4.జటాభుజంగపింగళస్ఫురత్ఫణామణిప్రభా
కదంబకుంకుమద్రవప్రలిప్తదిగ్వధూముఖే |
మదాంధసింధురస్ఫురత్త్వగుత్తరీయమేదురే
మనో వినోదమద్భుతం బిభర్తు భూతభర్తరి || 4 ||
మొదటి శ్లోకములో స్వామి తాండవ స్థలిని-స్వామి తాండవవము ద్వారా సమస్త మంగళములను విస్తరింపచేయుటను ప్రస్తావించిన సాధకుడు,
రెండవ శ్లోకములో స్వామి ఆహార్యమును అట్టి మంగళ తాండవమును తన చిత్తములో నిలుపుకొనవలెనను ఆకాంక్షను తెలియచేసినాడు.
మూడవ శ్లోకములో తాండవ వినోదమునందించు వస్తువుల యొక్క అగ్ని-సోమాత్మకతను అన్వయిస్తూఏ వానిలో దాగిన అర్థనారీశ్వర పరమార్థమును ప్రస్తుతిస్తూ ఆ నందము యొక్క శాశ్వతవమును ఆకాంక్షిస్తున్నాడు.
ప్రస్తుత శ్లోకములో సాధకుడు రెండేరెండు ఉపమానములను 1) సర్పములు 2)గజచర్మము తీసుకుని అనుపమాన స్వామి తేజమును తెలియచేస్తున్నాడు.
ఇప్పటి వరకు మనము స్వామి జటలు అడవి వలె నున్నవని,కటాహము వలె నున్నవని చెప్పుకొనినాము.
ఇప్పుడు ఆ జటలు పాములచే చుట్టబడినవట.అంటే మొదటి శ్లోకములో గళమున అలంకారముగా హారము వలె మెరిసిన సర్పము/సర్పములు చరచర పాకి జటలను చుట్టుకొనినవట.కాదు కాదు
స్వామి తన జటలను ఎర్రని వర్ణములుగల పాములతో కలిపి ముడుచుకొనినాడట.
ఏమిటి ఈ ఉపమానము.పాములు పైకి పాకి జటలలో అలంకరింపబడుట అనగా కాలము చరచర జరుగుచున్నది.తనతో పాటు కాలాంతకుని తేజమును తాను ధరించిన పడగమీది మణుల వలె ప్రకాశింపచేయుచున్నది.ఆ ప్రకాశమును ఇంత-అంత అని చెప్పలేని అపరిమితము.తేజస్సుతో పింగళ వర్ణముతో దిక్కులన్నింటిని వ్యాపించి,దిక్కులను పెళ్ళికూతురుగా భావింపచేసి కళ్యాణతిలకము ప్రకాశిస్తున్నది.అదియే
.జటాభుజంగపింగళస్ఫురత్ఫణామణిప్రభా
కదంబకుంకుమద్రవప్రలిప్తదిగ్వధూముఖే |
దిక్కులనెడి వధువు ముఖమున కదంబ కుంకుంవలె పింగళ వర్నముతో స్వామి కాంతి సర్పమణూల కాంతివలె మనలను భ్రమింపచేస్తూ ప్రకాశిస్తున్నది.
రెండవ ఉపమానము
త్వక్-చర్మ
ఉత్తరీయము-అంగవస్త్రము
చర్మ అంగవస్త్రము మృదువుగానుండి ప్రకాశిస్తున్నదట.
అంతకు పూర్వము మదాంధ సింధురే
మదాంధసింధురస్ఫురత్త్వగుత్తరీయమేదురే
సింధురము-ఏనుగు నామవాచకము
ఆ ఏనుగు యొక్క ప్రత్యేకత
మదాంధ-మదజలమును స్రవించుచు విచక్షణను మరచినది.
కాని ఉపాధిని వీడి స్వామి స్పర్శను పొంది వాయు సంయోగముచే మృదువుగా మారినది.వాయు సహకారముచే స్వామి తాండవమునకు అనుగుణముగా కదులుతూ-కళకళలాడుతున్నది.
పాములు దిగ్వధువునకు తిలకమును దిద్దుచున్నవి.గజచర్మము వింజామరై వీచుచున్నది.
దానికి కారణము
భూతభర్తరి మనోవినోదము అద్భుతం.
అసమానమైన లీలగా పరమాత్మ చేయుచున్న తాండవమను ప్రపంచ చలనము.
అట్తి వినోదమును దర్శించాలని నా మనసు నిరీక్షించుచున్నది.
దానిలో ఒక పరమాణువునై పరబ్రహ్మములో దాగి నర్తించాలన్న ఆకాంక్షను అర్థిస్తున్నాడు సాధకుడు.
ఏక బిల్వం శివార్పణం.