Tuesday, November 12, 2024

TANOTU NAH SIVAH SIVAM-12


 


  తనోతు నః శివః శివం-12

  *****************

  "  వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే

     జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ"


   'సర్వంబు తానుగా శర్వుడాడెను నేడు

    నృత్యంకర! ప్రమథ గణ కింకర"

  నః-మా అందరికి

  మహా కపాలి-విశ్వనకు శీర్షము వంటి (సహస్రశీర్షా పురుషః)

  అస్తు సంపదే-సంపదలను అనుగ్రహించును గాక.

   

    ప్రస్తుత స్తోత్రములో  స్వామి మన్మథుని భక్షించి వెన్నెలల ద్వారా జగములను రక్షించుచున్నాడట.అంటే ధర్మ సంస్థాపనమును తన తాందవము ద్వారా/నిలింప తాందవము ద్వారా అమలుచేస్తున్నాడట.

  పాహి పరమేశ్వరా-పాహిజగదీశ్వరా

 ఇన్నిలోకములన్ని ఒకటియై (నీ) కన్ను చూపించు

 " ఓ ఆది భిక్షు! ఓ జగత్చక్షు"

  చరణము

  ******

 " లలాట చత్వర జ్వలద్ధనంజయ స్ఫులింగ భా

   నిపీత పంచసాయకాం నమన్నిలింప నాయకం

   సుధామయూఖ లేఖయా విరాజమాన శేఖరం

   మహాకపాలి సంపదే శిరోజటాలమస్తు నః."

   

  1.లలాట చత్వర జ్వలత్ ధనంజయ స్ఫులింగ భా

    

     స్వామి లలాటము  అనేయజ్ఞ వేదిక -భా-ప్రకాశిస్తున్నది.

     స్ఫు-లింగ---లింగ సంకేతముగా నున్నది.

     స్ఫులిత్-దివ్యతేజమునకు సంకేతముగా స్వామి ఫాలభాగము జ్వలిస్తున్నది.

     ఆ జ్వాలలు

 2.నిపీత పంచసాయకం నమః నిలింప నాయకం

      నిరుపమాన  నాయకుడా నీకు నమస్కారములు.

   నీవు పంచబాణుని/పంచబాణములను ఆహుతులుగా స్వీకరిస్తూ

  నిపీత త్రాగుతూ-నీనుదుటిని జ్వలింపచేస్తున్నావు.


 మన్మథ బాణములు తెల్లకలువ-నల్లకలువ-చంపకము-అశోకము-మామిడి అని భావిస్తారు.ఇవి సున్నితముగాకనిపిస్తూనే జగములను చింతాక్రాంతము చేస్తాయి.తల్లడిల్లునట్లు /తాపమునకు గురిచేస్తాయి.స్వామి తన జ్ఞాన నేత్రము ద్వారా వాటిని హరించి వేసాదట.

  అయ్యో పూవులను దహించిన వానికి భక్తులు నమస్కరిస్తున్నారు.

    మరీవిడ్డూరం అనుకుంటే పొరబాటే.

 అవి పంచేంద్రియములకు సంకేతము.మనకు తెలియకుండానే మనము వాటికి వశమై మతి గతి తప్పుతాము కనుక మహాదేవుడు వాటిని మాయము చేస్తున్నాడు తన తాందవముతో.



 " ప్రతి సంజె యందు తాందవ మాడ రుద్రుండు

   గతి తప్పకను సర్వ బ్రహ్మాండములు నిలుచూ

     అదీసంగతి.

 "లయ తప్పెనా భువికి లయమప్పుడె తోచు

  లయ తప్పెన గిరికి భయమప్పుడె పాకు"

    ఓ జగత్ పరిపాల! ఓ మహాకాళ

 పాహి పరమేశ్వరా! పాహి జగదీశ్వరా.

   ఎటు చూసిన అగ్నిజ్వాలలు.పునీతుడైన మన్మథుడు

  జగములన్నింటితో పాటుగా తాను కూడా చల్లబడుతున్నాడు ఏ విధముగా నంటే,

3.సుధామయూఖలేఖయా విరాజమాన శేఖరం( కరుణతో)

     అగ్నిసోమాత్మకము కదా ఆదిదేవుని తత్త్వము.

  అగ్ని తాపమును తొలగించుటకు సోముడు ఏం చేస్తున్నాడంటే,

  

  ' కైలాసగిరి మహాకర ముద్రికలు తగిలి

    వెన్నెలలు భ్రమసిపడి అమృతము కురిసినవి" (అజ్ఞాత కవి-ఆకాశవాణి గీతము)

 అగ్నినేత్రము తన పనిని పూర్తిచేసుకుని యథాస్థానమును చేరినది.అదే అదనుగాస్వామి జటలలోనున్న చంద్ర రేఖ/చంద్రలేఖ సుధా-మయూఖములను అమృతకిరణములను వర్షించసాగినది శివునికరుణగా.


 4 మహాకపాలి సంపదే శిరోజటాలం అస్తు నః.

      అనంతశీర్షుడు/మహాకపాలి/మూర్తీభవించిన జ్ఞానము,నః-మనందరిపై,సంపదే-సంపదలను అనుగ్రహించును గాక.

   పరమేశ్వర తాండవము-ప్రపంచ తారణము.

   మాయామోహసాగరము  నుండి మనలను దరిచేర్చుచున్న నావ.

  విశేషము

  **********

యావత్ భారతదేశము ఈ పవిత్ర సన్నివేశమునే "హోళికా సంహారము 'కామ దహనము"                 "కాముని పున్నమి అనే పేర్లతో ఉత్సవముగా జరుపుకుంటుంది ప్రతిఫాల్గుణ పూర్ణిమ పవిత్ర తిథి యందు.


   కదిలేది ప్రపంచము-కదలనిది పరమాత్మ

   శివ భజమేవనిరంతరం.

    ఏక బిల్వం శివార్పణం.


  

  


Monday, November 11, 2024

TANOTU NAH SIVAH SIVAM-11


 


   తనోతు నః శివః శివం-11

   *******************

 "వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే

  జగతః పితరం  వండే పార్వతీ పరమేశ్వరౌ"


   " కనిన జనని కన్న ఘనదయ దాయక

     ఇదియ అనుగ్రహము అరుణాచల " అంటున్నాడు రావణుడు.(ఇది నా ఊహ)


   తన తల్లి నిత్యశివపూజ-సైకత లింగము సముద్ర తరంగములచే రూపు మారుట-తల్లి ఆవేదనము-ఆత్మలింగమును అభ్యర్థించుటకై తన కైలాస ప్రయాణము-స్వామి దర్శనమునకు అనుమతించని నందీశ్వరునిపై/స్వామిపై ఆగ్రహం కైలాసమును కదిలించబోయి   తన అహంకారము అన్నీ అదృశ్యమైనవి.

