మీడుష్టమ శివతమ-04.
***********************
సాక్షాత్కరించాడు రుద్రుడు సాధకుని శిష్యత్వమునకు చిన్ని జిలుగు దిద్దటానికి.ఏమయ్యా సాధకా! ఎలా ఉంది నీ గురువుగారిపాఠము? అంటు గుట్టువిప్పించాలనుకున్నాడు
క్షత్రాణాంపతయే నమోనమః అంటు కరములు జోడించాడు సాధకుడు.
క్షత్రమేమిటి?దానికి పతి ఏమిటి?దానికి నాకు ఉన్న సంబంధమేమిటి?ఎందుకు నన్ను అలా సంబోధించావు అంటూ అడిగాడు ఆశ్చర్యమునునటిస్తూ ఆ ఆటలాదేవాడు.
పరాత్పరా! కదిలేవి కథలు వాటిని కదిలించేది నీ కరుణ.కాదనకుందా నేను చెప్పేది పూర్తిగా విను.అవగాహనారాహిత్యమును అడ్డగించు.మా గురువులు సృష్టి రహస్యములను సులువుగా అర్థము చేయించారు.
ఏమిటా రహస్యములు? అన్నాడు ఆ ఎరుకలవాడు.
ఇప్పుడు మనము అనాత్మకముగా భావించే జగతి ఒకప్పుడు ఆత్మస్వరూపమే.అది అప్పుడు గుప్తముగా నున్నది.అందులో నేను నా సంసారము కూడా ఉంది.అయితే అది గుప్తముగా ఉంది.కాని నిజమునకు ఇప్పుడు జగము ఆత్మ స్వరూపమే-అప్పుడు ఆత్మస్వరూపమే.అప్పుడు గుప్తము.ఇప్పుడు ప్రకటనము అన్నాడు రుద్రునితో .
బాగున్నావయ్య! గుప్తమంటావు-ప్రకటనము అంటావు.రెండింటిలో ఆత్మ ఉందని అంటావు.అదెలా సాధ్యం అన్నాడు అంతర్యామి అలవోకగా నవ్వుతూ.
నేను నీకొక ఉదాహరణతో వివరిస్తాను విను శ్రద్ధగా అన్నాడు సాధకుడు.స్వామికి కావలిసినది అదేకదా.ఒక మఱ్ఱివిత్తనము భూమిలో పాతబడుతుంది.కొన్నాళ్ళు అది భూమిలోనేఉంటుంది.(గుప్తముగా) మనకు కనబడకుందా.అదే భూమి సహాయముతో అది కొత్త రూపమును కొమ్మలతో-రెమ్మలతో-ఆకులతో-ఊడలతో విస్తరిస్తుంది.కాలకర్మేణ మళ్ళీ విత్తుగా మారిపోతుంది.ఇక్కదమార్పులు జరుగుతున్నది విత్తనమునకు-వృక్షమునకు కాని భూమికి కాది.మరొక విషయమేమిటంతే విత్తనము భూమిని ఆధారము చేసుకొనే గోప్యముగా నున్నది.చెట్టుగా విస్తరించి రూప్యముగాఉన్నది.కాని భూమి మాత్రము తన అస్థిత్వమును కోల్పోలేదు.అంతేకాదు రెండింటికి ఆధారభూతమైనది.
అబ్బో చాలా విచిత్రమే ఇది అన్న రుద్రుని చూస్తూ,నీవేక్షేత్రపతివి-వృక్షాణాం పతివి వాటికి మూలమైన ఆత్మ స్వరూపానివి అంటూ స్తుతిస్తున్నాడు సాధకుడు.
నామరూపాలతో ఆగిపోతే ఇసుకలో దిగబడిపోయిన కాలు ఏ విధముగా కదలలేదో,అదే విధముగా తత్త్వమును గ్రహించే ప్రయత్నము చేయలేకపోతే అక్కడే ఆగిపోతుంది.దాన్ని చూస్తూనే నన్ను పట్టుకో అంటూ అంతరాత్మ పలుకుతున్న వేళ కనులు తెరిచిన సాధకునికి కానరాలేదు రుద్రుడు ఎదురుగా.
అణువణువు శివమే-అడుగడుగు శివమే.
సశేషము.
సర్వం శివమయము జగము.
No comments:
Post a Comment