నీ నెత్తిమీది గంగను చూసి నదులు బెంగ పడ్డాయట
మా నెత్తిమీదికి ఏ ఆపద ముంచుకొస్తుందేమోనని
నీ కంఠమంటిన పామును చూసి పాములు చిన్నబోయాయట
మా కంటిముందు ఏ గండము వెన్నంటి ఉందోనని
నీ చేతిలోని మృగమును చూసిన లేళ్ళు దిగులుపడ్డాయట
వాడి బాణమేదో తమను దాడి చేయనుందని
నీ గజచర్మమునుచూసి కరులు గజగజలాడాయట
పొట్టచీల్చి ఎవరు తమను పొట్టను పెట్టుకుంటారో అని
నీ బ్రహ్మ పుర్రెలు చూసిన జనులు భయపడుతున్నారట
రిమ్మ తెగులు కమ్ముకొని నోట దుమ్ము కొడుతుందని
" దయనీయశ్చ-దయాళుకోస్తి"అని సువర్ణమాల అనగానే
ముక్కున వేలేసానురా ఓ తిక్క శంకరా!.
No comments:
Post a Comment