దారుణ మారణ కాండను కారుణ్యము అంటావు
పొట్టచీల్చి గజాసురుని మట్టి కరిపించావు
చుట్టుకుంది అతని తల నీ సుతు శరీరమునే
కన్ను తెరిచి మదనుని కన్ను మూయించావు
కన్నుల పండుగ అయినది నీ కళ్యాణముతో
బాణమేసి వరాహము ప్రాణమునే తీసావు
పాశుపతము చేరింది అర్జునుని ఆశీర్వచనమై
హరిని అస్త్రముగా వాడి త్రిపుర సం హారము చేసావు
విరచితమైనది హరి మహిమ వీరత్వము చాటుతు
ఎటు చూసిన పాతకమే నీ గతముగ మారితే
" మహాదేవం మహాత్మానాం మహా పాతక నాశనం" అను
మొక్కులందుకునేవురా ఓ తిక్క శంకరా!.
No comments:
Post a Comment