కళల మార్పుచేర్పులతో కదులుచున్న చంద్రుడు
నీసిగముడుల చీకట్లలో చింతిస్తు ఉంటాడట
కుబుసపు మార్పుచేర్పులతో కదలాడు పాములు
నీలలోహిత చీకటిలో చిబ్తిస్తు ఉంటాయట
కునుకురాక తెరువలేక కుదురులేని మూడో కన్ను
తెరతీయని చీకటులలో చింతిస్తు ఉంటుందట
ఆకాశము నుండి జారి సాగ అవకాశము లేని గంగ
బంధిఖాన చీకటిలో చింతిస్తు ఉంటుందట
చీకటులను తొలగించలేని జ్యోతి శివుడేనట
చింతను తొలగించలేని వింతయు శివుడేనట
దోషము తొలగించలేని వానికి ప్రదోషపూజలా? అంటు
ఒక్కటే గుసగుసలు ఓ తిక్క శంకరా!.
No comments:
Post a Comment