  స్వామి తాండవమును తన్మయుడై చూడగలుగు దర్శనశక్తి లభించినది.

  "అళగు సుందరముల వలె చేరి నేను

   నీవు ఉందము అభిన్నమై అరుణాచలా" అంటున్నాడు.


  అవ్యాజకరుణ తథాస్తు అన్నదా అన్నట్లుగా,


    "ఓం జాతవేదసే సునవా మసోమ" అంటూ దుర్గా సూక్తము 

    శ్రవణానందమును కలిగిస్తున్నది.

    మరొక పక్కన

 " తాం ఆవహజాతవేదో లక్ష్మీం అనపగామినీం" అంటూ శ్రీసూక్తము శృతి శుభగముగా వినిపిస్తున్నది.

  " త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం " అంటూ మంత్ర పుష్పము రావణుని తంత్రులను "మహామృత్యుంజయ మంత్రమై" చైతన్యవంతునిచేస్తున్నది.

   ఎటు చూసినా అగ్ని ప్రస్తావనమే/ప్రస్తుతులే.లక్ష్మీ స్వరూపముగా/దుర్గా స్వరూపముగా/మృత్యుంజయ స్వరూపముగా ముచ్చట గొలుపుతున్నది.


  జాతవేదుడు ఎవరు? అన్న సందేహము సందడి చేస్తున్నది.

 వేద-తెలిసినవాడు-జాత-పుట్టుకలను


 సకలజగముల/సకల చరాచరముల/సకల ఉపాధుల పుట్టుకను తెలిసినవాడు జాతవేదుడు అన్న సమాధానము సంతృప్తి పరచినది.

   సంతోషముతో నున్న రావణునికి స్వామి లలాటము చత్వరముగా(యజ్ఞవాటికగా) కాంతులీనుతూ కనిపిస్తోంది.

వేదావిర్భమైనతరువాత మహాదేవుడు యజ్ఞ ప్రక్రియలను మనందరికి పరిచయము చేస్తున్నాడు.

   స్వామి లలాట యజ్ఞ వేదిక ధనంజయ స్వరూపముగా ప్రకాశిస్తున్నది.

  ధనంజయుడు అని అగ్నిని ఎందుకు కీర్తిస్తున్నాడు రావణుడు?

   నాలో కలిగిన సందేహమునకు సమాధానముగా మహాదేవుడు మరొక కథనము ద్వారా నా కలవరమును తగ్గిస్తున్నాడు.

   యుధిష్ఠరుడు,

   రాజసూయ యాగానంతరము అన్నసంతర్పణము చేయాలనుకున్నాడట.దైవలీల తన దగ్గరనున్న ధనము సరిపోనిదిగా అనిపించిందట.అర్జునా ఏమిటీ ఈ విచిత్రం?యావత్ప్రపంచము మనాధీనములో నున్నదన్న /నేను సర్వ సంపనుడనన్న నా ఆలోచన తప్పేమో అని అర్జునునితో అన్నాడట.అర్జునుడు అగ్నిహోత్రుని సహాయముతో,

 హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజత్స్రజాం అనుగ్రహమును పొందాడట.ఆ నాటినుండి సహాయకుడు-గ్రహీత ధనంజయ నాములుగా కీర్తింపబడు తున్నారట.



  ఈశ్వర" లలాట యజ్ఞవాటిక" హవిస్సులతో మరింత ప్రజ్జ్వలిస్తోందట.

 స్వామి తన తన దశజిహ్వలతో పంచసాయకుని(మన్మథుని) సేవిస్తున్నాడట.

 ఆ సమయములో మన్మథుడు స్వామి1

 " నీ జ్వాల నన్ కాల్చినన్"

  "ఇల్లు విడువలాగి లోనింటిలో జొచ్చి

  "రేయి పవలు లేని బట్ట బయట

   ఇంట రమియింపగా రమ్ము అరుణాచలా"

      అంటున్నాదట.(నాఊహ)


  మన్మథుడు రావణునిలో ఆత్మలింగమును పొందుట అనుకోరికను-అది తీరలేదనే క్రోధమును-అది పొందని వేళ జగదంబపై మోహమును-ఇంకెకవరికి   దక్కకుండా తన దగ్గరే ఉండాలన్న లోభమును-అర్థిస్తున్నవేళ మదమును-స్వామి పక్కను ఉన్న తల్లిని చూసి స్వామిపై మాత్సర్యమును పొందాడు.



 అప్పటి మన్మథ కార్యము ధర్మవిరుద్ధము.ఆ బాణములను స్వామి ఆహుతులుగా సేవించి పునీతమొనర్చినాడు.

   ప్రస్తుతము పునీతమైన మన్మథ బాణములో రావణుని ప్రవర్తనలో  మార్పు తెచ్చే పనిలో నున్నవి.

  స్వామి తెరిచినది జ్ఞాననేత్రము.ఆ జ్ఞాన నేత్ర దర్శనము భక్తుని పండి తీగను విడనాడు దోసకాయగా అనుగ్రహిస్తుంది.రావణుని పరిస్థితి కూడా అదే.స్వామి కపాలము కనిపిస్తున్నది జ్ఞానసూచకముగా.స్వామి కరుణ కనిపిస్తున్నది 

 స్వామి అగ్ని సోమాత్మకము అర్థమవుచున్నది సుధామయూఖ విరాజమానముతో.

  యక్షస్వరూపునిగా గరికను కాల్చలేని అగ్నిని పరంజ్యోతి స్వరూపమై ప్రకాసవంతము చేసిన చమత్కారము తెలుస్తోంది.

  యక్ష స్వరూపాయ-జటాధరాయ నమోనమః.


 ' కన్నుకు కన్నయి కనులేక కను 

   నిను కనువారెవరు గను అరుణాచలా అంటూ "

      ప్రార్థిస్తున్న మనలనందరిని అరుణాచల అగ్నిస్వరూపుడైన ఆదిదేవుడు అనుగ్రహించును గాక.

  కదిలేది ప్రపంచము-కదలనిది పరమాత్మ

  శివ భజమేవ నిరంతరం

      ఏక బిల్వం శివార్పణం.



Sunday, November 10, 2024

TANOTU NAH SIVAH SIVAM-10


 


    తనోతు నః  శివః  శివం-10

    ********************

 "  వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తియే

    జగతః  పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ". 


