నీకన్న నీ బసవడు అనయము కొనియాడబడుతుండ
నీ కన్న నీ నామము మంగళకరమగుచుండగ
నీ కన్ననీ సిగశశి చాంద్రమానమగుచుండ
నీ కన్న నీ కాలము శేషపూజలందుచుండ
నీ కన్న శిరసుగంగ నీరాజనములందుచుండ
నీ కన్న నీ కృత్తిక నిఖిలకీర్తి పొందుచుండ
నీ కన్న నీ పరివారము ప్రస్తుతింప బడుచుండ
నీ కన్న నీ భక్తుల కథలు మారుమ్రోగుతుండ
నీ కన్న నీ భోళాతనము వేళాకోళమగుచుండగ
చూసి చూదనట్లుగా,తెలిసి తెలియనట్లుగా
పోనీలే అంటుంటే, కానీలే అని మిన్నకుంటే
ఎక్కడున్నదిరా న్యాయము ఓ తిక్క శంకరా!
No comments:
Post a Comment