ఆదిత్యహృదయము-శ్లోకము06
************************
ప్రార్థన
*****
" జయతు జయతు సూర్యం సప్తలోకైక దీపం
హిరణసమిత పాప ద్వేష దుఃఖస్యనాశం
అరుణకిరణగమ్యం ఆదిం ఆదిత్యమూర్తిం
సకలభువనవంద్యంభాస్కరం తం నమామి."
స్వామి రశ్ములు సర్వలోకములపై సంపూర్ణముగా విస్తరించి, చైతన్యపరుస్తున్నాయన్న మహర్షి,ప్రస్తుత శ్లోకములోరశ్మిభావనను విశదీకరిస్తున్నారు.
నిద్రయనుస్వల్పకాలికలయము,ప్రళయము అను దీర్ఘకాలిక లయములను తదుపరిజాగృతమును తేజస్విగా (మూలబీజముగా)నిర్వహించు స్వామిని ప్రస్తుతిస్తున్నాడు.
శ్లోకము
*******
" సర్వదేవాత్మకోహ్యేష తేజస్వి రశ్మిభావనః
ఏష దేవాం సురగణాంలోకాన్ పాతిగభస్తిభిః"
స్వామి సర్వదేవతా అసురశక్తుల సమన్వితమైన లోకములను చైతన్యపరచుటకు మూలకారణమే "రశ్మి భావనము"
రశ్మిభావనము అనగా,
"లోకంబులు లోకేశుడు లోకస్థులు
తెగినతుది నలోకంబగు పెంచీకటి
అవ్వలనెవ్వండేకాకృతి ' పరమాత్మను సేవిస్తానన్నాడు బమ్మెర పోతనామాత్యుడు.
" న ఉదయితి-నాస్తమేతి: స్వల్పకాలిక లయ (రేయిం-పగలు)దశ.కాలగమనములో ఆదిత్యునకు ఉదయాస్తమానములుండవు.
కాని దీర్ఘకాలికలయ యందు లోకములు-లోకస్థులు కానరావు.అవి అసలున్నవోలేవో కూడా తెలియదు.సమస్త ప్రపంచము లుప్తమై-గుప్తమై పోతుంది.సకలము తనను తాను మరగుపరచుకొనిన మర్మస్థితి.
నేను-నాది అన్న ద్వంద్వములు-త్రిగుణములు-చతుర్విధపురుషార్థములు-పంచభూతములు-అరిషడ్వర్గములు-సప్తలోకములు-అష్టదిక్కులు-నవగ్రహములు ,భూగోళ-ఖగోళములు తమ ఉనికిని ప్రకటింకొనగలిగిన స్థితిని స్వామి అనుగ్రహించుతయే "రశ్మిభావనము" పరమాత్మ తన సంకల్పముతోరశ్ములను వివశ్వము గావించి,ప్రాణశక్తుల కదలికతతో,
ఏకము-అనేకమై -మనలను మమేకము చేయుటయే,తేజస్వి యొక్క సర్వదేవతామకము.
రశ్మి భావనము-సర్వదేవాత్మకునిచే సమస్త దేవ-అసుర గుణములతో కూడిన జంగమ స్థావరాదులను ప్రకటింపచేస్తున్నది.దైవాసుర సంపదను స్పష్టీకరిస్తున్నది.
కొన్ని ఉపాధులు దైవగుణములను ఎక్కువగా-మరికొన్నిఉపాధులు అసురగుణములను ఎక్కువగా తమను ప్రేరేపిస్తుంటే-వాటిని కర్మలుగా మలచుకొని-ఫలితములను అనుభవిస్తుంటారు.
ఇదే విషయము మనము రామ-రావణులలో గమనిస్తుంటాము.
" అహంకారం-బలం-దర్పం కామం క్రొధంచ సంశ్రితామామాత్మపరదేహేషూ-అసుర గుణములుగాభగవానుడు గీతలోవివరించాడు.
అహింసా సత్యమక్రోధః త్యాగః శాంతిరపైశునం
దయాభూతేషు అని దైవీగుణములనుప్రస్తుతించినది భగవద్గీత.
ఆలోచనపూరిత స్వభావము దైవీసంపద-ఆలోచనరహిత స్వభావము అసుర సంపద.రెండింటి సమన్వయే సమస్త లోకములు.తాను సృష్టించిన సమస్తమును తన ప్రకాసగమన లక్షణముతో పోషించుచున్న ఆదిత్యుని సేవింపుము అని స్తోత్రమును రామచంద్రునకు అగస్త్యుడు వివరించుచున్న తరుణమున,
" తం సూర్యంప్రణమామ్యహం."