Sunday, December 5, 2021
SERUTANAAY NAAYANAARU
" పుష్ప మూలే వసేత్ బ్రహ్మ మధ్యేచ కేశవ
పుష్పాగ్రేచ మహాదేవ సర్వదేవ స్థితో దళే"
చిదానందరూపా-శేరుతనాయ్ నాయనారు.
కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా
కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా
స్థిరమగు భక్తియను తిరువిరులను మాలగ తాను అల్లు
సమర్పణమును చేసి ,సాష్టాంగము మోకరిల్లు
కామేశుని ఆన కాన కాదనలేని విధంబున
కదిలిరి రాజుయు-రాణియు కథ నడిపించు పథంబున
లీలగ,పూమాలల సుగంధము బంధము వేయగ
హేలగ చేతబూని వాసనచూసెను రాణి నాసిక
అపరాధము చేసెననుచు నాసిక కోసెను సెరుత్తనాయి
ముక్తిని పొందగ రాణి ముక్కును కోయుట కారణమాయెగ
చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక
చిత్తము చేయు శివోహం జపంబు నా చింతలు తీర్చును గాక.
భగవంతుడు పుష్పములలో నిండి,కరుణతో వాటిని వికసింపచేయుచు,చూసి సంతసించుటను ఆధారము చేసుకొని పుష్పముల ద్వారా మనకు అర్థము-సౌఖ్యము-సాక్షాత్కారము అను మూడు దివ్య మహిమలకు శివుని చేతినున్న త్రిశూలములోని మూడు విభాగములను ప్రతీకగా కొలుస్తారు.భక్తులు.అతి స్వల్పకాలములో మనకు జగతి సృష్టి-స్థితి-లయములను వాటిని జరిపించే పరమేశ్వర తత్త్వమును చాటిచెబుతాయి పుష్పములు.అంతే కాదు.శబ్ద-చెవి,స్పర్శ -చర్మము,గంధ-నాసిక,రూప-నయనము,రస-నాలుక(మకరందము) మకరందముతో తుమ్మెదలు ఝుంకార వినబడునట్లు చేయు పంచేంద్రియ ప్రతిరూపములైన పూలు, తాము పంచ భూతేశ్వరుని పాదపద్మలయందు నిలిచి పరవశించాలనుకొనుట సమంజసమేకదా.
" ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు
పూలిమ్మని రెమ్మ రెమ్మకు
ఎంత తొందరలె హరు సేవకు
పొద్దు పొడవకముదె పూలిమ్మని."
అంటూ ఉదయముననే శేరు తునాయ్ నాయనారు పరమభక్తితో పూలమాలలల్లి పరమేశ్వరార్పితము చేసి పరవశించేవాడు. పొన్న-పొగడ-జిల్లేడు-తుమ్మి-ఉత్తరేణి-చెంగల్వ-మందార మొదలగు పుష్పములతో కాని,తత్ ఋతు పుష్పములతో గాని పరమేశుని అర్చిచిన సహస్ర గోదాన ఫలితము తథ్యమని నమ్మువాడు శేరుతనాయ్ నాయనారు,పార్వతీదేవియే చెప్పినదని పలు సుగంధపుష్పములను( అనాఘ్రత పుష్పములను) మాలలల్లి,మల్లేశుని అలంకరించి పులకరించేవాడు.తిలకిస్తున్న స్వామికి చిలిపి ఆలోచన వచ్చింది.రాణిని కథావస్తువు
చేసి,కథను ముందుకు నడిపించాడు . రాణినాసిక తాను ఏమి ఆశించిందో ఏమో,పుష్ప సుగంధమును ఆస్వాదించకుండా ఉండలేకపోయింది.పరిసరములను గుర్తించలేని పరవశముతో పూసువాసనను పీలుస్తు,నాయనారు కంట బడింది.కాలరుద్రుడైనాడు నాయనారు,రాణి ముక్కును కోసివేసాడు.కేకలు వినిన రాజు,జరిగిన విషయము తెలిసికొని,ఆ పూవును నాసికకు అందించిన చేతిని నరికి,జరిగిన అపరాధమునకు మన్నించమని శివుని వేడుకున్నాడు.
