శ్లోకము
" ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిః తవ వృక్షోధ బిల్వః
తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయశ్చ బాహ్య అలక్ష్మీః"
తపఃఫలము బిల్వవృక్షమై ఆదిత్యవర్నముతో ప్రకాశిస్త్యున్నది.లక్ష్మీదేవి తపఫలముగా ఉదయిస్తున్న భానుతేజముతో అనుగ్రహ సంకేతముగా బిల్వవృక్షము లక్ష్మీదేవిచే సృష్టించబడినది.
ఏవిధముగా సూర్యోదయము చీకట్లను తరిమివేసి అఖండకాంతితో ఉంటుందో అదేవిధముగా లక్ష్మీదేవికరుణకు ప్రతిరూపముగా "బిల్వవృక్షము"భానుతేజముతో విరాజిల్లుతు ప్రకటింపబడినది.
ఇక్కడ మనము వనస్పతి-బిల్వ వృక్షము గురించి తెలుసుకునే ప్రయత్నమునుచేద్దాము.
ఇక్కడనుదంతు/ఉదంతు అన్న శబ్దము ప్రయోగించబడినది.తల్లివనలక్ష్మియై పచ్చని వనములను సృష్టించింది.
లక్ష్మీదేవి వనస్పతి.వనః+పతి-ఋగ్వేద 9వ మడలములో ప్రస్తావించిన ప్రకారము అడవికి అధిపతిగా ఉండే దేవతామూర్తి "వనస్పతి".
ఇక్కడ లక్ష్మీదేవికి-బిల్వవృక్షమునకు అభేదము సూచింపబడినది.
చరక సంహిత/సుశ్రిత వృక్షములలో ఉన్నతమైనదానిగా బిల్వవృక్షమును పేర్కొనినవి.
వేయికొమ్మలతో వసివాడక నిత్యము బంగరు ఛాయతో ప్రకాశించేవృక్షములు "వనస్పతి"
వామనపురాణకథనము ప్రకారము బిల్వవృక్షము లక్ష్మీదేవి హస్తము నుండి ఉద్భవించిన మహాప్రసాదము.
త్రిగుణాతీతముగా పుష్పించకుండానే ఫలప్రదమునొసగు వృక్షములను వనస్పతి అను సంప్రదాయము కలదు.
చీకటి తెరలను తొలగించేది ఆదిత్యవర్ణము.
మాయ అవనికను తొలగించేది లక్ష్మీకటాక్షము.
బాహ్యపు చీకట్లను మాత్రమే కాక అంతరంగ అజ్ఞానమును సైతము తొలగించేది అమ్మ తపఫలమైన బిల్వవృక్షము.
'వామ పత్రే వసేత్ బ్రహ్మ పద్మనాభశ్చ దక్షిణే
పత్రాగ్రే లోక పాలశ్చ మధ్యపత్రే సదాశివః"
స్కాంద పురాణ కథనము ప్రకారము
మూడు పత్రములు ఒకే కాండమును ఆశ్రయించి ఉంటాయి.ఆ మూడు పత్రములే,
1.కర్త-కర్మ-క్రియ అనుమూడు విభాగములుగాను
2.సౄష్టి-స్థితి-సంహారము అను మూడు పనులుగాను
3.సత్వ-రజ-తమో గుణవిభాగముగాను
4.స్థూల-సూక్ష్మ-కారణ శరీరములుగాను
5.జాగ్రత్-స్వప్న-సుషుప్తి అవస్థలుగాను
6.భూత-వర్తమాన-భవిష్యత్కాలము గాను నిర్ధారిస్తూ,
వీటన్నింటికి ఆధారమైన పరబ్రహ్మమును ఆశ్రయించియున్న కాడగా అభివర్ణిస్తారు.
బిల్వ పత్రము సకలదేవతా సమాహారముగాను
బిల్వ ఫలమును జ్ఞాన/శ్రీ ఫలముగాను
బిల్వ వృక్షమును లక్ష్మీస్వరూపముగాను
బిల్వ వనమును కాశీక్షత్రముగాను
అసలిన్ని మాటలెందుకు?
" త్రిపుటీ జ్ఞానమే బిల్వపత్రము."
పువ్వు నుండి కాకుండా జ్ఞానఫలమును సృష్టించగలిగినది
బిల్వవృక్షము.
లక్ష్మీదేవి తపః ఫలితముగా ఆవిర్భవించినది(స్కాంద పురాణము)
తల్లీ నీ పూజ అరిషడ్వర్గములను అంతర్మాయను,షడూర్ములను బాహ్యమాయను తొలగించగలుగు సామర్థ్యమును కలిగినవి.
హిరణ్మయీం లక్ష్మీం సదా స్మరామి.
No comments:
Post a Comment