   పరమేశ్వరుడు తన తాండవములో విస్తరిస్తున్న జటలను పిల్లనాగులతో బంధించుకుంటు మనందరికి సంపదలను వర్షిస్తూఅడట.మొదటి చరణ్

అములో శుభములను వర్షిస్తున్న స్వామి శుభములతో పాటుగా సంపదలను వర్షిస్తున్నాడట ప్రస్తుత తాండవములో.సిరి-సంపదలను అనుగ్రహిస్తాడన్న మాట.ధన-ధాన్యాలు అంటుంటాము  అదేకదా.మనపైననే మాత్రమే కాదు మన తదుపరి తరములవారిపై కూడ అనవతర అనుగ్రహవర్షము.

   ధన్యోస్మి మహాదేవా.



 

 "సహస్రలోచన ప్రభ్యుత్యశేష లేఖ శేఖర

  ప్రసూన ధూళి ధోరణి విధూసరాంఘ్రి పీఠభూః

  భుజంగరాజ మాలయ నిబద్ధ జాటజూటక

  శ్రియై చిరాయ జాయతాం చకోర బంధుశేఖరః."


      "శుభమంగళం-నిత్య జయమంగళం"

       అజాయమాన-బహుధా విజాయతే'

          పుట్టుక లేని పరమాత్మ ఎన్నో అద్భుతములను సృష్టిస్తున్నాడు.


    స్వామి సంపదలతో కూడిన మంగళములను జాయతే సృష్టించుచున్నాడు (తన తాండవముతో) అదే సమయములో ప్రపంచ విస్తరణముగా వ్యాపిస్తున్న తన జటాజూటమునకు పాపపాము పేరులతో హద్దులను నిర్ణయిస్తున్నాడు వాటిని తన జటలలో హారములుగా చుట్టుకుంటూ/అలంకరించుకుంటున్నట్లుగా అనిపించే అవధి నిర్ణయముతో. ఇన్నిపర్వతములు-ఇన్ని సముద్రములు-ఇన్ని అరణ్యములు-ఇన్నిజలపాతములు-ఇన్ని క్షేత్రములు-అంటూ,తన అపరిమితమైన కరుణను అనంతకాలము విస్తరించుటకు (కాళము-కాలము) ప్రపంచ పరిమితిని పొందుపరుస్తున్నాడు.

1. " సహస్రలోచన ప్రభ్య్త్యశేష లేఖ శేవ్ఖర" 

     స్వామి అనంతలోచనుడైనాడు.సహస్రాక్ష-సహస్రపాత్.సర్వమును దర్శించగల శక్తిని ప్రకటనము చేస్తున్నాడు.మనకు సైతము తన సంపూర్ణ సాకార సాక్షాత్కారమును అనుగ్రహించబోతున్నాడు.

   సనాతనములో అమ్మ సాకారదర్శనము మస్తకము నుండి పాదము వరకు-(చండీసప్తశతి-చిదగ్నికుండ సంభూట శిరో ప్రకటనము)

 అయ్యవారిది పాదము నుండి మస్తకము వరకు అను సంప్రదాయమును అనుసరించి,స్వామి తన పాదపీఠభూమిని మనందరికి దర్శింపచేస్తున్నాడు.


  ఆ పవిత్ర పీఠస్థలి సహస్రలోచనుడు/మహేంద్రుడు మొదలగు వారి ప్రభృత్-ముఖ్యశేవకులతో కూడి,అశేష లేఖ సంపూర్నమైన దేవతా సమూహములతో/పరిపూర్ణమైన ప్రకాసముతో నున్నదట.

   ప్రకాసము మాత్రమే కాదు ఆ పీఠము

2." ప్రసూన ధూళి ధోరణీ విధూసరాంఘ్రి పీఠభూః"

      ధోరణితో నున్న నున్న   వారు ఎవరు? దేవతలందరు అలంకరించుకొనిన పుష్పమాలలో నున్న ప్రసూనములు.

   వాటి ధోరణి /ఆలోచన ఏమిటి?

   స్వామి భస్మాలంకార ప్రియుడు కదా కనుక మన పంచలక్షణములను మరింత ఏకీకృతమైన పుప్పొడి గా మలచి స్వామి పాదములకు అలంకరిద్దామన్న ఆలోచన.

   అనన్య సాధ్యము ఆ ఆరాధనము.వెంటనే అవి వానిలోని సారమైన ఆత్మసౌందర్యమును(పునరుత్పత్తికై)పుప్పొడిగా మలచి(విజ్ఞానము) పునర్జన్మ లేకుండటకై (ఆధ్యాత్మికము) స్వామి పాదపీఠభూమిని అర్చిస్తున్నాయట.

    వాటి జన్మము చరితార్థము.

3." భుజంగ రాజ మాలయా నిబద్ధ జాటజూటకః"

    పాదముల నుండి దర్శిస్తూ మనము శివానుగ్రహముతో మస్తకమును చేరుకున్నాము.మధ్యలో ఇది అని చెప్పలేని నిరంతర నర్తనముకదా స్వామిది.

   నిబద్ధ-ఒక నియమముతో /ఒక పొందికతో/ఒక అవధిగా/ఒక అలంకారముగా స్వామి తన జటాజూటమును భుజంగరాజ/శ్రేష్టమైన/శోభాయమానమైన పాములతో చుట్టుకొన్నాదట.

   ఏమిటి  ఆ నిబద్ధత?

    ఓ కిశోర చంద్రా!

నీవు  నాకు అలంకారము మాత్రమే కాదు సుమా!

  నేను నీకు ఒక బాధ్యతను నేటి నుండి అప్పగిస్తున్నాను.

    ప్రకటనమైన ప్రపంచములో పశుపక్ష్యాదులు కూడా ఉన్నవి కదా.అందులోని చకోర పక్షులను చూశావు కదా.వాటికి వెన్నెలమాత్రమే ఆహారముగా నిర్ణయించబడినది.ఆ వెన్నెలలను స్వీకరించుటకు వాటి మెడ కింద ఒక రంధ్రము అమర్చబడియున్నది.అవి స్వీకరించిన నీ కౌముది కిరణములు తిరిగి వాటికి నీవు అనుగ్రహించువరకు జీవింపచేస్తాయి అని కిశోరచంద్ర శేఖరుని-చకోర బంధుశేఖరునిగా మార్చి

  చకోరములకు/మన్మదరికి (చకోరములు -సామూహిక సంకేతము)

( వెన్నెలలు-స్వామి అనుగ్రహము-) కంఠము ద్వారా నామసంకీర్తనము ద్వారా -ప్రతిపాదికము.

   4." శ్రియై చిరాయ జాయతాం" చకోర బంధుశేఖరః

        శాశ్వత సంపదలను అనుగ్రహించును గాక స్వామి తాండవము.

