కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి
కరమూలేతు గొవిందహ ప్రభాతే కరదర్శనము. చేతి అంచున లక్ష్మి,చేతి మధ్యన సరస్వతి,చేతిమొదట గొవిందుని నివాసము ఉదయమున కరదర్శనము శుభప్రదము అని ఆర్యోక్తి.
రామాపురానిది గ్రామాలన్నింటిలో పైచేయి.ఆ ఊరి కరణము సత్యమూర్తి పనితనములో అందెవేసినచేయి.విశాలహృదయులు కనుకప్రజలకు "చేయూతగా" ఉండేవారు.ఊరి అవసరములు తీర్చుటలో ఆయనది "ఎముకలేని చేయి".జమఖర్చులు ఆయన "చేతివేళ్ళమీదె" ఉండేవి.వ్యసనాలకు "మొండిచేయి" చూపించేవారు.ఆ ఊరిలో సోమయ్య" చేతివాసిగల" వైద్యుడు.కరణముగారి "కుడిచేయి."సోమయ్య మందు రోగులకు" చేతిలో ఉసిరికాయ".సోమయ్య ఊరెళితే కరణముగారి "చేయివిరిగినట్లుండేది".వారి స్నేహముగురించి చెప్పటం "ముంచేతి కంకణము చూచుటకు అద్దమును చూపుట"వలేనుండెడిది.ప్రజలు "చేతులుపట్టుకొని" మానవహారములా ఉండేవారు.కరణముగారికి ఆనందంతో " చేయెత్తి జేకొట్టేవారు."
రాజు సోమరి.వానికిపుస్తకము "హస్తభూషణము"."చేయిచెపుతోంది" నేను గొప్పవాడిని అవుతాను అనేవాడు."మెలికతిరిగినచేయిలా" బొమ్మలు వేస్తాను అని అనుకొనేవాడు.మాటలతో" అరచేతిలోవైకుంఠము" చూపించేవాడు.శ్రమలేనందున ఫలితము" చేతికందలేదు"."చేతకాక" చెడ్డవాడైన బిట్టూతో చేతులు కలిపాడు.స్నేహముగా ఉంతూ చెప్పినట్లు చేస్తాననిచేతకాక బిట్టూతో "చేతులు కలిపాడు".బిట్టూ మోసము చేయుటలో" చేయితిరిగినవాడు".చెప్పినట్లుచేస్తానని బిట్టూ" చేతిలో చేయి వేశాడు".పథకము ప్రకారము రామాపురము వచ్చారు" చేతిపనులు" చేసికుంటున్న గ్రామస్తులు వీరినిచూసారు.వారికి "చేదోడువాదోడుగా" ఉంటారనుకున్నారు.కరణము వీరితో "కరచాలనము" చేసి,రండి"దయచేయండి" అని అన్నాడు.
వీరి స్నేహము రామాపురానికి "భస్మాసురునుచేయిగా" మారింది.దుర్మార్గులు గ్రామసంపదపై "చేతివాటం" ప్రదర్శించసాగారు.చేసేదిలేక గ్రామసంపద వీరికి" చేతులూపింది"."వట్టిచేతులతో" వెట్టిచాకిరి చేయవలసి వచ్చింది.అభివృద్ధి " చేతులెత్తేసింది".ఆహారము " అరచేతిలోపెడితే మోచేతిని" నాకేలా ఉంది.గ్రామస్తులు దుర్మార్గుల "మోచేతిక్రింది నీళ్ళు" తాగి బ్రతుకవలసిన పరిస్థితి వచ్చింది."చే చేతులా" వీరి" కబంధహస్తాలలో" చిక్కామని చింతించసాగారు.ఆనందం యేది?చెప్పినమాట వినకపోతే ఆ కౄరులు వీరిపై "చేయి చేసుకునేవారు"."రెక్కాడిన" వీరి డొక్కాడటములేదు."చేతులారంగ" శివపూజను మరిచారు."చేతవెన్నముద్ద తండ్రిని" మరిచారు.బధిర బంధువైన" చేయి" మనకు బంధువగునా అని,బాధల వరదను కడతేర్చే "వరదహస్తస్వామి,"నీ "అభయ హస్తమును" చూపవా అంటున్న కరణంగారిని, కాత్యాయినిలేపింది యెవరో వచ్చారంటూ,రేడియోలో అందరికి" అభయమ్ము ఇచ్చు చేయి",కదువగు శ్రీహరి "బంగారుచేయి" ఆ చేతులను చేతులు జోడించి ప్రార్థిద్దాము.
.
No comments:
Post a Comment