పాలుతాగి విషము కక్కు పాముమీది మోజుతో
పాల కడలి విషము మింగ పావుగ మారావు
అసత్యమాడిన ఆబ్రహ్మ ఎంత చతురుడో
తన కపాలములు చూసి దొంగవని అంటాడు
ఆలములో దాగిన కన్ను ఎంత చుప్పనాతిదో
అసలు తెరువ నీయవని అలుకతో ఉంటుంది
తలపైని తైతక్కల గంగకెన్ని నిక్కులో
ఇటు అటు కదలనీయవని ఆడిపోసుకుంటుంది
కుదురుగ ఉండలేని శశికెన్ని కినుకలో
రాహు-కేతు బాధలను కబళించవు అంటాడు
బుజ్జగ్స్తున్న తల్లి బెజ్జమాట వినకుంటే
చిక్కుల్లో పడతావురా ఓ తిక్క శంకరా!
No comments:
Post a Comment