Thursday, October 7, 2021

0002

శ్రీ మాత్రే నమః ******************** 2. పత్తువిరల్ మోదిరం ఎత్తనై ప్రకాశమదు పాదకం దండగొలుసు పచ్చ వైఢూర్యముం ఇచ్చయై ఇళదిట్ట పాద శిలంబొళియుం ముత్తు మూకుత్తియం రత్తన పతకముం మోహన మాలై అళగుం ముళుదు వైఢూర్యముం పుష్పరాగత్తినిల్ ముడితిట్ట తాళి అళగుం చుత్తమై ఇరుకిండ్ర కాదనిల్ కమ్మలుం శెన్ కయ్యల్ పొన్ కంకణం జగమెల్లాం విళై పెద్ద ముఖమెల్లాం ఒళువిద చిరుకాతు కొప్పిన్ అళగుం అత్తివరదన్ తంగై శక్తిశివరూపత్తె అదయనాళ్ సొల్ల తిరమా అళగాన కాంచియిల్ పుగళాగ వాళ్విడుం అమ్మ కామాక్షి ఉమయే. ******** ముత్తైదువ మెట్టెలు పావనపాదముల ప్రకాశముల దండగొలుసు చీల మండలమున పచ్చ వైఢూర్యముల మువ్వల సవ్వడులును ముత్య ముక్కుపుడక రత్తన పతకములు హారములు కడుసుందరం మంగళ మొసంగిన గరళకంఠంబున అలరారు తాళి ఘనము శరణన్న వినిపించు చెవులకు కమ్మలు కరుణకరముల కంకణములు జగములన్నింటికి వెలుగుతానైనది జనని నీ వదన మిహిర. అత్తి వరదుని చెల్లి శక్తి శివ రూపిణివి అథముడిని వర్ణింపగా అవ్యాజ కరుణతో కాంచిలో కొలువైన అమ్మ కామాక్షి ఉమయే " సర్వారుణ అనవద్యాంగి-సర్వాభరణ భూషితా" అని లలిత రహస్యనామ స్రోత్రములు అమ్మను కీర్తిస్తుంటే,ఆదిపరాశక్తి అద్భుత సౌందర్యలహరీ ప్రవాహములో మునకలు వేసిన ఆది శంకరులు "సౌందర్య లహరి" అను సాక్షాత్కారమును సకల కళ్యాణ ప్రదాయినిగా ఆవిష్కరించారు. కామ కోటి-సౌందర్య సేవధి యైన తల్లి ప్రతి వీక్షణము అలగు.ఆభరనములు అళగు.అనుగ్రహము అళగు.ఆశీర్వచనము అళగు.తల్లి పాద-కేశాంతము అళగు. అళగు అంటే అందము అనుకుంటే తల్లి అనుగ్రహమే అళగు.అనుభూతియే అళగు.అనునయము అళగు. ఆ సౌందర్యము అనంత లహరీ ప్రవాహము.అఖండ తేజోవిరాజితము.అనన్య సామాన్యము.అపరాధ క్షమాపణము. తల్లీ అధముడనైన నేను నీ వైభవమును ఏమని వర్ణించగలను? అన్యథా సరనం నాస్తి త్వమేవ శరణం మమ" అనుకుంటూ,భావనలో, అమ్మా, నా మొర ఆలకించి,నన్ను కరుణించదలిచావా,ఒక్కసారి నీ పాద నమస్కార సౌభాగ్యమును ప్రసాదించు అని, భావనలో తల్లి పాదములను పట్టు కొనిన నా నుదుటిని, అమ్మ పదివేళ్లకు ధరించిన మెట్టెలు గట్టిగా వత్తుకుని,అమ్మ కరుణ నన్ను హత్తుకునేలా చేస్తున్నవేమో.లత్తుక అలదిన పాదములను పట్టుకొను ప్రయత్నములో అమ్మ పాదమంజీరములు నన్ను తడిమి అభయమునిస్తున్నవా అన్నట్లు సవ్వడులు చేస్తున్నాయి."కుపుత్రా సంజాతే-కుమాతా నభవతి".కరుణాంతరంగ, వాలిన నా శిరమును లేవనెత్తుటకు కొంచము వంగి,తన తామరతూడులవంటి కరములతో నన్ను లేవనెత్తువేళ అమ్మ కంకణ ధ్వనులు తామును అనుగ్రహము ప్రసాదగుణ ధ్వనులను చేయుచున్నామనుచున్నవేమో,బాహ్యమును మరచిన నేను అమ్మ కంఠహారములలో నవరత్న వజ్రవైఢూర్యముల నవనవోన్మేషకాంతులు నాలోని అజ్ఞానపు చీకట్లను తొలగించుటకు /తరిమివేయుటకు ఉద్యుక్తులై ఉజ్జ్వల ప్రకాశమాన భరితములైనవి.ఆహా ఏమి నా సౌభాగ్యము.అమ్మ ముత్యపు ముక్కుపుడక నన్ను సత్వగుణ సంశోభితుని చేయదలచినట్లున్నది.పుష్యరాగ కాంతులతో సర్వమంగళ గళ విరాజమానమైన తాళి నన్ను మంగళానుగ్రహపాత్రుని చేస్తున్నది. ఆళ్వారులచే "అత్తివరదన్" గా /వటపత్రసాయిగా కీర్తింపబడే వరదరాజస్వామి సోదరి సంసారప్రళయజలధి నుండి నన్ను రక్షించమని నీ దివ్య చరణములే శరణమని నమ్మినానమ్మా.(అమ్మ నవరత్నభూషిత నవనవోన్మేషిని గా కీర్తింపబడినది.నవరత్నములు స్వయం ప్రకాశకములు. మనది ప్రాకృత శరీరము.తల్లిది అప్రాకృత శరీరము.దానికి అమరిన/అలంకరింప బడిన ఆభరణములు కేవలము అలంకారములు కాదు ఆశీర్వాదములు అని అవగతమగుచున్నవేళ ఈ దీనుని ఉధ్ధరించుము తల్లీ. కామాక్షి తాయి దివ్య తిరువడిగళే శరణం

TANOTU NAH SIVAH SIVAM-12

    తనోతు నః శివః శివం-12   *****************   "  వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే      జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...