  విశేషములు

  ********

 1.దశమహా తత్త్వముగా కనుక పరమాత్మ తత్త్వమును గా అన్వయించుకుంటే కాళి-తార (చీకటి-వెలుగుల )తరువాత వచ్చే  ముగ్ధమనోహర త్రిపురసుందరి తత్తవముగా ప్రసూనమాలలు ప్రస్తావింపబడినవి.

 2.పశుపక్ష్యాదులు ప్రకటింపబడి పశుపతి అనుగ్రహమును పొందుతున్నవి.

   కదిలేది ప్రపంచం-కదలనిది పరమాత్మ.

   శివ భజేవ మనసా నిరంతరం.

  

     ఏక బిల్వం  శివార్పణం.





Saturday, November 9, 2024

TANOTU NAH SIVAH SIVAM-09



 

 


      తనోతు నః శివః శివం-09

     *******************

 " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తియే

   జగతః పితరం  వందే పార్వతీపరమేశ్వరౌ."



    పరమాత్మ తనతాండవమును మరింత ప్రకాశవంతమే కాక పరిమళభరితము గావింపనున్నాడనుటకు సంకేతముగా ప్రసూనమాలలు-ప్రసూనమాలాధారణముచేసిన  అశేషదేవతా పాదనమస్కారములు-అదేఅదనుగా వారి ప్రసూనములలోని పుప్పొడి స్వామి పాదపీఠమునకు అభిషేకమై-అలంకారమై-ఆత్మార్పణమై ఆనందించబోవుచున్నదేమో అనిర్వచనీయముగా.

     "పర చిదంబర నటం హృది భజ."

             జగదంబ 

 " పంచమీ పంచభూతేశి పంచసంఖ్యోపచారిణి"

     అమ్మ పంచభూతేశి.పంచభూతములకు ఈశ్వరి.పంచభూతములుగా ప్రకటితమైన పంచమి స్వామిని పంచసంఖ్యలతో పాదసేవనము చేయాలని తలచినది.

 " దివ్"  అను ధాతువునకు ప్రకాశము/తేజము అని భావము.అమ్మ తన ప్రకాశమును కొన్ని ప్రత్యేక ఉపాధులలో నిక్షిప్తముచేసి "లేఖ/దేవత/దేవుడు" అంటూ పేరు పెట్టినది.వారికి తమ తండ్రిని చూపించి-సేవింపచేయాలనుకున్నది.పరిమళభరిత ప్రసూనముల మాలలను వారిచే  ధరింపచేసినది.

          అవి సాధారణమైన పూలమాలలు కావు.

  పంచసంఖ్యలు కలిగినవి.ఆశ్చర్యపోకండి.అబద్ధముకాదు.

 పంచభూతములు తమ శక్తులను పంచతన్మాత్రలుగా ప్రకటింపచేసుకొనినవి..

 1. ఆకాశము-శబ్దము-కుసుమము తన మకరందముతో తుమ్మెదఝుంకారమును శబ్దముగా అందించగలుగుతున్నది.

 2.వాయువు-స్పర్శనము-కుసుమము  మృదుత్వమును స్పర్శగా మనకు అందిస్తున్నది.

 3.అగ్ని- జ్వలనము/ప్రకాశము-        కుసుమము  వికసిస్తూ  సుందరమైన రూపమును చైతన్యముగా--పొందుతోంది.

 4,జలము-కుసుమము జలమును ద్వారా వికసిత దళశోభితగా (రసము/శక్తి)మారుతున్నది.

  5.భూమి-కుసుమము భూమి ద్వారా పరిమళమును సంతరించుకుని  ఐదు సంఖ్యలతో 
 పరమేశ్వరుని సేవించుకొనుటకు పయనమైనది.

   స్వామి పాదపీఠమును సేవించుకొనుటకు అశేష 

    దేవతాసమూహము విచ్చేసియున్నారు

.    స్వామి అమ్మ తలపునకు ఆనందములో తలమునకలై 
    తాండవించుచున్నాడు.

   పరమేశ్వర పాదమెక్కడ దొరుకుతుంది పట్టుకుందామంటే.

  దేవతలు స్వామికి పాదనమస్కారము చేసుకుందామని తలలు  వంచారు.

        సదాశివపాదము,

            పతంజలి దర్శించిన,

 " సదంచిత-ముదంచిత-నికుంచిత పదం-ఝలఝలం చలిత మంజుకటకం
   పతంజలి దృగంజన మనంజనం -అచంచలపదం-జనన భంజనకరం."

  స్వామి పాదములు ఎందరెందరినో మువ్వలుగా అనుగ్రహించినవి.వారు,

   అనవరత ప్రణవనాదమును ఝలఝలం శబ్దముగా ప్రకటింపచేస్తున్నాయి.

   దేవతలకు పాదనమస్కారమునకు వీలులేకున్నది.

     ఇది ఒక లీల.

 ఎందరో సత్పురుషులు పట్టుకుని సంస్తుతిస్తున్న సదంచిత పాదమది.

 ఎందరికో ముదమును అందించుచున్న  పాదమది.

 వారు క్షణకాలము స్వామి పాదమును వీడియుండలేరు
.

  మంజుకటకములుగా మువ్వల పట్టీలుగా మారిన మహనీయులు                  వారు

 ఓం నమశ్శివాయ-నర్తించుస్వామి అని ప్రార్థిస్తూనే ఉంటారు.అనవరత స్వామి నర్తనాభిలాషులు.వారు కదులుతూ స్వామిని తాందవింపచేస్తూనే ఉంటారు.

  వారికి తెలుసు స్వామి నర్తన /తాండవ దర్శనము జనన భంజనకరమని.
  మళ్ళీ పుట్టవలసిన అవసరమును కలుగనీయదని.
   స్వామి తాండవము పతంజలి కన్నులకు కాటుక గా మారి జ్ఞానదృష్టిని ప్రసాదించినది.

   స్వామి తాండవ దర్శనము దేవతలకు ముదంచితమే.ఆనందదాయకమే.

