నః ప్రయచ్చంతి సౌఖ్యం-12
******************************
భగవంతుడు-భక్తుడు ఆలిని అర్థికిచ్చిన వారే.
" నమః సోమాయహ-రుద్రాయచ" ఉమా సమేతుదై యున్న రుద్రునకు నమస్కారములు.
ఉమ అనుపదములోని ఉ-ం-అ అను వర్నములను విలోమముగ చూసినచో అది ప్రణవస్వరూపమైన ఓంకారము.ఉమా సహితుదైన ఈశ్వరుడు సర్వశక్తిమంతుడు సర్వ సమర్థుడు అని కేనోపనిషత్తు స్తుతించుచున్నది.
నమో మీడుష్తమాయచేషుమతేచ" ధారగా సంతోషములనువర్షింపచేయు రుద్రా నమస్కారములు.
భూకైలాసమును ప్రకటించుటకు భూతనాథుడు రావణభక్తిని రాణింప. చేసినాడు.తల్లి శివార్చన సమయమున సైకతలింగమును చెదరగొట్టించి,తనకథను మొదలుపెట్టాడు.కైలాసనాథుని దేశనమునకు కఠినతపమును కావింపచేసినాడు.అకుంఠిత దీక్షతో ఆ సదాశివుని హృదయకుహరమున ప్రవేశింప కలిగినాడు పదితలలవాడు.ఓం నమో గహ్వరేష్ఠాయచ నమో నమః".భక్త సులభుడు భవానీ సమేతుడై ప్రత్యక్షమై ఏమి వరము కావలెనో కోరుకోమన్నాడు.ఆత్మలింగమును అర్థించుటను మరచినాడు ఆ అసురబ్రహ్మ.దీనికి కారణము నమః యామ్యాయచ-క్షేమ్యాయచ".దుష్ట శిక్షణ-శిష్ట రక్షణ జరుపవలసిన వాని మాయ.కథను ముందుకు నడిపించ దలచినాడు గ్రుస్నుడు మరియు గ్రుస్న పతి.విషయలంపటము చుట్టుకున్న రావణుడు వివేకమును విస్మరించి జగన్మాతను ఆలిని చేసుకుందామని అర్థించాడు.అంగీకరించాడు ఆదిదేవుడు అడిగినదే తడవుగా.తల్లిని తీసుకుని తరలి వెళ్ళుతున్నాడు తమకము నిండిన మనసుతో.
'నమః స్రుత్యాయచ-పథ్యాయచ" స్రుతి అనగా కాలిబాట.అందులోను ఇరుకైనది.అ బాటయందున్నరుద్రుడు నారదుడై మనవనికి కనువిప్పును కలిగించెను.నమః ఆతార్యాయచ" సంసార వ్యామోహమును నశింపచేయు జగత్పిత జగదీశ్వరిని తిరిగి తనదగ్గరకు రప్పించుకొని జరిగినదానికి రావణుని పశ్చాత్తదగ్ధ హృదయునిగ పునీతుని చేశాడు.పాపము ప్రతిహరమగు గాక.పాహి పాహి పరమేశా -శరణు.
దాత-యాచకుడు రెండు తానైన స్వామి ఎలా యాచకుదయ్యడో,తనభక్తుని భార్యమై మోహమును చూపి,తనకుకావలెనని ఎలా అర్థించాడో తెలుసుకుందాము.ఏమిటయా నీ లీల-లయకర!
శివుడు బ్రాహ్మణ వేషములో ఇంటిముందు నిలిచాడు
ఇంగితమును విస్మరించి నాయనారు ఇల్లాలిని అడిగాడు
లేదనుమాట పలుకలేనివాడైన ఇయర్వగై నాయనారు
నివేదనమనుకున్నాడు, నిజపత్నిని పంపించాడు
బ్రాహ్మణునకు-భార్యకు బాటలో బాసట తానైనాడు
అడ్డువచ్చిన వారిని ఎదురొడ్డిన వాడయ్యాడు
శర్వునకు నమస్కరించి నిశ్చయ భక్తితో వెనుదిరిగెనుగా
నిర్వాణమునందీయగ భార్యయే కారణమాయెగ
ఇంతకీ ఎవరు ఈ ఇయర్వగై? అర్థించిన బ్రాహ్మణునికి భార్యను నిస్సంకోచముగాసమర్పించి నివేదనమనుకున్న నిష్ఠాతత్పరుడు?
