ఆదిత్యహృదయము-శ్లోకము-27
**********************
ప్రార్థన
******
"జయతుజయతుసూర్యం సప్తలోకైక దీపం
తిమిర హరణ పాప ద్వేష దుఃఖస్య నాశం
అరుణకిరణగమ్యం ఆదిం ఆదిత్యమూర్తిం
సకలభువనవంద్యం భాస్కరం తం నమామి.
పూర్వ రంగము
********
అగస్త్య భగవానుడు ఆదిత్యస్తోత్ర ప్రభావమును ఉపదేశించి,మరలిన తదుపరి రాముని చింతాశోకములు దూరమయి,తనలోని శక్తిని తెలుసుకుని,ప్రియ మనస్కుడై రావణునితో యుద్ధముచేయుటకు సిద్ధమగుతున్నాడు.మనలో దాగిన శక్తి మనకు మార్గదర్శకము కాగలదు గమనిస్తే .
ప్రస్తుత శ్లోకము ఆదిత్య ఆరాధనా విధానము పరోక్షముగా "రాముడు అర్ఘ్యప్రదానము చేసెను" అని చెబుతూ చేతనులు పరమాత్మకు అందించవలసిన కృతజ్ఞతావిష్కారమును సూచిస్తున్నది.
ఆచమనము అనగా భాషా[అరముగా ద్రవమును స్వీకరించుట,త్రాగుట.
సూర్యభగవానునికి స్థూలముగా దోసిలో జలమునునింపుకుని అర్ఘ్యమిచ్చుట,సూక్ష్మముగా ఆచమనమును చేసి లోపలి పరమాత్మకు జలమును సమర్పించుట మనము చూస్తూనే ఉంటాము.
సనాతనము సూచించిన ఈనియమము షోడశ పూజా విధానములో/అథాంగ పూజలో,
"హస్తే ఆచమనీయం సమర్పయామి" అని,
పరమాత్మ మనకు అందించిన, మనలను పోషించుచున్న పంచభూతములకలోని జలమునకు కృతజ్ఞతను ఆవిష్కరించుకొనుటయే.
'శ్రద్ధా వా ఆపః" శ్రద్ధయే జలము.
"అపో నారాయణః"నారము అనగా నీరు/జలము.నారము నిలయముగాకలవాడు నారాయణుడు/సూర్య నారాయణుడు.
మలినములు తొలిగిన మనసు మన నిజస్వరూపమును పరిచయము చేస్తుంది.
ప్రస్తుత శ్లోకములో రామునికి అదేజరిగింది.
'గ్రాహక శక్తికి మనసే ద్వారము." మనసు వికసించినచో మర్మము తప్పుకుంటుంది.ఈ విషయమునే స్తోత్రము,
"నమః పద్మః ప్రబోధాయ" అనిచెనుతుంటే మన అజ్ఞానము కొలనులోని పద్మ వికసనమును మాత్రమేస్వీకరిస్తుంది.
కనుకనే త్యాగరాజ స్వామి,
అన్ని నీవనుచును అంతరంగమున
తిన్నగాను వెతికి తెలిసికొంటినయ్యా,
నిన్నేగాని మదిని నెన్నజాలనొరుల అని కీర్తించి తరించినాడు.
శ్లోకము
*****
" ఆదిత్యం ప్రేక్ష్య -జప్త్వా యత్వేదం తు పరం హర్షమవాప్తవాన్
"త్రిరాచమయా శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్."
వెడలెనుకోదండపాణి -అనుజ సౌమిత్రి గూడి
వెడలెనుకోదండ పాణి-కడలిమీద కోపముతో
వెడలెను కోదండపాణి-కడలి నుండి కదనమునకు ఇప్పుడు
.
పద విభాగమును పరిశీలిస్తే,
1.రామం-ఆదిత్యం ప్రేక్ష్య-ఆదిత్యుని దర్శించెను/చూసెను.
2.రామం ఆదిత్యునికి-త్రిః-ఆచమ్యా-మూడు సార్లు ఆచమనీయమును సమర్పించెను.సంధ్యావందనము.మూడు సంధ్యలను గౌరవించతం.
3.రామం త్రిరాచమ్యా-శుచిః భూత్వా-శుచికల శరీరము కలవాడయ్యెను.
4.రామం శుచియై -ఆదిత్యం జప్త్వా-ఆదిత్య స్తోత్రము జపించెను.ఫలితముగా,
5.
.రామం-హర్షమవాప్తవాన్-పులకాంతరంగుడాయెను.మనసు అనే ద్వారము తెరచుకుని,కర్తవ్యమునుసూచించినది.
కనుకనే త్యాగరాజు మనసా నీవు సహకరించకుంటే,నేను,
"మనసాఎటులోర్తునే,
నా మనవిని చేకొనవే అంటూ,
ద్రష్టగా మలచినమనసుతో రాముని దర్శించగలిగాడు.సేవించుకున్నాడు.
6.రామం-వీర్యవాను-రాముడు వీరుడిగా మారినాడు అని రాముడు ధరించిన,
7 రామం ధనురాదాయ-ధనువును ధరించినాడు/యుద్ధ సన్నద్ధతను సూచించాడు.
" కలిలో రాజస-తామస గుణములు కలవారిచెలిమిచేసి
కలిసి-మెలిసి తిరుగుచు మరికాలము గడుపకనే,
సులభముగా కడతేరను సూచనలను తెలియచేయు,
మదిని (త్యాగరాజు/రాముని) మాట,
వినవదేల "గుణవిహీన" అని మనసు యొక్కప్రాధాన్యతను తెలుసుకొనుచున్న వేళ,
"తం సూర్యం ప్రణమామ్యహం."