   కిందకు-మీదకు-పక్కలకు నర్తిస్తున్న మహాదేవ నాట్యపాదము అచంచల/శాశ్వత సాయుజ్యమును ప్రసాదించునునది .చంచల స్థితిలో నున్న పాదము అచంచలస్థితిని అనుగ్రహించుటయే అద్భుతము.
   కనుకనే,
  "శివ పాదము మీద నీ శిరము నుంచరాదా" అన్నరు శ్రీదేవులపల్లి.
    స్వామి స్థిరముగా పాదమునందనీయక (దేవతలకు_)నర్తిస్తున్నాడు.ఆ నర్తనము స్వామికి మురెపము-వారికి ముదంచితము.  అంతర్లీనమైన కరుణ అచంచలపదవిని అనుగ్రహిస్తున్నది.వారికి.
      హరహర మహాదేవ

    ప్రసూనము-అప్పుడే పుట్టినది.(ప్రసవము-జననము) అప్పుడే పుట్టిన ప్రసూనము తన శబ్ద-స్పర్శ-రూప-రస-గంధాదులు ఏకీకృతమైన పుప్పొడిగా మార్చి స్వామి పాదపీఠమున చేరినవి.(విషయవాసనలను విడిచివేసిన వివరమది)

   అమ్మ ,

   సహస్రశీర్ష వదనా-సహస్రాక్షి సహస్రపాత్

     స్వామి

   సహస్రలోచన ప్రభ్యుత్యశేష  లేఖ శేఖరుడు.

        అంతేకాదు

   కిశోర చంద్రశేఖరుడు మాత్రమేకాదు
                        ఇప్పుడు చకోరబంధుశేఖరుడు.

  స్వామి తన తాండవముతో మనలకు ఆపాద-మస్తక దర్శనమును 
  అనుగ్రహించబోతున్నాడు.స్వామికరుణ అనే అంజనమును మన కన్నులకు అలదుకుని స్వామి 
   తాండవమును దర్శించి-తరించుదాము.  

    కదిలేది  ప్రపంచము-కదలనిది పరమాత్మ

    భజశివమేవ నిరంతరం

       ఏకబిల్వం  శివార్పణం. 

 

 





Friday, November 8, 2024

TANOTU NAH SIVAH SIVAM-08


 


    తనోతు న#హ్ శివః శివం-08

    *******************

  "  వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే

     జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ."


    స్వామి ప్రకాశమైతే అమ్మ వ్యాపినీ వివిధాకార /ఆ ప్రకాశమును సర్వత్రా వ్యాపింప చేసే విమర్శ.స్వామి స్థావరమైతే అమ్మ జంగమాత్మకము.స్వామి జంగమయైతే అమ్మ స్థావరముగా స్వామిలో ఒదిగి పోతున్నది.స్వామి తాందవిస్తున్నాడు.తల్లి స్థిరముగా తానుండి స్వామిని తాందవింపచేస్తున్నది.ఒకపరి అమ్మ అష్టమీచంద్ర విభ్రాజ.మరొకపరి స్వామి స్వామి భిభర్తు భూత భర్తరి.అర్థనారీశ్వర పరమార్థము అనిర్వచనీయము.


 " జటా భుజంగ పింగళః స్పురత్పణా మణిప్రభా

   కదంబ కుంకుమ ద్రవ ప్రలిప్త దిక్వధూముఖే

   మదాంధ సింధుర స్పురత్వగుత్తరీయమేదురే

   మనోవినోదమద్భుతం భిభర్త్ భూత భర్తరి."

 1.స్వామి జటలలో భుజంగము పడగలమీది మణులు ఎరుపుతో కూడిన పసుపువర్ణమైన పింగల వర్ణముతో ప్రకాశించుచున్నవి.అవి మంగలకరమైన "పసుపుకుంకుమలా" అనిపిస్తున్నవి.స్వరూపమునుతో పాటుగా తమ స్వభావమును సైతము మార్చుకుని జగత్కళ్యాణమునకై,

 2.కదంబ కుంకుమద్రవ ప్రలిప్త దిగ్వధూముఖే.


 దిగ్వధువుగా తనను ప్రకటించుకొనిన జగన్మాత{బాలాత్రిపుర సుందరీ స్తోత్రము కీర్తించినట్లుగా)

 1.కదంబవనచారిణీ

 2.కదంబవన వాసినీ

 3.కదంబ వనశాలయా

 4.కదంబవన మధ్యగా

   అసలు కదంబవనమునకు సర్వమంగలకు భేదమేలేదు.ఆ తల్లి ఎప్పుడును

 "సకుంకుమ విలేపనాం-అళికచుంబి కస్తూరికాం"

    కళ్యణకరముగా ఆ తల్లి నుదుటను "కదంబ కుంకుమద్రవముగా మారబోతున్నది ఆ పాముపడగలమీదున్న మణులకాంతులు.మహాద్భుతమైన వినోదము.


   ఆది శంకరులు సౌందర్యలహరి స్తోత్రములో ప్రస్తుతించినట్లు,

 "కిరంతీం అంగేభ్యః కిరణనికురంబామృత రసం"

    స్వామి అలదుతున్న కదంద్రవ విలేపనము అను అనుగ్రహమును తల్లి అమృతమయముచేసి మనందరి[పై వర్షింపచేయుట ఎంతటి పరమాద్భుతము.

 3.మదాంధ సింధురస్పురత్ త్వగుత్తరీయనేదురే.

     తమోగుణమనే నల్లదనముతో/లోపలి అరిషడ్వర్గములు ప్రస్పుటముగా బాహాటము అవుచున్నవేళ ఆ గజ చర్మము మరింత నల్లగా-మందముగా స్పర్శను గ్రహించలేనిదిగా ఉన్నప్పటికిని,స్వామి కరస్పర్శచే పునీతమై ప్రకాశిస్తున్నడట.

   మహాద్భుతమైన వినోదము.స్వామిలీల.

   విషయవాసనలనే విషముతో నిండిన మనము సైతము స్వామి అనుగ్రహస్పర్శచే ప్రాకాశించగలముపాము పడగమీద నున్న మణుల కాంతుల వలె పింగళవర్ణముతో.

    అరిషడ్వర్గముల అధీనములో యుక్తాయుక్త విచక్షణమును కోల్పోయి జడము వలె మారిన మనము సైతము స్వామి కరస్పర్శచే ప్రకాశవంతమైన ఉత్తరీయములుగా మారగలము.

 పాముమణి-మదపుటేనుగు కేవలము సామూహిక సంకేతములే.

  4.మనోవినోదమద్భుతం భిభర్తు భూత భర్తరి.

    భూతభర్తరి-పంచభూతాత్మకమైన పరమేశ్వర తత్త్వము

  భిభర్తు-భూతభృత్-ప్రపంచముగా ప్రకాశిస్తున్నది.

   ప్రపంచముగా ప్రకాశిస్తున్న పరబ్రహ్మము యొక్క అద్భుత మనోవినోదముతో అంతర్లీనమవ్వాలనుకుంటున్నది నా మనసు.


   విశేషములు

   **********

 1 నలుపు-పింగళ వర్ణములను దివారాత్రములుగా.సూర్యోదయ-సూర్యాస్తమయముగా కాల నిర్దేశము కావించుట

 2.విశ్వేశ్వర తాండవమే విశ్వపరిభ్రమణము .

