలో ఉండి అవతారపరిసమాప్తి చేయాలోతెలుసును.మనకు తెలియదు.నిజమునకు మనము కూడ పరమాత్మ రూపములే.
పుట్టిన భక్టుడు పరమాత్మను పుట్టించమని కోరుతున్నాడు.తాను పుట్టుటయే కాక తన వంసము పెరిగి పెద్దదవాలనుకుంటున్నాడు.మన ఉపాధులు సత్యము కానప్పుడు వాటిని ఎందుకు కోరుకుంటున్నాదో అని ఆలోచనలో సాధకుడు పదగానే అంతర్మథనమునకు అవకాశమునిస్తూ,అంతర్ధానమయ్యాడు రుద్రుడు.
అణువు అణువు శివమే-అడుగు అడుగు శివమే.
కదిలేవి కథలు-కదిలించేది కరుణ.
ఏక బిల్వం శివార్పణం.