చిదానందరూపా-గోడగూచి
*********************
కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా
కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా
తలితండ్రుల ఆనతిగాన తరియింపగ తాను
కమ్మని ఆవుపాలు నైవేద్యము సేయగ తరలెను
కొండను వెలిసిన శివునికి బొజ్జనింపగ ఇంపుగ
మెండగు భక్తి తోడ గోడగూచి నిష్కళంకముగ
అతివాస్తవికతతో స్వామికి ఆవుపాలను త్రాగించెనుగ
ఆ విషయము నమ్మనివారి ఆగ్రహమునకు దండన తోడాయెగ
పరమాత్మలో పదిలముకాగా పరమాద్భుతమె జరిగెగ
ప్రమథ గణములలో చేరగ పట్టిన పాలే కారణమాయెగ
చిత్రముగాక ఏమిటిదిచిదానందుని లీలలు గాక
చిత్తముచేయు శివోహం జపంబు చింతలు తీర్చును గాక.
No comments:
Post a Comment