"యా చండీ మధుకైటభాది దైత్యశమనీ
యా మాహిషోన్మూలినీ
యా ధూమ్రేక్షణ చండముండ మథనీ
యా రక్తబీజాశనీ
శక్తిః శుంభనిశుంభదైత్య దమనీ యా సిద్ధిధాత్రీ పరా
సాదేవి నవకోటిమూర్తి సహితా మాంపాహి/మాంపాతు విశ్వేశ్వరీ "
పైశ్లోకము అనేక రక్కసులను తల్లి సంస్కరించినట్లు తెలుపుతున్నది.వారు
మధు-కైటభులు
మహిషాసురుడు
ధూమ్రేక్షణుడు
చండ-ముండుడు
రక్తబీజుడు
శుంభ-నిశుంభులు
వీరికి అమ్మతో యుద్ధము చేయవలసిన పరిస్థితి ఎందుకు కల్పించబడినది?
అసలు వీరెవరు?
కశ్యప ప్రజాపతి/దితి సంతానము శుంభ-నిశుంభులు.వారు పాతాళ లోకములో పెరిగి పెద్దవారైరి.భూలోకమునకు వచ్చి బ్రహ్మ గురించి ఘోరతపమాచరించిరి.భూలోకము తల్లడిల్లసాగెను.వారి తపమును నిలిపి వేయుటకు బ్రహ్మ వారి ముందు పెరత్యక్షమై వరము కోరుకొమ్మనెను.చిరంజీవులుగా వరము కోరుగానే బ్రహ్మ తాను సైతము కల్పాంతమున సమసిపోవు వానినని తనకు చావును గెలిచే వరమిచ్చే శక్తిలేదనెను.దానికి వారు ఒక్క స్త్రీ చేతదక్క చావులేని వరమును పొందిరి.వరగర్వముతో దేవతలపై దండెత్తిరి.దానికి అనుగుణముగా వారు పాతాళమునకు వెళ్ళి వారి గురువైన శుక్రాచార్యునిచే మూర్ధాభిషిక్తులైరి.రాజ్యమును విస్తరించు ప్రక్రియలో
చండ-ముండులు,ధూమ్రలోచనుడు,రక్తబీజుడు మొదలగు వారిని తమ అధీనములోనికి తెచ్చుకొనిరి.బలగర్వముతో స్వర్గముపై దండెత్తి దేవతలను సైతము పరుగులు తీయించిరి.
వారి పూర్వజన్మ పుణ్యమేమో పరమేశ్వరిచే సంహరించబడి సన్నిధానము చేరుకో గలిగిరి.
మన కథను శుంభునితో ప్రారంభిద్దాము.
ఇప్పటివరకు మధుకైటభులు-మహిషాసురుడు అను అసురులతో పరాత్పరి పరోక్షశక్తిగా/సమిష్టి శక్తిగా ఆవిర్భవించి,అజ్ఞానమును అంతమొందించినది.
తన్నుకొస్తున్న తామసము తప్పులుచేయుటకు తడబడనీయదు తప్పులు దిద్దుకొనుటకు తప్పుకొనమని అసలే అనదు.
అదే స్థితిలో నున్నాడు శుంభుడు.
నేను అను భ్రాంతియే శుంభుడు.దానిని విస్తరింపచేసి-విజృంభింపచేయుటకు సహకరించు శక్తి నిశుంభుడు.నేను-నాది అన్న సిద్ధాంతమునకు ఊతముగా నిలిచి అహంకరించు శక్తి చండుడు.ఒక విధముగా రావణాసురుడు.వివేకమును విచక్షణను మేల్కొలుపనీయక మందగించి యుండు తిమిర శక్తియే ముండుడు.
ఒక విధముగా తనకు తాను తెలుసుకొనలేని/తెలియచేయుతకు ఎవ్వరు లేని వ్యర్థ పరాక్రమమే ఈ శుంభ-నిశుంభ/చండ/ముండుల ప్రస్తానము.వీరిది దైత్య పక్షము.
వీరినుండి రక్షనకోరుచున్న దైవపక్ష నాయకుడు ఇంద్రియములను అదుపులోనుంచుకొనగలిగి పరాత్పరిని ప్రస్తుతించగల సాత్వికమూర్తి.
"స్తుతా సురై పూర్వమభీష్ట సంశ్రయా
త్తథా సురేంద్రేణ దినేషు సేవితా
కరోతు సానః శుభ హేతురీశ్వరీ
శుభా భద్రాణ్యభిహంతు చాపదః"
పూర్వము దేవతల కోరిక తీర్చినందుకు ఏ దేవిని స్తుతి చేసిరో ఏ దేవి ఇంద్రునిచే నిత్యము సేవింపబడునో ఆ శుభహేతువైన ఈశ్వరి మా ఆపదలను తుంచివేసి,భద్రలను/శుభములను కలిగించుగాక.
వీరి ప్రార్థనను ఆలకించిన ఆ జగదంబ ఏ విధముగా ఆవిర్భవించనున్నదో,ఏ నామముతో కీర్తించ బడనున్నదో ,ఎన్ని లీలావిశషములను ప్రసాదించనుందో అమ్మదయతో తెలుసుకుందాము.
సర్వం శ్రీమాతాచరణారవిందార్పనమస్తు.
No comments:
Post a Comment