Wednesday, July 14, 2021

0007

 


  ధ్యాయేత్ ఈప్సిత సిధ్ధయేత్-07

  *****************************


   సత్యమును అసత్యమని -అసత్యమును సత్యమని ప్రత్యర్థిని ఓడించి,సమర్థించుకునేందుకు ఇచ్చిన అవకాశము  రానే వచ్చింది.


   గుండుసూది పడిన వినగలిగేనంతటి నిశ్శబ్దము.


   సమాధానమును సమర్థించవలసిన వారు ప్రశాంతముగానే ఉన్నారు.


    సమాధానమునకై ఎదురుచూస్తున్నవారి అభ్యంతరాలు ఆందోళనతో చిందరవందరగా ఉన్నాయి.


   సంస్కార సభావందన సమర్పణమును చేసి సమాధాన సమర్థనమునకు ఉపక్రమించుచున్న సమయమున,


    ప్రత్యర్థి అస్తవ్యస్త మస్తకము ఆర్యా! మాదొక చిన్న సందేహము.


  మీరు ఇప్పుడు చేసిన నమస్కారము బాహ్యమా? ఆంతరంగికమా? అదోమాదిరిగా చూస్తూ అడిగారు.


    బాహ్యమునకు మనము మనకు కనిపిస్తున్న రెండు అరచేతులను ముకుళిస్తున్నాము.


   ఈ రెండు అరచేతులను కాసేపు విశేష-సామాన్యములుగా భావిద్దాము.


    వాటిలో ఒక అరచేయి పంచభూతాత్మికమునకు అతీతము.అవి దానినేమిచేయలేవు.ఇంకొకటి పంచభూతాత్మిక అధీనము.మొదటిది బృహత్తు.రెండవది విశేషములో దాగిన చిత్తు.అత్యల్పమైన విశేషము తమను బృహత్తులో విలీనము చేసుకొనుమనుటయే నమస్కారము.


 పుష్పగుఛ్చము-పండ్ల బుట్ట-చిత్రపటములు ఏకత్వము యొక్క అనేకత్వ ప్రదర్శనములు.

   అయ్యా మరికొంచము వివరిస్తే....


  మనము చూపును కాసేపు ఉదాహరణముగా తీసుకుందాము.నిజమునకది నిర్వికారము అది దేనితో కలవనప్పుడు.


   కాని అది చూస్తున్న ప్రతి దృశ్యము దానిని ప్రభావితము చేస్తూ అనేకానేకములుగా విభజింపబడుతుంటుంది.


  ఒకరిని చూస్తే ప్రేమ ,వేరొకరిని చూస్తే పగ-ఇంకొకరిని చూస్తే జుగుప్స,ఒక వస్తువును చూస్తే ఆశ,మరొకదానిని చూస్తే రోత,....


  ఇలా పరిపరివిధములుగా ప్రకటింపబడుతుంది.


 మీ నుండి వస్తున్న సబ్దము-నా నుండివస్తున్న శబ్దము సామాన్యముగా చూస్తే ఏకము.విశేషముగా చూస్తే ప్రశ్న-సమాధానము.

   నాదం తనుమనిశం.

 నా గుండెచప్పుడు నాదార్చన చేస్తున్నట్లుంది.


   సర్వం పరమేశ్వర చరణారవిందార్పణమస్తు.


  కరుణ కొనసాగుతుంది.



   


   



TANOTU NAH SIVAH SIVAM-12

    తనోతు నః శివః శివం-12   *****************   "  వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే      జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...