ఎత్తైన కొండలలో భోగ నందీశ్వర్డిని అంటావు
చేరలేనంత ఎత్తులో చార్ధాములో ఉంటావు
లోయలలో హాయిగా త్రిసిల్లి మహేశ్వరుడిని అంటావు
దూరలేనంత గుహలలో అమరనాథుడివై ఉంటావు
కీకారణ్యములలో అమృతేశ్వరుడిని అంటావు
ఎడారులలో వేడుకగా భోలేశ్వరుడిని అంటావు
కనుమల దగ్గర కామరూప కామాఖ్యుడిని అంటావు
జలపాతాల లోతులలో బాణేశ్వరుడిని అంటావు
భూగర్భమున దాగిహంపి విరూపాక్షుడిని అంటావు
ఈదలేనంత గంగ ఒడ్డున ఈశ్వరుడిని అంటావు
నా మదిని వదిలేసావు దయలేక, తెలియదుగా ,నీకు
ఎక్కడ ఉండాలో ఓ తిక్క శంకరా!.
No comments:
Post a Comment