కావేరి పట్టణ వాసుడైన ఇయర్వగై నాయనారు నరనరాల్లో దాతృత్వమును జీర్ణించుకొన్న గొప్పశివ భక్తుడు.శివ భక్తులను శివ స్వరూపముగాభావించి,అడిగిన దానిని దానమిచ్చి,వారి సంతోషమే పరమేశ్వర అనుగ్రహ విశేషముగా భావించి,సంతసించెడివాడు.
జీవుడు దేవుడు కావాలంటే శివుడు ఎన్ని పావులు కదపాలో-ఎన్ని కథలను నడపాలో.ఆ రావణ బ్రహ్మకు ఆలినిచ్చిన దాత కదా.వేరొకరి ఆలినికోరగా యాచకుడిగా మారదలచాడు." ఓం నమః శివాయ" త్రిపుండ్ర ధారియైనాయనారు ఇంటిముందు నిలిచాడు.శివ స్వరూపము అత్యంత భక్తిశ్రద్ధలతో సేవించారు నాయనారు దంపతులు.చల్లకు వచ్చి ముంతను దాచటమెందుకని చల్లగా సంభాషణలో నాయనారు అడిగినది లేదనక ఇస్తావట.నిజమేనా అని సందేహముగా అడిగాడు.స్వామి నా దగ్గర ఉన్నది అయితే తప్పకుండా ఇస్తాను అన్నాడు అమాయకంగా ఇయర్వగై.నీ భార్యను కోరుతున్నానన్నడు.వెంటనే సంశయించక అందుకు అంగీకరించినాడు.పతివ్రతా శిరోమణి పరమప్రీతితో యతి సేవకు సిద్ధమయింది.
పినాకపాణి పిరికితనమును నటిస్తూ నాయనారు భార్యను తనతో తీసుకువెళతానని,దారిలో ఎవరైనతనను అడ్డగించవచ్చని,కనుక వారిద్దరు ఊరు దాటువరకు రక్షణగా నాయనారును తోడు రమ్మన్నాడు. ఆతతావియైన అనగాఆయుధమునుధరించి రక్షించు రుద్రుని వలె నాయనారుఆయుధధారియై వారిని అనుసరించాడు.అడ్డువచ్చిన వారినిచూసి బెదిరిన బ్రాహ్మణునితో నాయనారు భార్య మీరు భయపడవలదు.నా భర్తవారిని మట్టికరిపించి,మనలను క్షేమముగా పొలిమేర దాటిస్తారని సెలవిచ్చింది.బలిచక్రవర్తి వలె స్వామిచేయి క్రింద-నాచేయి దాతగ పైన అని ఆనుకోని నాయనారు మాటకు కట్టుబడి, అడ్డువచ్చిన వారిని ఓడించి,వీరిద్దరిని అనుసరించుచుండెను.
తిరుచ్చైకాడు దేవాలయము దగ్గర శివుడు నాయనారును తిరిగి వెళ్లిపొమ్మనెను.కొంత దూరము వెళ్ళినాడో లేదో నాయనారు అని గట్టిగా పిలిచి అదృశ్యమయ్యాడు శివుడు " నమః శంకరాయచ-మయస్కరాయచ." ఇహపరములను అనుగ్రహించు రుద్రా నీకు నమో వాకములు.
ఇహపరములను అనుగ్రహించు రుద్రా నీకు నమో వాకములు.
.వెనుతిరిగిననాయనారుకుభా ర్యఒక్కతే కనిపించింది.పార్వతీ పరమేశ్వరులు దీవించారు.త్రికరణ శుద్ధిగా ధర్మపత్నిని శివునకు సమర్పించిన ఇయర్వగై నాయనారును కటాక్షించిన పార్వతి పరమేశ్వరులు మనందరిని కటాక్షించెదరు గాక
( ఏక బిల్వం శివార్పణం)
( ఏక బిల్వం శివార్పణం.)