Monday, December 19, 2022

AALO REMBAAVAAY-05

 


 ఐదవ పాశురం

***************


మాయనై మన్ను వడమదురై మైందనై

తుయపెరునీర్ యమునై యరైవరై

ఆయర్ కులత్తినిల్ తోన్రుం మణివిళక్కై

తాయై క్కుడల్ విళక్కం శెయద దామోదరనై

తూయోమాయ్ వందు నాం తుమలర్ తూవి త్తుళుదు

వాయినాల్ పాడి మనత్తినాల్ శిందిక్క

పోయ పిళైయుం పుగుదరువా నిన్రనవుం

తీయనిల్ తూశాగుం శెప్పు ఏలోరెంబావాయ్.


ఓం నమో భగవతే వాసుదేవాయ.

మోహనరూపా గోపాలా-ఊహాతీతము నీ లీల

********************

" పూర్ణమదం-పూర్ణమిదం

 పూర్ణాత్ పూర్ణమిదుచ్యతే"


 అన్నది వేదవాక్యము.దానిని విశదముగా ఈ ఐదు పాశురములలో సమన్వయపరచినది గోదమ్మ.మరింత స్పష్టము చేయుచు,నారాయణుడని వైకుంఠ ప్రస్తావనచేసినది పూర్ణస్వరూపమునే.దాని పొందుట బహుదుర్లభము.సుదీర్ఘ ప్రయాసతో కూడుకొనిన ప్రయత్నము.ఘోర తపశ్శక్తి  సంపన్నులకు మాత్రమే సాధ్యము.దానికంటె కొంచము సులభమైనది క్షీరాబ్ధిశయనుని  శయనునిది పూర్ణస్వరూపమే( పొందగలుగుట).బ్రహ్మాది దేవతలకు తమ వినతులను మాత్రమే సమర్పించుకొను సదవకాశమును కల్పించునది.అందరికి దుర్లభము.దానికంటె  కొంచము సులభతరమైనది అవతారమును  పూర్ణస్వరూపమే. వైభవము.కాని అది కాలపరిమితిని-కారణ పరిమితిని అనుసరించు నియమము కలిగినది.దానికంటె సులభ తమము అంతర్యామి తత్త్వము.అదియును   పూర్ణస్వరూపమేదాని గమనించుట-గ్రహించుట సులభతమమే అయినప్పటికి భాగవత గోష్టులు-నిత్యానుష్ఠానములపై ఆధారపడక తప్పదు.దానిని అని పలుకుట నిర్వచించలేని మహోన్నతత్త్వము .నా అశక్తతత ను  గోదమ్మ మన్నించును గాక.

 మన గోపికలు గోవులవెంట తిరుగుచు,పాలు-పెరుగు నమ్ముకొనుచు జీవించువారు.తపములెక్కడ?జపములెక్కడ?యజ్ఞములెక్కడ?యాగములెక్కడ?  పురాణములెక్కడ?




























?

? ప్రవచనములెక్కడ?మడి యెక్కడ? సడి ఎక్కడ?దడి ఎక్కడ?


   కాని వారు కోరుకొనునది నిరంతర స్వామి సంశ్లేషణము.అదియును వారిలో ఒకరిగా.వారితో ఒకటిగా.

  .అదే పరిపూర్ణత్వము తనకు తానుగా అందరిని  అనుక్షణము అలరించుటకు వారితో ఆడిపాడుటకు,తోడుగా నుండుటకు,చేరదీయుటకు,చేరువైన లీలావైభవము.

 అదియే పాశుర ప్రారంభ  పదమైన

 మాయనై- మైందనై

 వాత్సల్యమునందించుచున్న వాసుదేవుని పూర్ణత్వము.

  కనుకనే

ఆ మాయనై అనుగ్రహమే

 గోపకాంతలను త్రికరణశుద్ధులను చేసినది.వారిచే,

 తూయోమాయ్ వందు-పరిశుద్ధులమై వచ్చాము అని చెప్పించినది.

 మనత్తినాల్ సిందిక్క-మనస్సును సైతము పునీతము చేసినది.

ఆ మాయనై-అనుగ్రహమే

 వాయినాల్ పాడి -నోరారా కీర్తించుదాము అనిపించినది.

 వారు నిష్కళంకమనస్కులై స్వామిని

 తూవిళిత్తుదు-పవిత్రముగా భావించిపూజించుటకు వచ్చినారు.వారి చేతిలో

తూమలర్-పవిత్రమైన పుష్పములున్నాయట.

 రెండవ పాశురములో మలరిట్టు నా ముళిదోం అన్నారు.కాని స్వామికి పుష్పార్చనను సమర్పించటానికి వచ్చామంటు,

సత్యము-ఇంద్రియనిగ్రహము-శాంతము-దయ-మొదలగు పుష్పార్చనకు సిద్ధము చేసినది

 స్వామి అనుగ్రహమును మనస్పూర్తిగా అనుభవిస్తూ,నోరార కీర్తిస్తున్నది.

   కీర్తనములో వడమదుర అంటు ఉత్తరమధుర-దక్షిణమధుర అంటు విభజించినది.యమునజలమును పెరు-తుయిర్ అంటు పునీతముచేసినది.బృందావనమును తెప్పించినది.నందకుమారునిమెప్పించినది.యశోదను అనుగ్రహించినది.భువనములను చూపించినది.చిన్ని చీకి పోయిన తాటికి స్వామి ఉదరస్పర్శను అందించినది.

 పాశురములోని మరొక విశిష్ట పదము "సెప్పు ఏలో రెంబావాయ్" స్వామి పరముగా-గొల్లెత పరముగా అన్వయించుకుంటే,

   మొదటి అర్థము స్వామి ఆశ్రిత వాత్సల్యమును వ్రతములో కీర్తిద్దాము.

   స్వామిని మనపాపకర్మల ఫలితములను నిశ్శేషము చేశానని చెప్పు అని స్వామి నుండి వరమును తీసుకుందామని అత్యంత మనోహరముగా చెప్పింది గోదమ్మ..

 స్వామి వాటిని అనుగ్రహింప దలచుటయే వాటి అర్హత అని చెప్పుచున్నారు.

స్వామి ప్రకాశిస్తున్న పరంజ్యోతి.

 తల్లి యశోదకు మాత్రమే కాదు.

 గోకులమునంతటి ప్రకాశింపచేస్తున్న దీపము.

 కనుక మనము స్వామిని 

 పోయ పిళైయుం-గతములో చేసిన పాపములను

 పుగుదరువా నిన్రనవుం-తెలియక చేసిన తప్పులను

 తీయనిల్ తూశాగుం-పూర్తిగా తొలగించివేసాను అన్న

 మాటను స్వామి వద్ద నుండి తీసుకొనుటకు రండి అని పిలుస్తున్నది గోదమ్మ.పర నుండి ప్రాప్తి కి కదిలినది వారి అభ్యర్థనము స్వామిని కనులారా కాంచినంతనే.

 చెలులారా రండి మనము కూడా స్వామిని చేరి-కీర్తించి,మన యొక్క ఆగామి-సంచిత కర్మలను అంతేకాదు తెలియక చేసిన పాపములను తొలగించమని,తొలగిస్తానని "చెప్పు "అని మాటను తీసుకుందాము అని పిలుస్తూ,రేపటినుండి మనలను గోపికలను మేల్కొలుపు రెండవ విభాగములోనికి తనతో పాటుగా తీసుకుని వెళుతున్న,

 "ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం."



























 



TANOTU NAH SIVAH SIVAM-12

    తనోతు నః శివః శివం-12   *****************   "  వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే      జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...