మీఢుష్టమ శివతమ-20
*******************
నిన్నువదిలి ఉండలేనయా-కైలాసవాసా
నిన్ను వదిలి ఉండలేను కన్నతండ్రి నీవుకావ,
నన్ను విడిచి వెళ్ళిపోకయ్యా.
మిస్టర్ ఇంద్ర గారు మిస్టర్ ధాత మరియు మిస్టర్ విష్ణు గారలతో కలిసి,మరొక తరగతి విద్యార్థులకు తమ చిత్ర విశేషములను వివరిస్తూ,దానికి పనిచేసిన వారిని పరిచయము చేస్తూ-ప్రశంసిస్తూ పదములను (మాటలను) కదుపుతున్నారు.
" ధాతాచమ -ఇంద్రశ్చమే
విష్ణుశ్చమ-ఇంద్రశ్చమే" అంటూ,
ధాత-మరియు విష్ణువును కూడి వచ్చిన ఇంద్రగారు మా అధ్యయన మను యజ్ఞమును సమర్థవంతము చేసి,మమ్ములను ఆశీర్వదించెదరుగాక.
ఆలస్యము చేయకుండానే అసలు విషయములోనికి వస్తానంటు,ఇంద్రుడు తన గొంతును సవరించుకొని,
అమ్మ బ్రహ్మదేవుడో-బొమ్మతీరు మారెరో అంటుండగానే,
అర్థంగాక విద్యార్థులు సార్-సార్ అంటు,ఒక్క నిమిషము ఆగారు.
చిరునవ్వుతో ధాతను చూస్తు చమత్కరించాను ,
" నమో వృధ్ధాయచ-సంవృధ్ధనేచ"
తాను వృద్ధిపొందుతూ,అందరిని వృధ్ధి పొందించె ఈ ధాత చేతికి మేము తీసిన అస్తవ్యస్తముగా ఉన్న రీలులు వెళ్ళిన తరువాత వాటి రూపే మారిపోతుంది.
అనవసరములు-పునరుక్తములు-ఆసక్తిరహితములు అసలు కానరాకుండాపారిపోతాయి.
గత అనుభవములు ముందుకొచ్చి.స్వగతములను పొందుపరుచుకుంటు,కొత్తగా వాటితో పొత్తుపెట్తుకుంటు,కొంతకొంత అవగతమగుతు,మరికొంత కొంత మరుగున దాగుతు, మా సినిమా కొత్తపుంతలుతొక్కుతుంది.
అంతా వీరి చేతిచలువే అనగానే సాధకుడు రుద్రునితో ఏమిటి? ఇంద్ర-ధాత ఒక్కటిగానే కనిపిస్తున్నారు.ఒకే వ్యక్తియా లేక ఇద్దరా రుద్రా అని అడిగాడు.
చూడు ముందర.తరువాత చెబుతానని రుద్రుడు అంటుంటే,
నమో ఆశవేచ-అజరయాయచ
సమస్త ప్రపంచమును శీఘ్రముగా వ్యాపించు,గమనమునందు సమర్థుడైన వానికి రుద్రునికి నమస్కారములు.
అన్నట్లుగానే కుర్చీనుండిలేచి,గిరుక్కున ఇంద్రుని ముందుకు వచ్చి ,పక్కకు జరిగి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అన్నట్లు కానీయండి అనగానే,
నవ్వుతూ వీడి కాళ్ళకు చక్రాలు కట్టుకొని తిరుగుతాడు.కుదురుగా ఉండాలి అన్నమనుకోండి కుదురు అంటే ఏమిటి?అని అడుగుతాడు.చెప్పేస్తా నీ గురించే,
వీడు విష్ణు.మా చిత్రమునకు ప్రకటనల-పురోగమనాల విభాగమునకు అధికారి.
అందమైన చిత్రము సిధ్ధమవగానే చకచక చలాకీగా దానిని ,తెరమీద ఎప్పుడెప్పుడు చూద్దామా అనిపించేటట్లుగా,విడుదలరోజును లెక్కించేటట్లుగా ప్రేక్షకులను ఊరిస్తూ,టి.విలో,రేడియోలో,వార్తాపత్రికలలో,బస్సులలో,కూడలి దగ్గర హోర్డింగులలో ఒక చోటనేమిటి?
ఇందుగడందులేడను సందేహము వలదు గా చిత్రమును ,దాని ప్రత్యేకతను ముందస్తుగా అందముగా అందరికి చేరవేస్తుంటాడు.
వీరే కాదు మిత్ర-పూష యూనిట్ నిర్దేశకులు చాకచక్యముతో తమకు అప్పగించిన బాధ్యతను నిర్వహిస్తారు అంటూ.
అమ్మా! సరస్వతీ! సిధ్ధమేనా? అంటు కదిలాడు ఇంద్ర తనవారితో.
ముద్దుగా కూర్చునాడు రుద్రుడు అనుకున్నాడు సాధకుడు.
దిద్దుకుంటున్నాడు కొంచము కొంచము అనుకున్నాడు రుద్రుడు.
కదిలేవి కథలు-కదిలించేది కరుణ
అణువు అణువు శివమే-అడుగు అడుగు శివమే.
శివానుగ్రహముతో రేపు కలుసుకుందాము.
ఏకబిల్వం శివార్పణం.
No comments:
Post a Comment