శ్లో : ఉపేక్షా నో చేత్ కిం న హరసి భవద్-ధ్యాన-విముఖాం
దురాశా- భూయిష్ఠామ్ విధి-లిపిమ్-అశక్తో యది భవాన్
శిరస్-తద్-వదిధాత్రం న నఖలు సువృత్తం పశు-పతే
కథం వా నిర్-యత్నం కర-నఖ-ముఖేనైవ లులితమ్
కృపణులను రక్షించే కృపాళువుగా ప్రార్థించిన భక్తుడు స్వామి తనను రక్షించుతలో ఉపేక్షతో నున్నాడన్న తలపును ప్రస్తుతశ్లోకములో వివరించుచున్నారు.
ఓ శివా!
కిం -ఎందుకు
న హరసి-తొలగించుకున్నావు?
వేనిని అనగా
విధిలిపిం-బ్రహ్మ నా నుదుట వ్రాసిన వ్రాతను.
అంతేకాదు నన్ను అనుగ్రహించుటలో నీ జాప్యమునకు కారణము,
1.నీయొక్క ధ్యాన విముఖత్వము
2.దురాశాభూయిష్టము అను రెండు విషయములు కావచ్చును.కాని
నేనలా ఉండుటకు బ్రహ్మ నా నుదుటవ్రాసిన పాపకర్మల ఫలితము తక్క మరొకటికాదు.
నా ప్రవర్తనకాదు.శివా నీవు నాతో దానికి అశక్తము మమ-నేను అసక్తుడను కనుక ఉపేక్షించుచున్నాను అందువేమో,
కాని,అందులకు విరుద్ధమైన నీ పరాక్రం
సువృత్తములను నేను వినియుంటిని.
శంభో! నీవు నిః యత్నం-ప్రయత్నించకుండగనే
కర-చేతుల-నఖ-గోర్ల ముఖ-చివరలతో
కొనగోటితో,
లులితం-ఖండించితివి
ఖండించినది సామాన్యమైనదికాదు
సాక్షాత్తుగా నా నుదుటివ్రాతను రాసిన
శిరస్తావైధాత్రం-బ్రహ్మయొక్క ఐదవతలను.
బ్రహ్మ తలను కొనగోటితో తుంచివేసిన అదియును అప్రయత్నముగా నీ శౌర్యమునకు దానిని వ్రాసిన నా నుదుటివ్రాతను మార్చుట కష్టమా నీవు తలచుకుంటే.
కనుక ఉపేక్షించక దీనుని ఉద్ధరింపుము అని వేడుకుంటున్నాడు.
సర్వం పార్వతీ పరమేశ్వర పాదారవిందార్పణమస్తు.