శ్లో : ప్రలోభాద్యైర్-అర్థాహరణ-పర-తంత్రో ధని-గృహే
ప్రవేశోద్యుక్తః-సన్ భ్రమతి బహుధా తస్కర-పతే
ఇమం చేతశ్-చోరం కథమ్-ఇహ సహే శన్కర విభో
తవాధీనం కృత్వా మయి నిరపరాధే కురు కృపామ్ 22
ప్రస్తుత శ్లోకములో ఆదిశంకరులు చంచలమైన మనస్సు అరిషడ్వర్గ ప్రభావితమైనపుడు ప్రవర్తించుతీరును మనకు తెలియ చేస్తూ,దానీ నియంత్రించగల వాడు కేవలము స్మరహరుడు మాత్రమే నని మరియొక మారు స్పష్టము చేస్తున్నారు. కామ-క్రోధ-లోభ-మోహములను గురించి ఒకసారి మాట్లాడుకుందాము. కామము/కోరిక తీరకపోతే క్రోధముగా మారుతుంది. ఒకవేల కోరిక కనుక తీరితే పొందిన ఆనందము మీద అభద్రతతో దానిని సంరక్షించుకోవాలనే అనురక్తితో ఎండమావుల వెనుక పరుగులుతీస్తుందన్నమాట. అదేవిధముగా నా మనసు లోభమునకు-నేనే దక్కించుకోవాలన్న అత్యాసతో,అదియును ప్రకృష్టమైన/వదిలివేయలేని లోభము నన్ను వదలక,అర్థమునకు-చోరత్వమునకు సైతము సిద్ధమగుచున్నది.ఇంకా తెలివైనదానిననుచు,ధనముగల ధనవంతుల గృహములలోనికి ప్రవేశించాలని సిద్ధమవుతుంది.భావము నకు బలమునిస్తూ పనులను చేయుటకు సిద్ధమవుతున్నది. ఇందులో ఏమాత్రము నా అపరాధములేదుసుమా.నేను నిన్ను మనస్పూర్తిగా నా హృదయకమలములో నివాసమునకు హ్వానించినప్పటికిని,నా మనసు అర్థమును దాచుకొనుటకై ధనికుల గృహములలో దానిని దోచుకొనుటకు సన్నద్ధమవుతున్నది. పరమేశా! నీ కృపతో దానిని సంస్కరించుము. సర్వం పార్వతీ పరమేశ్వర చరణారవిందార్పణమస్తు.