Sunday, December 5, 2021

TIRU KORIPPU TONDA NAAYANAARU.

వార్ధక్యే చేంద్రియాణాం వికలగతిమతశ్చాధిదైవాదితాపైః ప్రాప్తై రోగైర్వియోగైర్వ్యసనకృశతనోర్‍జ్ఞప్తిహీనం చ దీనమ్ మిథ్యామోహాభిలాషైర్భ్రమతి మమ మనో ధూర్జటేర్ధ్యానశూన్యం క్షంతవ్యో మేఽపరాధః శివ శివ శివ భోః శ్రీ మహాదేవ శంభో " చిదానందరూపా-తిరు తొండ నాయనారు. *************************************** కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా తిరు కురిప్ప తొండ నాయనారు నియమము రజకవృత్తి యందే యతిరాజ భక్తి సంయమనము మాసిన బట్టల మసిపూతలరేడు ఆ చాకిరేవులో వ్రత భంగము చేసినాడు కురిపించిన జోరువానలో అపరాధము జరిగినదని ఆ బండరాయికే, తన తలను బాదుకొనుటయే సరియనినాడు వెంటనే తగదని-నిలుమని కనపడి, కపర్ది కరుణించగ తరియించగ నాయనారు తలబాదుకొనుటయే కారణమాయెగ చిత్రము గాక ఏమిటిది చిదానందుని లీలలు గాక చిత్తముచేయు శివోహం జపంబు చింతలుతీర్చుగాక. తిరుకొరిప్పు తొండనాయనారు. తిరు అరాధ్యుడు కొరిప్పు క్రమశిక్షణ ఏ సమయమునకు ఏ విధముగా శివునికి వేనితో అభిషేక-అర్చనాదులనులను జరుపుటలో క్రమమును పాటిచెడివాడు కనుక తిరు కొరిప్పు తొండ నాయనారుగా ప్రసిధ్ధిగాంచెను. కాంచీ పురమునందు వల్లారు కుటుంబములో జన్మించిన నాయనారు వృత్తిరీత్యా చాకలి.స్వధర్మో నిధనో శ్రేయ: అను సూక్తిననుసరించి శివ భక్తుల అవసరములను గుర్తించి,వారి మలిన కౌపీనములను శుభ్రపరచి తిరిగి వారికి పరమానందముతో ఇచ్చెడివాడు. స్వధర్మములోనే స్వామి సేవా ధర్మమును మిళితము చేసికొనిన తొండనాయనారు భక్తిని పరీక్షించి,లోకారాధ్యునిగా చేయాలనుకున్నాడు.ఒకపేదశివయోగి వలె మలినవస్త్రములతో తొండనాయనారును సమీపించాడు.శివసేవా భాగ్యము లభించిన సుదినమని నాయనారు యోగినిసమీపించి,మలిన కౌపీనమును శుభ్రపరచుటకు అనుమతినివేడుకొన్నాడూ.తనకొకటే కౌపీనము ఉన్నందున(ధరించినది కాక) సంధ్యాసమయమునకు తన కౌపీనమును శుభ్రపరచి అందచేసెదెననిన అంగీకరింతునన్నాడు ఆ యోగి.సూర్య ప్రభల్తో చుర్రుమంటున్న వాతావరణమును చూసి,షరతుకు అంగీకరించాడు శివుడు. " పవి పుష్పంబగు- అగ్ని మంచగు" అన్న ధూర్జటి మాట ప్రాపునకే కాదు పరీక్షకు కూడా నిజమే అవుతుంది. మన సక్కియనాయనారు రాళ్ళ పూజను పుష్పార్చనగా మార్చగలిగినది ఆ సదాశివుని కరుణయే కదా.ఉత్తర గర్భముననున్న పరీక్షిత్తుపై చేసిన దుష్ట ప్రయోగము మంటలు కక్కుతు అగ్ని వలె తాకబోవ పరమాత్మ తనలీలగా మంచుగా మార్చి శిశువునకు చల్లదనమును అందించెను కదా.విరోధాభాసమైన విశ్వేశ్వరుడు అదే విధముగా భానుని బాధ్యతను తొలగించి వరుణునికి వర్షించమన్నాడు.పరమేశ్వర లీలల పరమార్థమును తెలుసుకొనెననుట వెర్రిమాట.వజ్రము పువ్వుగా మారినట్లు శివుని లీలగా ఎండ వానయై కౌపీనమును తడిపేసినది.అన్నమాట నిలుపుకోలేదని తనతలను బండకు కొట్టుకున్న నాయనారును, అడ్డుకొని రక్షించిన అడ్డనామాలసామి మనందరిని రక్షించును గాక. ( ఏక బిల్వం శివార్పణం.)

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...