మన్మధ బాణము అంటే మాయదారి భయము నీకు
కోపము నటించి వానిని మాయము చేశేసావు
కోరికలతో కొలుచు వారంటే కొండంత భయము నీకు
చేరువుగా రాకుండా పారిపోతు ఉంటావు
అహముతో నిని కొలుచు అసురులంటే అంతులేని భయము నీకు
దారి ఏదిలేక వారికి దాసోహము అంటావు
సురలందరు కొలువ నిన్ను కలవరమగు భయము నీకు
అనివార్యము అనియేగ గరళ కంఠుడివి అయినావు
ధరించినవి అన్ని తరలుతాయేమోనని దాచలేని భయము నీకు
జగములు గుర్తించకుండ లింగముగా మారావు
"నమో హిరణ్య బాహవే సేనానే దిశాంగ పతయే"అయిన నీది
మొక్కవోని ధైర్యమురా ఓ తిక్క శంకరా.
మన్మథుని కాల్చుట,భక్తులకు అందకుండ పారిపోవుట,పారిపోవుట వీలుకానప్పుడు భక్తులుచెప్పినట్లువినుట,తనకు తానులింగరూపముగా దాగుట శివుడు పిరికివాడని నింద.
పంచేంద్రియములను-పంచభూతములనునియంత్రించేవాడు,క్షమా హృదయుడు,లోక కళ్యాణార్థము ఎంతటి సాహసమునైనా చేయగలవాడు,బాహ్యరూపమునందు ఆసక్తి లేని నిరాకారుడు అని స్తుతి.
ఏక బిల్వం శివార్పణం.
No comments:
Post a Comment