కరుణాంతరంగుడైన సాంబ శివుడు కటాక్షించి వారిని ధన్యులచేసెను.మరల మరల పుష్పించునట్లు చేయుట అనగా కరుణను మరల మరల వర్షింప చేయుటయే కదా.అట్టిపరమేశ్వరుడు మన హృదయములను అనాఘ్రాణిత సుమములను చేసి,ఆశీర్వదించును గాక.
( ఏక బిల్వం శివార్పణం.)
TIRU KORIPPU TONDA NAAYANAARU.
వార్ధక్యే చేంద్రియాణాం వికలగతిమతశ్చాధిదైవాదితాపైః
ప్రాప్తై రోగైర్వియోగైర్వ్యసనకృశతనోర్‍జ్ఞప్తిహీనం చ దీనమ్
మిథ్యామోహాభిలాషైర్భ్రమతి మమ మనో ధూర్జటేర్ధ్యానశూన్యం
క్షంతవ్యో మేఽపరాధః శివ శివ శివ భోః శ్రీ మహాదేవ శంభో "
చిదానందరూపా-తిరు తొండ నాయనారు.
***************************************
కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా
కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా
తిరు కురిప్ప తొండ నాయనారు నియమము
రజకవృత్తి యందే యతిరాజ భక్తి సంయమనము
మాసిన బట్టల మసిపూతలరేడు ఆ చాకిరేవులో
వ్రత భంగము చేసినాడు కురిపించిన జోరువానలో
అపరాధము జరిగినదని ఆ బండరాయికే, తన
తలను బాదుకొనుటయే సరియనినాడు వెంటనే
తగదని-నిలుమని కనపడి, కపర్ది కరుణించగ
తరియించగ నాయనారు తలబాదుకొనుటయే కారణమాయెగ
చిత్రము గాక ఏమిటిది చిదానందుని లీలలు గాక
చిత్తముచేయు శివోహం జపంబు చింతలుతీర్చుగాక.
తిరుకొరిప్పు తొండనాయనారు.
తిరు అరాధ్యుడు
కొరిప్పు క్రమశిక్షణ
ఏ సమయమునకు ఏ విధముగా శివునికి వేనితో అభిషేక-అర్చనాదులనులను జరుపుటలో క్రమమును పాటిచెడివాడు కనుక
తిరు కొరిప్పు తొండ నాయనారుగా ప్రసిధ్ధిగాంచెను. కాంచీ పురమునందు వల్లారు కుటుంబములో జన్మించిన నాయనారు
వృత్తిరీత్యా చాకలి.స్వధర్మో నిధనో శ్రేయ: అను సూక్తిననుసరించి శివ భక్తుల అవసరములను గుర్తించి,వారి మలిన కౌపీనములను శుభ్రపరచి తిరిగి వారికి పరమానందముతో ఇచ్చెడివాడు.
స్వధర్మములోనే స్వామి సేవా ధర్మమును మిళితము చేసికొనిన తొండనాయనారు భక్తిని పరీక్షించి,లోకారాధ్యునిగా చేయాలనుకున్నాడు.ఒకపేదశివయోగి వలె మలినవస్త్రములతో తొండనాయనారును సమీపించాడు.శివసేవా భాగ్యము లభించిన సుదినమని నాయనారు యోగినిసమీపించి,మలిన కౌపీనమును శుభ్రపరచుటకు అనుమతినివేడుకొన్నాడూ.తనకొకటే కౌపీనము ఉన్నందున(ధరించినది కాక) సంధ్యాసమయమునకు తన కౌపీనమును శుభ్రపరచి అందచేసెదెననిన అంగీకరింతునన్నాడు ఆ యోగి.సూర్య ప్రభల్తో చుర్రుమంటున్న వాతావరణమును చూసి,షరతుకు అంగీకరించాడు శివుడు.