 3.ప్రపంచకళ్యానమే పార్వతీపరమేశ్వర కళ్యానము

 4.జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ.

       తల్లితండ్రులను సంస్కృత భాషలో పితరౌ అంటారని పెద్దలు చెబుతారు.

     కదిలేది ప్రపంచం-కదలనిది పరమాత్మ

      భజశివమేవ నిరంతరం.

   ఏకబిల్వం  శివార్పణం..


    


Thursday, November 7, 2024

TANOTU NAH SIVAH SIVAM-07


   








  తనోతు నః  శివః శివం-07

  **********************

  "వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే

   జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ"

    మూలపదార్థమును అన్వేషించే మనసు తిరిగి సాకారమును సాధనముగా చేసుకుందా 

    మనుకున్నట్లున్నది.  

        " ఈశుని మ్రోలా-హిమగిరి బాలా  కన్యతనము ధన్యమైన గాథను " వినిపిస్తూ- 

   కనిపించేటట్లు చేస్తున్నది ఈశ్వరానుగ్రహము.


   స్వామి భూత భర్తరి-సకలజీవులను సంరక్షించేవాడు.జగత్కళ్యానమునకై పలుమార్లు 

   పార్వతిని పరిణయము చేసుకుంటాడు -పరిపాలనమును నిర్వహిస్తాడు.

        అదేజరుగబోతున్నట్లున్నది  ఇప్పుడు.

           మన్మథుని క్షమించి మంగళగౌరిని ను వివాహమాడిన మహాదేవుడు 

   మరొకసారి తన సృష్టి ప్రకటనమును విస్తృతము చేస్తున్నాడు.


        అది ప్రపంచముగా భాసించుచున్న పార్వతీదేవికి-ప్రపంచవిస్తరనమును గావిస్తున్న 

   పరమేశ్వరునికి మనదృష్టిలో మరొక కొత్త అధ్యాయము.కనుకనే మొదటి 

   చరణములో,భుజంగతుంగ మాలిక గా నున్న పాము ఇప్పుడు మణిప్రభా భుజంగముగా 

   మారబోతున్నది ఏ శుభసూచకమునకు తాను పాత్రధారికాబోతున్నదో

                అంతేకాదు మన అదృష్టము

   అందరికి దిక్కైన ఆదిపరాశక్తి తాను అష్టదిక్కులుగా మారి స్వామిని సేవించుకోబోతున్నది.


   వారిది ఒకవినూతన దాంపత్యము.మహాదేవుడు వరుడు/ కాబోయే భర్త(విశ్వమునకు) 

   భర్తకు జోడిగా /భార్యగా వధువుగా అమ్మ దిక్కులుగా తనను తాను ప్రకటించుకుంటోంది.


          గౌరీ కళ్యాణ వైభోగమే.

    అప్పుడు భీష్మించిన పెళ్ళికొడుకు ఇప్పుడు వాత్సల్యముతో,


   పసుపుతో కూడిన ఎరుపు వర్ణములను అమ్మ నుదుటిపై అలంకరించి   విశ్వ 

   గృహస్థాశ్రమమునకు విశ్వేశ్వరుడు కాబోతున్నాడేమో.

   

       అదే అదనుగా భుజంగము తన పడగమీది  కాంతులను 

   పసుపుకుంకుమలుగా /కదంబకుంకుమ ద్రవముగా మలచుకొని స్వామికి 

   అందించగా స్వామి దిక్వధూ నుదుటిపై తన స్వహస్తములతో అలంకరించి ,మన భాషలో 

   చెప్పాలంటే బొట్టు పెట్టి ఒట్టేశాడన్న మాట.ఇక ఏమోలు లేవు.అంతా 

   ఆఅశీర్వచనములే.అదే అన్నమాట/ఉన్నమాట.


  నీనుదుటను కుంకుమను అలంకరిస్తాను ఆ తదుపరి మన సంతతిని తల్లితండ్రులై రక్షిద్దాము.

  అంటున్నాడు తన తాండవ భంగిమతో

.

      శ్రవణానందకరమైన  ఆ మాట ను విననీయకుండా మాయదారి 

  ఇంద్రియములు మరింత విజృంభించి నిజముగా మనకోసమే వీరిద్దరి కళ్యాణము ..లేక


     అదేకదామదించిన ఇంద్రియములు చేస్తున్ననిర్వాకము.


    గిరిజాకళ్యాణము కాముని కాల్చిన తరువాత జరిగినదే కదా.


         ఇంద్రియాతీతుడు మహాదేవుడు.

          అహంకారముతో హుంకరించిన మదగజ చర్మమును 

  ఒలిచివేసి ,తన ఉత్తరీయముగా అలంకరించుకున్నాడు. 

  (స్వామికరుణను గ్రహించలేని ప్రతి జీవి/ఉపాధి మదముతో 

  కళ్ళుమూసుకొని పోయిన ఏనుగే కదా.)


      " ఉత్తర భుజమునందు శుభసూచకముగా ధరించు వస్త్రము ఉత్తరీయము."


 "అనుత్తరీయశ్చ-నగ్నశ్చ" అన్న సూక్తిని గౌరవిస్తూ ఏ శుభకార్యమునందైనను పురుషుడు 

  ఉత్తరీయమును ధరించవలసినదే.కనుక స్వామి తన దిగంబరత్వమును దాటి ఉత్తరీయమును 

  ధరించి పెండ్లికొడుకైనాడు సాంప్రదాయబద్ధముగా


       స్వామి ధరించినది త్వక్-చర్మపు ఉత్తరీయము.సింధుర/గజచర్మపు 

   ఉత్తరీయము.అదియును



  మదముతో అంధత్వముతో నున్న చర్మ ఉత్తరీయము.


    దేనికి సంకేతము ఈచర్య?


  మానవ ఉపాధికి-బాహ్య ప్రపంచమునకు ఉన్న అడ్దము/హద్దు/పొలిమేర  చర్మము.సత్యమైన శివమునకు-సుందరమైన శివమునకు(అంతరమునకు-బాహ్యమునకు)  మధ్యనున్న అవరోధము.అది స్వామి స్పర్శచే పునీతమై శాశ్వత ఆఛ్చాదనముగా అమరబోతున్నదట.

   కదిలేది ప్రపంచము-కదలనిది పరమాత్మ.

   శివం భజమేవ నిరంతరం.

        

 ఏక బిల్వం  శివార్పణం..


