"వాగ్వాదినీ వామకేశీ వహ్నిమండల వాసినీ"అని
"జ్వాలా మాలిని కాక్షిప్త వహ్ని ప్రాకార మథ్యగా"
అని శ్రీ లలితా రహస్య సహస్ర నామము అమ్మవారి అగ్నితత్త్వమును ప్రస్తుతించింది.
లోపలవైపునకు ఉన్న పది అగ్నితత్త్వ కోణములు కల ఈ ప్రాకారమును/చక్రమును "సర్వ రక్షాకర చక్రము" గాను,అంతర్దశారముగాను వ్యవహరిస్తారు.
ప్రాకామ్యసిద్ధి విరాజిత ఈ ఆవరణమును "సర్వజ్ఞా సదనము" అనికూడా సంభావిస్తారు.
ఈ ఆవరనములో పది విభిన్న అగ్ని శక్తులు "నిగర్భయోగినులుగా" సాధకునికి సహాయపడుతుంటాయి.అమ్మవారికీతి సమీపముగా సాధకుని పయనము అగుచున్నది కనుక గర్భస్థ శిశువు గా భావిస్తూ నిగర్భ యోగినులను దర్శించగలుగుతాడు అమ్మ అనుగ్రహముతో.
గర్భ అను పదమును ఆధారముగా అన్వయించుకుంటే నిగర్భ అనుపదమును నిక్షిప్తముగా ఆధారము చేయబడిన శక్తులుగా పూజింపవచ్చును.
జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఈ ప్రదేశములో నిగర్భయోగినులు ప్రక్షాళనము,జీర్ణక్రియ,శోషము,రసాయనీకరనము,విసర్జనము జరుగుటకు సహాయపడుతుంటాయి.
సర్వ అను ఉపసర్గతో నున్న,
1సర్వజ్ఞే
2.సర్వశక్తే
3.సర్వైశ్వర్యప్రదాయిని
4.సర్వజ్ఞానమయి
5.సర్వధారాస్వరూపే
6.సర్వపాపహరే
7.సర్వపాపహరే
8.సర్వానందమయీ
9.సర్వరక్షాస్వరూపే
10.సర్వేప్సిత ఫలప్రదే అను నామములతో,
చేతనులకు అడ్దంకులుగా నిలిచిన వ్యాధులను/పాపములను తొలగిస్తూ,జ్ఞానము/ఐశ్వర్యము,ఆనందము/రక్షణము/ఈప్సితమును అందిస్తూ,
సర్వజ్ఞత యను శక్తి సాధకునికి చక్రేశ్వరి "త్రిపురమాలిని" ఆశీర్వాదమునందించి,
సర్వరోగహరచక్ర ప్రవేశమునకు సన్నద్ధునిచేస్తాయి.
" యాదేవి సర్వభూతేషు కాంతి రూపేణ సంస్థితా
నమస్తస్త్యై నమస్తస్త్యై నమస్తస్త్యై నమో నమః."