Monday, September 14, 2020
SIVA SANKALPAMU-106
ఓం నమః శివాయ-106
********************
ఆనంద భాష్పాలతో అభిషేకము చేయనా
భక్తి మకరందమును చందనముగ పూయనా
ఆది-అనాది లేదంటు బూదిని నే పూయనా
శాంతి సహనపుష్పాలతో పూజలనే చేయనా
పాప రహితము అనే దీపము వెలిగించనా
పొగడ్తపూల వాసనలనే పొగలుగ నే వేయనా
లబ్బు-డబ్బు శబ్దాలతో స్తొత్రములే చేయనా
ఉచ్చ్వాశ-నిశ్వాస వింజామరలను వీచనా
అరిషడ్వర్గములు లేని ఆతిధ్యమునీయనా
హర హర మహాదేవ అంటు హారతులే ఇయ్యనా
దాసోహం-దాసోహం అంటు నే ధన్యతనే పొందనా
నా పక్కనే ఉన్నావురా చూడ చక్కనైన శంకరా!
అప్రాకృత శరీరం తం అతి మన్మథ రూపిణం శివా.
సచ్చిదానంద రూపాయ సదాశివాయతే నమః.
నా కోసం రూపమును ప్రకటించుకొని,నాచే పరిహాసము చేయించుకొని,పరమ దయతో నాకు పరతత్త్వమును పరిచయమును చేసిన పరమాత్మా! ఇప్పుడు ఎవరైనా నన్ను నీ రూపము గురించి అడిగారనుకో,ఆనందముతో నీ సూక్ష్మ తత్త్వముతో పాటు,నీ స్థూల రూపమును కూడా అగ్ని నీ ముఖమని-పరాపరాత్మకము ఆత్మ యని,కాలము గతి యని,భూమి నీ పాదపీఠమని,ఊరుపు గాలి యని,నాలుక జలోత్పత్తి స్థానమని,దిశలు(దిక్కులు) కర్ణంబులని,దివము నాభియని,సూర్యుడు కన్నులని,శుక్లము సలిలమని,జఠరము జలధులని,వేదములు (ఛందములు) ధాతువులని,పంచ ముఖములు విస్తరించినపుడు ఉపనిషత్తులని,హృదయమే ధర్మమని ఎంతో ఇష్టముతో నిన్ను దర్శించనీయి అష్టమూర్తి వైభవమును స్పష్ట పరచనీ తండ్రీ.అనుమానముతో మొదలైన భక్తి అనందాబ్ధిలో తేలియాడనీ.
ఏక బిల్వం శివార్పణం.
Subscribe to:
Post Comments (Atom)
TANOTU NAH SIVAH SIVAM-13
. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...
-
వందనం =========== అంబ వందనం జగదంబ వందనం సంబరాన కొలువుతీరె శక్తి వందనం భవతారిణి భగవతి భక్తి వందనం. పారిజాత అర్చనల పాదములకు వందనం పాప...
-
శార్దూలము... మాతంగి వర్ణన. ఊతం భద్ర సుభద్ర రుద్రరమణీమ్ ఉచ్చిష్ట చండాలినీమ్ భాతిమ్ రోహిత వస్త్ర సంపుటికరీమ్ ...
-
విబుధజనుల వలన విన్నంత-కన్నంత-తెలియపరచు ప్రయత్నము.తప్పులను సవరించి మరింత సుసంపన్నము చేయగలరని ప్రార్థిస్తూ, శివతాండవ స్తుతి భావము. ****...
No comments:
Post a Comment