   


   


 









Wednesday, November 6, 2024

TANOTU NAH SIVAH SIVAM-06


 


  తనోవ నః శివః శివం-06

   ****************

  "వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే

   జగతః  పితరం  వందే పార్వతీ పరమేశ్వరౌ"


   మహాద్భుతమైనది ప్రస్తుత చరణము  శివశక్త్యాత్మకతను మరింత ప్రస్పుటము చేస్తోంది


 " ధరాధరేంద్ర నందిని విలాస బంధుబంధుర

   స్పురత్ దిగంతసంతతి  ప్రమోద మాన మానసే

   కృపాకటాక్ష ధోరణి నిరుద్ధ దుర్ధరాపది

   క్వచిత్ దిగంబరే మనో వినోదమేతు వస్తుని."


     సర్వమంగళా దేవి సమక్షములో మహాదేవుడు మహదానందముతో తాందవిస్తున్నాడు.

 1.ధరేంద్ర నందనందిని విలాస బంధు బంధుర

        లీలగా తనను తాను అలంకరించుకొనినది జగన్మాత.ఆలంకారములకు లక్ష్యము  మహాదేవుని ప్రమోద మానసునిచేయుటయే.

    అవలీలగా తాండవిస్తున్నాడు త్రయంబకుడు.ఆ తాండవమునకు

  లక్ష్యము మహాదేవిని ప్రమోద మానస చేయుటయే.

  వారిరువురి పరస్పరావలోకన లక్ష్యము వారి సంతతిని ప్రమోదమానసులను చేయుటయే.



     అమ్మది విలాసము-అయ్యది వినోదము.

  అమ్మ నందిని-ఆనందప్రదాయిని.

  అమ్మ అఖిల జగములకు ఆనందప్రదాయిని.

     అయ్య సృష్టిని తన తాండవముతో విస్తరింపచేస్తున్నాడు.అమ్మ ఆ విస్తరణలో వ్యాపిని వివిధాకారయైన చైతన్య శక్తిగా ప్రవేశించి ప్రకాశవంతము చేస్తున్నది.


   అమ్మ ధరాధరేంద్ర నందిని.

   ధరాధరము అంటే మనము రెండు విధములుగా అన్వయించుకోవచ్చును.

 మొదటిది

   ధరను మోయుచున్న పర్వతము.

 పర్వతము భూమినెట్లా మోస్తుంది? అని అజ్ఞానము సందేహిస్తుంది.

  మనము ఒక బొక్కెనలో పదార్థమునుంది మోయునపుడు మనశక్తి బొక్కెన కాడను పట్టుకుంటాము కనుక పైనుండి ప్రకటితమగును కిందనున్న వస్తువును /బొక్కెనను మోస్తుంది.

   రెండవ్ది

 పర్వతమును ధరించిన భూమి

  పండ్లబుట్తను తలపై పెట్టుకుని వెళ్తున్నప్పుడు వస్తువు పైన-దానిని మోసే శక్తి కింద ఉంటాయికదా.

   అదేవిధముగా 

  ప్రపంచముగా పార్వతిని కొత్తగా చూస్తున్న పరమేశ్వర మానసము ఉల్లాసభరితమైనది.

  ప్రపంచమై పరమేశ్వర తాండవమును చూస్తున్న పరమేశ్వరి మానసము ఉల్లాసభరితమైనది.

   వారిరువురిని వీక్షిస్తున్న దిక్కులు మానసము సైతము ఉల్లాసభరితమైనది.

 " ఆ మహోల్లాసమునకు  సంతతము సంతసమే కదా".అది,



2. స్పురత్ దిగంతర సంతత ప్రమోదమాన మానసము. 

     ఆ ప్రమోద మానసము కృపాకటాక్షవీక్షణమైన వేళ, 

3.కృపాకటాక్ష ధోరణి నిరుద్ధ దుర్ధరాపది.

        దుర్ధర -భరించలేని ఆపది-ఆపదలను నిరుద్ధ-నిర్మూలించివేస్తుంది.

  పార్వతీ-పరమేశ్వరుల కృపాకటాక్షవీక్షనము ఘోరవిపత్తులను సైతము తొలగించివేస్తుంది. 

  "భవానీ త్వం దాసే మయి వితర్ దృష్టిం స కరుణా" అంటోంది

   సౌందర్యలహరి స్తోత్రము.

   ఇప్పుడు ఆపదలు లేవు.కాని,

 స్తోత్రకర్తకు ఒక సందేహము.

  ఈశ్వర కరుణ , 

  రతి ప్రతిక్షణం మమ తొ గంగనుధరించిన,వాసుకిని కంఠహారముగా ధరించిన,కరమున ధ్వనించుచున్న డమరుకమును ధరించిన స్వామియందు మిక్కిలి మక్కువ కలిగి క్రీడించుటలో  తృప్తిని పొందుటలేదు.

  అక్కడేదో అంతకు మించిన" క్వచిత్ వస్తువు "  (బ్రహ్మపదార్ధము)   ఉన్నదని-ఆ వస్తువే మనోవినోదమునకు కారనము అని తెలుస్తోంది.

 

  స్వామి 1

   ఆ క్వచిత్ వస్తువుతో మమేకమై మనోవినోదమును పొందాలనిపిస్తున్నది మహాదేవా! నా అభ్యర్థనము మన్నించు.

   ఆత్మాన్వేషణము అత్యద్భుతమై,


   తాండవదర్శనమును మరింత తత్త్వమునకు చేరుస్తున్నది.


  ఇప్పుడు కావలిసినది కేవలము,


 స్వామి సాకార దర్శనము మాత్రమేకాదు.స్వామిని-స్వామిజటను-జటలోని గంగమ్మను-స్వామికంఠమును-కంఠమునకు చుట్టుకొనిన పామును,స్వామిచేతిని-చేతిలోని డమరును,సిగపూవును,ఎర్రటి తలపాగాను మిక్కిలి మక్కువతో చూస్తున్నప్పటికి 

ఇంకా..ఇంకా..ఏదో ..దేనినో తెలుసుకోవాలనే తపన,

  నందినీదేవీ-నందినీదేవి విలాసబంధురము-నందినీదేవి కృపాకటాక్ష వీక్షణము,ఆపదోద్ధరణము ఇలా -ఇని రూపములుగా,ఇన్ని విధములుగ,ఇన్ని తత్త్వములుగా ప్రకటనము చేస్తున్న " ఆ క్వచిత్ వస్తువు/మూలబ్రహ్మము "ఏదో తెలుసుకొని,దానితో మనోవినోదమును పొందగలగాలి అనుకునుటయే,

4.క్వచిత్ దిగంబరే మనోవినోదమేతు వస్తుమే."

      కదిలేది ప్రపంచం-కదలనిది పరమాత్మ.

        శివభజమేవ  నిరంతరం

          ఏక బిల్వం శివార్పణం.



