వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ ।
యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిః ప్రభుః ॥ 24 ॥ అగ్నిస్వరూపముగా నున్నవాడు-అగ్నికార్య ఫలముగా లభించువాడు అంతర్యామి యైన సూర్యభగవానుడ అని తెలియచేసిన తరువాత అగ్నికార్యమైన క్రతువు-కృతకము-చేయబడుదానీ-చేయువానిని-ఫలితమును తెలియచేయుచున్నాడు.
సర్వజ్ఞ సర్వమును తెలిసినవాడు.యజ్ఞ యజ్ పరమాత్మ జ్ఞ తెలిసికొనినవాడు.యజ్ఞుడు.తెలిసికొనుటకు అవలంబించు సనాతన సంప్రదాయము యజ్ఞము.నిర్వహించువాడు యజమాని.దానికి సహాయపడు ఇంద్రుయములు తేజస్సులు.సమర్పణము నేను-నాది అన్న స్వార్థభావము.తెలిసికొనినది న మమ నేను అనుకునే ఉపాధి నేనుకాదు.నాలో దాగున నీ చైతన్యమే.దానిని తెలిసికొనుటయే వేదము.వేదముచే తెలుసుకొనువాడు విజ్ఞుడు.ప్రాభవమును తెలిసికొనిన వాడు ప్రాజ్ఞుడు.
"
"అహం క్రతుః అహం యజ్ఞః" ఆర్యోక్తి.పరమాత్మ స్వయముగా తానే యజ్ఞమునని-యజ్ఞఫలితమునని చెప్పుకొనిన మాట.ఇంద్రియములద్వారా అనుభవించు గంధాదులచే వానిని అనుగ్రహించిన స్వామికి త్రికరణముల సాక్షిగా సమర్పించుటయే "యజ్ఞము." సమర్పించువాడు యజమాని.గ్రహించువాడు ప్రభువు.ప్రాభవమును అనుగ్రహించినవాడు.జ్ఞాత-జ్ఞేయము-జ్ఞానము ఒక్కటిగా ప్రకాశించుటయే యజ్ఞము.దానినే
" అహం హి సర్వ ఊజ్ఞాం భోక్తాచ-ప్రభురేవచ" అన్న గీతామకరందము.
దివ్ అనగా తనను గురించిన ఎరుక.అదికలవాడి దేవుడు/దివ్యుడు.దానిని కకితాసహస్రనామము
" యజ్ఞరూపా-యజ్ఞకర్తా-యహమాన స్వరూపా అంటూ మూర్తామూర్తభేదరాహిత్యమును తెలిపినది.
అంతేకాకుండా పంచయజ్ఞప్రియా అంటు,
1.బ్రహ్మౌఅజ్ఞము-
2.దేవయజ్ఞము
3,పితౄఅజ్ఞము
4.భూయ యజ్ఞము
5.మనుష్యయజ్ఞము ప్రాశస్త్యమును ప్రకటించినది.
రుద్ర చమక 8వ అనువాకము సైతము యజ్ఞ ప్రాశస్త్యమును-పరికరములను-ఫలితములను ప్రస్తుతించినది.
యజ్ఞాత్ భవతి పర్జన్య
యజ్ఞ కర్మ సముద్భవ అన్న సత్యమును వివరించినది.
యజ్ఞము అగ్నికార్యము-ఫలితము జలసమృద్ధి.రెండును పరమాత్మయే.
లోకం అనగా చూచుట-శాస్త్ర గ్రహణము.అన్నింటికి ఆధారము అంతర్యామి యైన పరమాత్మ అని తెలిసికొని,నిష్కళంక మనస్కుడై సేవించిన సర్వము తానై సర్వులకు పరమును అనుగ్రహించువాడు ఆ సూర్యభగవానుడు.
No comments:
Post a Comment