Sunday, September 29, 2019

PADISAKTULA PARAMAARTHAMU.-KAALI.

 పదిశక్తుల పరమార్థము - కాళి ప్రథమశక్తి.
 ************************
 ప్రియ మిత్రులారా! మీకు తెలియని విశేషములు కావు.కాని నా తపన అమ్మ తత్త్వములోని మీ అందరితో పంచుకోవాలనే .ఈ ప్రక్రియ ప్రణాలికకు తన అమూల్యమైన సమయమును-విజ్ఞానమును అందించిన భక్తునిపై ఆ తల్లి దయ అనవరతము వర్షించనీ.ద్వంద్వమయమైనఈ జగతిలో రాత్రింబవళ్ళు-సుఖదుఃఖములు-జ్ఞాన-అజ్ఞానములు-కలిమి-లేములు-ఉఛ్చ్వాస-నిశ్వాసములు-స్త్ర్ర్పురుషులు ఉన్నట్లే శ్రీవిద్యోపానలో దక్షిణాచార-వామాహారములు ప్రాంతములను బట్టి,పరిసరములను బట్టి పరంపరను బట్టి ద్వివిధములుగా నున్నందున కాళి శక్తిని పూజావిధానమును తాంత్రికముగా అనుకుంటు అనుగ్రహమునకు దూరమవుచున్నాము.

  అర్థనారీశ్వరమైన మహాశక్తి కాళి తన సామర్థ్యముతో సామరస్యము కల్పిస్తూ,లయబధ్ధముగా ఊగిసలాడుస్తూ( కాలస్వరూపముగా)జగతిని ఒక స్థితి నుండి మరొక స్థితికి నడిపిస్తున్న కాళీతత్త్వము ఎంతగొప్పదో మనము అర్థముచేసుకుంటే మాట కరుకు-మనసు చెరుకు అన్నట్ల్కుగా కాళి తత్త్వము లోని సమభావము ( అగ్నితత్త్వముగా అన్ని వస్తువుల యందు సమభావము,కాలాతీత స్వభావము గతము తలచుకోదు-తెలియని భవిష్యత్తు ఆలోచించదు)సృష్టి-స్థితి-లయములకు చలించని స్థితప్రజ్ఞత ,లోభమోహములకు దూరము,అన్నిటికన్న ముఖ్యమైనది పునర్నిర్మాణ క్రియాశీలత మనము పాటిస్తే ద్వంద్వ వైఖరి తొలగి తల్లీ నువ్వే నేనే నీవు అని త్వమేవాహం కామా.అలా మనలను మలచు ఆ మహాకాళి మన అమ్మ కదా!

  మహాకాలి మాత చరణారవిందార్పణమస్తు.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...