మీఢుష్టమ శివతమ-21
********************
నిన్ను విడిచి ఉండలేనయా-కైలాసవాసా
నిన్ను విడిచి ఉండలేను కన్నతండ్రి నీవె కావ
నన్నువిడిచి పారిపోకయా.
ప్రపంచ రథసారథి విపంచినాదముతో విరాజిల్లుచున్నాడా యన్నట్లు,
ఇంద్రగారు సరస్వతి అమ్మ తరగతిలోనికి ప్రకాశిస్తూ-ప్రవేశిస్తున్నారు.
సరస్వతీచమ-ఇంద్రశ్చమే కన్నులపండుగగా కదులుతుంటే,
నమ స్యూత్యాయ-అహంత్యాయ తానై ,చెరోరూపమైన అపురూప దర్శనమనిపిస్తున్నది.
ఈ అమ్మాయి సరస్వతి.సర్వతోముఖ ప్రజ్ఞావంతురాలు.ఏ విభాగములోని గమనమునైన ఇట్టే గ్రహించి,దానిని నటీనటులకు-సాంకేతిక నిపుణులకు సత్వరముగా అర్థమగునట్లు చేస్తుంది.
మొన్నటికి మొన్న సెట్లో కొన్ని ఇబ్బందులు తలెత్తాయట.నేను సమయానికి అక్కడలేను. మతల్లి ఎంతో చాకచక్యముతో వాటిని పలాయనము చిత్తగించేటట్లు చేసింది అన్నాడుమెచ్చుకోలుగా తనని చూస్తూ.
నమ అవ్యాధినీభ్యో వివిధ్యంతీభ్యశ్చవో నమః."
అర్థంకాలేదా ఈమె ఇట్లా సాదాసీదాగా కనిపిస్తుందికాని అసాధ్యురాలు.
అందుకే అలా అన్నాను అని ఇంద్ర,
వ్యాధిని-అనగా వధించగల శక్తికలది.
అవ్యాధిని-అన్ని దిక్కులను కొట్టకలది.
అంటే అడ్డంకులు అన్నివైపుల చుట్టుముట్టినా వాటిని అవలీలగా మట్టుపెట్టకలది.
అమ్మో మేడం మీరు అని వారు అంటుంతే,ఇంద్రగారు
అంతే కాదు,
వివిధ్యంతి,ఏదో మాదిరిగా కొట్టడముకాదు.పక్కా గురిచూసి కొడుతుంది.పారిపోక ఏంచేస్తాయి పాపం అవరోధాలు అంటు ,
సర్వశక్తుల సారము మా సరస్వతి అంటుండగా,అక్కడికి వచ్చాడు త్వష్ట.పనిలో పని రావయ్యా.నిన్ను పరిచయము చేస్తాము అంటు,
వీడిపేరు విశ్వకర్మ మా కళావిభాగము.మరుత్ వీడు మంచి పనిమంతులు అంటు ప్రజాపతిగారితో కొంచము పనిఉంది అంటు నిష్క్రమిస్తున్నారు ముకుళితహస్తులై.
సారమును తెలుపమని అడగాలనుకున్నాడు సాధకుడు
సాధనను తెలియచేయాలనుకున్నాడు రుద్రుడు.
కదిలేవి కథలు-కదిలించేది కరుణ
అణువు అణువు శివమే-అడుగు అడుగు శివమే.
శివానుగ్రహముతో రేపు కలుసుకుందాము.
ఏక బిల్వం శివార్పణం.
No comments:
Post a Comment