Wednesday, December 22, 2021

pPASURAM-07

తిరు చిట్రంబలం-పాశురం-07 *************************** తిరువెంబావాయ్-007 ****************** అన్నే ఇవయున్ శిలవో పల అమరర్ ఉన్నర్క అరియాన్ ఒరువన్ ఇరుంశీరాన్ శిన్నంగళ్ కేట్పా శివన్ ఎన్రె వాయ్ తిరప్పాయ్ తిన్నాయ నా మున్నం తీశేర్ మెళుగొప్పాయ్ ఎన్నాన ఎన్నరయన్ ఇన్నముదల్ ఎండ్రెన్నోం శొన్నంగళ్ నివ్వేరాయ్ ఇన్నం తుయిలిడియో వన్నం జపేదయిర్ పోలే కిడత్తియాల్ ఎన్నే తుయిలిల్ పరిశేలో రెంబావాయ్ తెన్నాడుడయ ఇరైవా పోట్రి ఎన్నాట్టురుక్కుం ఇరైవా పోట్రి **************************** తిరుమాణిక్యవాచగర్ ప్రస్తుత పాశురములో పరమాద్భుతములను ప్రస్తావిస్తూ పరమేశుని వైభవమును ప్రస్తుతిస్తున్నారు. అన్నే-అమ్మా, ఓ వన్నెంజల్- రాతిహృదయమా, పాషాణ హృదయా, ఎన్నే తుయిలిల్-ఇది ఏమి నిద్ర అమ్మా! నీ చుట్టు జరుగుచున్న శివనాదార్చనమును నీ చెవులు నీ మనసునకు చేర్చలేకున్నవి. ఒకసారి కన్నులు తెరిచి చూడు. నాదం తనుమనిశం శంకరం అంటూ,చేతములు మాత్రమే కాక, శిన్నంగళ్-శివ వాయిద్యములు/కొమ్ము బూరలు సైతము చేతనత్వమును పొంది శివ సంకీర్తనమును చేయుచున్నవి. కాని చేతవైన నీవు ఆరాధనమును విస్మరించి నిదురించుచున్నావు. సకల జగములు మేల్కాంచి,ముందు నీవు చెప్పినట్లుగానే, శివ నామమును వింటూనే అగ్నికి సోకిన మైనము వలె, మెళుందొప్పాయ్-ఆర్ద్రత నిండిన మనముతో, తెన్నాయన్నాం మున్నాం- దక్షిణామూర్తి అని స్తుతిని ప్రారంభించక ముందే,ఎంతో ఆనందముగా స్వామి విభవమును కీర్తించాలనుకుని -భక్తి పారవశ్యముతో కప్పివేయబడిన భావజాలమును భాషారూపముగా మలచలేక/ఆనంద పారవశ్యముతో ఆదిదేవుని, వైభవమును, ఇరుశీరార్-ఇది యని నిర్వచింజాలమని, అనుభవించవలసినేదేకాని అనువదించలేమని, ఒరువన్-ఒక్కదే అనేకములుగా నామరూపములతో భాసించుచున్నాడని,భాషించుచున్నదని భావిస్తూ,భజిస్తూ ఉండేదానివి. అంతే కాదు పరమాత్మ అకాయో-సర్వ కాయశ్చను అమితానందముతో ఆరాధిస్తూ,ఒకపరి, ఎన్నాన-నా తండ్రి ఎన్న రయన్-నా రాజు/నా ప్రభువు అంటూ అంతటితో తృప్తిని చెందక ఎన్నముదన్- నా జీవన హేతువు,నా అమృతము అంటూ పలవరించేదానివికదా. అదికదా నీ సహజ స్వభావము.కాని ఈ రోజు దానికి విరుధ్ధముగా పేదయిర్-అజ్ఞానమనే చీకటితో నిండిన నిద్రను ఆశ్రయించినావేమిటి? వెంతనే మేల్కాంచవమ్మా అని అంటున్నారు. మరి కొందరి భక్తుల అన్వయము ప్రకారము, అన్నే-అమ్మా వన్నెంజల్-కొండలరాజ కూతురా అమ్మా-నీవు మా స్వామి మాపలిట తల్లితండ్ర్లు.జగద్రక్షకులు. మేము మీ పిల్లలము. లోక సహజముగా తల్లి పిల్లలను మేల్కొలిపి వారికి సక్రమమైన మార్గమును చూపును. కాని జగన్మాతా ! పిల్లలమైన మాకు నిన్ను మేల్కొలిపే భాగ్యమును ప్రసాదించుటకై నిదురించుచున్నావా తల్లి! మా ప్రార్థనలను విని మమ్ములను అనుగ్రహించుటకు అర్థనారీశ్వరమైన -ఒరువన్ మీరొక్కరే సమర్థులు. మాయమోహముచే కరుడుగట్టిన శిలలవంటి మా మనసులను మీ కరుణామృత దృక్కులతో కరిగించి/కరుణించి మమ్ములను అనుగ్రహించుటకు మేల్కొనవమ్మా. శొన్నంగళ్ వివ్వేరాయ్-వివిధనామ రూపములలో ఆశ్రిత రక్షణమును చేయుటకు తుయిలిడియో నిదురను వీడి, వాయ్ తిరప్పావ్-మాతో మాట్లాడవమ్మా,అంటూ ఆమెను తమతో కలుపుకొని,శివ నోమునకు మరొక చెలిని మేల్కొలిపి తీసుకొని వెళ్ళటకు కదులుచున్నారు. అంబే శివే తిరువడిగళే శరణం.

TANOTU NAH SIVAH SIVAM-12

    తనోతు నః శివః శివం-12   *****************   "  వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే      జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...