సందర్య లహరి-58
పరమపావనమైన నీ పాదరజకణము
పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము
వేదోచ్చరణనుతెలుపు శిక్ష అను శాస్త్రము
దోషరహిత పద సంస్కారమైనవ్యాకరణము
గణముల కలయిక మెళకువలు తెలుపు ఛందము
వేద మంత్ర ఉత్పత్తిని తెలియచేయు నిరుక్తము
కాల నియమ వివరణ విధానముగా జ్యోతిషము
యజ్ఞ-యాగ మాచరించ విధానమైన కల్పము
అమ్మ చుబుకమే తమకు పుట్టినిల్లనుచును
ఆమ్నాయముల అధ్యయమునకు ఆలంబనమైన వేళ
నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
మానస విహారి! ఓ సందర్య లహరి.
ఛందోబద్ధమైన వేదమును ఋక్కులు అనుటచే దానికి సంబంధించినవేదమును"ఋగ్వేదము" అనియు,గద్యాత్మకమైన వేదమును యజస్సు గలది కనుక "యజుర్వేదము" అనియు,గీతాత్మకమైన వేదము సామం కనుక " సామవేదము" అంటారని,పద్య గద్యాత్మకమైన వేదమును "అధర్వణ వేదము" అని అలంకారికులు విశ్వసిస్తారు.వారుఈ విషమును,వేదమును"త్రయి" అనుటకు మూడు వేదములే అన్న వాదనసరికాదని,జ్ఞాన-కర్మ-ఉపాసన అను మూడు సంస్కారములను తెలియచేయునవి వేదములు అని కీర్తిస్తారు.అమ్మ చుబుకము (గడ్డము) నుండి ఆవిర్భవించిన ఆరు వేదాంగములు వేద అర్థమును తెలుసుకొనువారికి సహాయపడుటయే తమ విధిగా భావించి,సహాయమునుచేయుచున్న సమయమున,చెంతనే నున్న నా చేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.
No comments:
Post a Comment