Tuesday, March 27, 2018

sSAUNDARYA LAHARI-60


   సౌందర్య లహరి-సకల శాస్త్రాలు

  పరమపావనమైన  నీ పాదరజకణము
  పతిత పాలకమైనపరమాత్మ స్వరూపము

 శ్రీమాత జిహ్వ నుండి వెలువడిన సరస్వతీ రూపాలు
 పలుకులు అనే కావ్య-నాటక- అలంకార రూపములు

 మీమాంస -పురాణాదులు తల్లి కంఠపు  పై గీతగ
 నడిమి గీతలేకద  ఆయుర్వేద -ధనుర్వేదములు

 చతుషష్టి కళల సొంపు కంఠపు మూడవగీత
 బాహువుల సంకల్పమే  తంత్ర రూపాదులుగా

 శ్రీనాథుడు దర్శించగ "జయ జయ జనయిత్రిగ"
 సరస్వతీ-శాస్త్రమయిగ నిన్నుచూచుచున్న వేళ

 నీమ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
 మానసవిహారి! ఓ సౌందర్య లహరి.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...