" పవి పుష్పంబగు- అగ్ని మంచగు" అన్న ధూర్జటి మాట ప్రాపునకే కాదు పరీక్షకు కూడా నిజమే అవుతుంది. మన సక్కియనాయనారు రాళ్ళ పూజను పుష్పార్చనగా మార్చగలిగినది ఆ సదాశివుని కరుణయే కదా.ఉత్తర గర్భముననున్న పరీక్షిత్తుపై చేసిన దుష్ట ప్రయోగము మంటలు కక్కుతు అగ్ని వలె తాకబోవ పరమాత్మ తనలీలగా మంచుగా మార్చి శిశువునకు చల్లదనమును అందించెను కదా.విరోధాభాసమైన విశ్వేశ్వరుడు అదే విధముగా భానుని బాధ్యతను తొలగించి వరుణునికి వర్షించమన్నాడు.పరమేశ్వర లీలల పరమార్థమును తెలుసుకొనెననుట వెర్రిమాట.వజ్రము పువ్వుగా మారినట్లు శివుని లీలగా ఎండ వానయై కౌపీనమును తడిపేసినది.అన్నమాట నిలుపుకోలేదని తనతలను బండకు కొట్టుకున్న నాయనారును, అడ్డుకొని రక్షించిన అడ్డనామాలసామి మనందరిని రక్షించును గాక.
( ఏక బిల్వం శివార్పణం.)
KULACHCHIRAAYI NAAYANAARU
కులచ్చిరాయ్ నాయనారు
**********************
పాండ్యరాజ్యములో రాజవంసమున మన్మేల్కుడి యందు జన్మించిన కులచ్చిరాయి నాయనారు జైనము రాజును-రాజ్యమును ప్రభావితముచేయుహున్న సమయమునందున్న గొప్ప శివభక్తుడు.ప్రధానమంత్రి.మహారాణి తిరుమంగై కరసి నాయనారు తక్క మిగిలిన వారందరు జైనమతమునకు దాసోహమయిన వారే.అప్పటి మత ఉద్రిక్తత మహారాణిని విభూతిధారనను చేయలేని ఆక్షలను విధించినది.
మహారాణి-ప్రధానమంత్రి మతవిద్వేషములను అణచివేయుటకు ప్రయత్నించినప్పటికిని,
ముదిరిని వ్యాధిని కుదిరించే మందును ఇచ్చేవారు కనరాక యున్న సమయమున ,
మహారాణి మనో వేదనకు ఉపసమనమా అన్నట్లుగా,
వేదారణ్యేశ్వర స్వామి వారి ఆలయ త్ద్వారములు వేదనాభరితములై బిగిసిపోయినవా అన్నట్లు తెరుచుకొనుట మానివేసినవి.
మానవనేత్రములకు మాములు మనుషులకు తెలియచేసేందుకేమో మహనీయుల రాకకై వేయికన్నులతో వేచి చూచుచున్నవి.
వేకువ రేఖలుగా అప్పార్-జ్ఞాన సంబంధర్ తమ పాదమును మోపి ,తమ నామ సంకీర్తనముతో ,విషపూరిత విచక్షణారాహిత్యముపై తమ అమృతాభివర్షమును కురిపించి అజ్ఞానమును తొలగించివేశారు.మహాద్భుతము మూసిన తలుపులు.మూఢుల తలపులను తెరిపిస్తూ,తమంతట తామె తెరుచుకున్నవి.
మహారాణి చెవికి సోకిన ఈ వార్త మహానందభరితను చేయుటయే కాక,మదిలో చిన్న అశాకిరణముగా ,ఊరక రారు మహాత్ములు అన్న సూక్తిని బలపరచినది.
కాలముచేసే మాయాజాలమును తెలిసికొనుట ఎవరికిని సాధ్యము కాదు.
