మరుని శరము పూవుగా నిన్ను మనువాడమని
మదనుడు అనగానే గౌరీపతివి అయినావు
క్షీరసాగర మథనములో విషము స్వీకరించమని
గౌరి నిన్ను అడగగానే గరళకంఠుడివి అయినావు
గంగవెర్రి నెత్తిమీద సుతిమెత్తగ మొత్తమని
భగీరథుడు అనగానే గంగాధరుడివి అయినావు
గంగిరెద్దు మేళములో నీకు రంగు వస్త్రమౌతానని
కరి రాజు అనగానే గజ చర్మధారివైనావు
భృంగి సైగ చేయగానే నీ సింగారపు నాట్యమట
" సంధ్యారంభ విజృంభితవు" నీవు కాదని
సంజ్ఞారంభ విజృంభితుడవు పాపం నీవని
పెక్కుమార్లు విన్నానురా ఓ తిక్క శంకరా!.
No comments:
Post a Comment