చిన్ముద్రలు ఇష్టము రుద్రాక్షలు ఇష్టము
అభిషేకములు ఇష్టము అవశేషములు ఇష్టము
మహన్యాసము ఇష్టము మహ శివరాత్రి ఇష్టము
బిల్వములు ఇష్తము బిలములు ఇష్తము
తుమ్మిపూలు ఇష్టము తుమ్మెదలు ఇష్టము
తాండవము ఇష్టము తాడనము ఇష్టము
నిష్టూరములు ఇష్టము అష్టోత్తరములు ఇష్టము
లయగ ఆట ఇష్టము లయముచేయుట ఇష్టము
కాల్చుటయు ఇష్టము కాచుటయు ఇష్టము
చందనాలు ఇష్తము వందనాలు ఇష్టము
కష్టాలలో నున్న నాపై నీ ఇష్టము చూపించుటకు
మొక్కులెన్ని మొక్కాలిరా ఓ తిక్క శంకరా!
శివుడు శుభాశుభములను,మంచి-చెడులను ఉచ్ఛ నీచములను గుర్తించకుండ అన్ని ఇష్టమే అంటాడు-నింద.
సర్వ సాక్షి అయిన సదాశివుడు సమవర్తి అని స్తుతి.
No comments:
Post a Comment