మూఢత్వము-నిగూఢత్వమునకు వ్యత్యాసము తెలియాలంటే శివుని లీలా విన్యాసము జరగాలంతే.
ఔషధము విలువ తెలియాలంటే వ్యాధి తీవ్రత ముదలాంతే.
భిషక్-వైద్యుడు ఔసధీనాం పతి కరుణ కలిగితే కానిపని ఏముంటుంది కాపాడ్
అటము తప్ప.
మహారాజుకు అస్వస్థత మొదలైనది.ఆపాదమస్తకము అతలాకుతలమవుతున్నది.అంతుచిక్కని అసహనము.కూర్చోలేడు.నించోలేడు.కదలికలను శరీరము కానిపని అంటున్నది.ఎందరో వైద్యులు-ఎన్నెన్నో మందులు.ఎమీ ప్రయోజనము లేకపోయినది.
మంత్రము-తంత్రము మరొక్కసారి తాము సరిచేయాలని చూసింది కుహనా భక్తుల కుతంతరూపముగా వచ్చి.
ఊహు.నిస్సహాయమై నేలచూపులు చూస్తున్న సమయమున ,
అది రోగ నివారనమో/సంస్కార సవరణమో ఆ సదాశివుని ప్రతిరూపములైన అప్పార్-జ్ఞానసంబంధర్ గా అదుగులను కదిలిస్తూ ముడులు విప్పటానికి పాండ్య రాజును చేరుకున్నది.
అన్యథా శరనం నాస్తి-త్వమేవ పరమేశ్వరా అని రాజు అందించిన పషాత్తాప ప్రనతులను అందుకుంది.
" ఓం అగ్నిరితి భస్మ వాయురిస్తి భస్మ
జలమితి భస్మ స్థలమితి భస్మ
వ్యోమేతి భస్మ సర్వం ఇహవా ఇదం భస్మ
మన ఏతాని చక్షుగిం షా భస్మాతి"
అంటూ వారిచే పరమశివుని భస్మము రాజుగారి దేహమును ఆచ్చాదిస్తూ,ఆశీర్వదించసాగినది.నామము శబ్దభేరియై రుగ్మతలను పారద్రోలింది ఏలినవాని ఆనగా.
మధురం శివ మంత్రం మదిలో మరువకే ఓ మనసా
ఇహపర సాధనే తలచగ సురుచిర పావనమే
నిన్రసెన్ నిడమార్-నిట్టనిలువుగా నిలుచున్నాడు మహారాజు.
అపూర్వ అనుగ్రహపాత్రుడైనాడు.పరమభతితో పరమేశ్వరాధనములో తరించాడు నిన్రసేర నిడమాన్ నాయనారుగా చిరస్మరణీయుడైనాడు.
నిన్రసేనను అనుగ్రహించిన నిటలాక్షుడు మనలనందరిని అనిశము సంరక్షించును గాక
ఏక బిల్వం శివార్పణం..
Subscribe to:
Posts (Atom)
TANOTU NAH SIVAH SIVAM-12
తనోతు నః శివః శివం-12 ***************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...
-
వందనం =========== అంబ వందనం జగదంబ వందనం సంబరాన కొలువుతీరె శక్తి వందనం భవతారిణి భగవతి భక్తి వందనం. పారిజాత అర్చనల పాదములకు వందనం పాప...
-
శార్దూలము... మాతంగి వర్ణన. ఊతం భద్ర సుభద్ర రుద్రరమణీమ్ ఉచ్చిష్ట చండాలినీమ్ భాతిమ్ రోహిత వస్త్ర సంపుటికరీమ్ ...
-
విబుధజనుల వలన విన్నంత-కన్నంత-తెలియపరచు ప్రయత్నము.తప్పులను సవరించి మరింత సుసంపన్నము చేయగలరని ప్రార్థిస్తూ, శివతాండవ స్తుతి భావము. ****...