 

 


Tuesday, November 5, 2024

TANOTU NAH SIVAH SIVAM-05

 


   

  తనోతు నః శివః శివం-05


  *****************



 


 " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే


   జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ"


     "శివగంగ శివమెత్తి పొంగగా

      నెలవంక సిగపూవు నవ్వగా

      హరిహరాత్మకమగుచు

      అఖిలప్రపంచమ్ము

         ఆనందమయముగా


      భవతిమిరహంశుదా 

      విశాలాక్షికై నిటాలాక్షుడే

         " నటకా వతంసుడై"

      తకధిమితక యని 

         నటనం  ఆడెనే.(శ్రీ  వేటూరి)


     తన తాందవముతో తత్త్వదర్శనమును అనుగ్రహిస్తున్నాడు మహాదేవుడు.


  కిశోర చంద్రుడు ముసిముసిగా నవ్వుకొనుచున్నాడు తన ప్రతిరూపమునుచూస్తూ.రెండవ కిశోరచంద్రుడు తనకు అండగా వస్తున్నాడని.


    ఆ ప్రదేశమంతా వేయి వెన్నెలలతో వెలిగిపోతున్నది.


  ఆదిశంకరులు దర్శించి,అత్యంత మనోహరముగా కీర్తించినట్లుగా,


 " శరజ్జ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూట మకుటాం" గా ప్రవేశించింది నాట్యవేదికకు ఆ ఆనందదాయిని నందిని అద్భుత సహచరియై ఆనందతాందవమునకై.



    ఆ అద్భుత సౌందర్యరాశిని  వీక్షించగలగటం స్తుతించగలగటము సామాన్యురాలినైనా నా తరమా?


   అమ్మ అనుగ్రహము దానికి మార్గమును చూపించింది


 "త్వదీయం సౌందర్యం తుహినగిరి కన్యే కథమపి తులయితు."

   తులయితు-వర్ణించుట,కథమపి-వీలుకానిది.


    తల్లీ నీ సౌందర్యమును వర్ణించుటకు బ్రహ్మాదులే సమర్థులు కామంటున్నప్పుడు నేనెంత ?  కాని నిన్ను దర్శించగల శక్తిగల  నేత్రము కేవలము సదాశివునిది మాత్రమే.కనుకనే , 

   ఏవిధముగా అమరలలనలు ,


 యత్-ఆలోక-ఉత్సుకతతో,

       

  గిరిశ మనసా తపోభి

    పరమేశుని సహాయమునకై మనసారా తపమాచరించి-తరించారు.

      

     ఏ నయన వీక్షణము ద్వారా వారు,


   తమ  మనోభీష్టమును పొందినారో,అదే కరుణ మనందరికి సైతము అమ్మదివ్యసౌందర్య దర్శనాశక్తిని అనుగ్రహించును గాక.


   అమ్మ నాట్యస్థలికి మామూలుగా రాలేదు.విలాసబంధు బంధురముగా వచ్చినదట.(పంచకృత్యములే అమ్మకు విలాసము కదా)

    అమ్మ లీలా కల్పిత బ్రహ్మాండ మండల కదా.


 బంధు-అలంకారములతో-,బంధుర-నిండినదై వచ్చినదట.


    అవి  మనము చేసుకునే మానవ అలంకారములు కాదు.(అమ్మ ధరాధరేంద్ర నందిని).లీలగా/విలాసముగా 


పంచభూతములను,పంచ తన్మాత్రలను,నదీజలములను,కొండలను-గుట్టలను,చెట్లను,పశుపక్ష్యాదులను,సూర్యచంద్రులను,నక్షత్రములను సకల చరాచర జగత్తులో చైతన్యముగా ప్రకాశిస్తూ,స్వామి తాండవము చేయు స్థలికి వచ్చినదట.


    అంటే శివ సృష్టిని శక్తివంతము చేస్తున్నది తల్లి.ఆ తల్లిని చూస్తూ మహాదేవుడు మరింత మురిపెముగా నర్తిస్తూ దిక్కులను తన తాండవముతో తన్మయత్వముతో ప్రకటించేస్తున్నాడట..

   అష్టమూర్తి నమోనమః


    స్వామి విశ్వ విస్తరణమునకు హద్దులు నిర్ణయించే సమయమాసన్నమయినట్లున్నగా అమ్మ స్వామి కృపాకటాక్షవీక్షణముతో  దిగంబరుని -చిదంబరునిగా మార్చివేసినది.వారిరువురి కృపాకటాక్షవీక్షణము  "క్వచిత్"అరుదైనది-అపురూపమైనది కనుక దుర్ధరాపదలను నిరుద్ధ నిర్మూలించుచున్నవై "నిత్యకళ్యాణమును "జరిపించుచున్నవి ప్రమోదముతో. 


     మహాద్భుతమైన తాందవము స్వామిని-అమ్మను-మనందరిని  ప్రమోద మానసులుగా మారుస్తున్నది.

     తాండవము-ప్రేక్ష్సకుడు అను రెండు విషయములున మోదము.

     తాండవము-నర్తకుడు-ప్రేక్షకుడు అను మూడు అంశములు ఒకేక బ్రహ్మపదార్థస్థిని పొగలుగుట ప్రమోదము.(అంతర్లీనమగుట)

   దృశ్యము-ద్రష్ట-దృష్టి అను మూడు అంశములు ఒకదానిలో మరొకటి మమేకమై మరొకటి గుర్తించలేని స్థితిలో నుంచుటయే "ప్రమోదము "కదా.



    తాండవము-తాండవించువాడు-తాందవమును దర్శించువారి సర్వం ఖలువిదం బ్రహ్మముగా మార్చుటయే మహాదేవుని మంచితనము.



   మరువకు శివనామం మదిలో ఓ మనసా

   ఇహపర సాధనమే -సురుచిర పావనమే.


     కదిలేది ప్రపంచము-కదలనిది పరమాత్మ

       భజశివమేవ నిరంతరం

            ఏక బిల్వం శివార్పణం.






Monday, November 4, 2024

TANOTU NAH SIVAH SIVAM-05


   

  తనోతు నః శివః శివం-05

  *****************

 

 " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే

   జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ"


     తన తాందవముతో తత్త్వదర్శనమును అనుగ్రహిస్తున్నాడు మహాదేవుడు.

  కిశోర చంద్రుడు ముసిముసిగా నవ్వుకొనుచున్నాడు తన ప్రతిరూపమునుచూస్తూ.రెండవ కిశోరచంద్రుడు తనకు అండగా వస్తున్నాడని.

    ఆ ప్రదేశమంతా వేయి వెన్నెలలతో వెలిగిపోతున్నది.

  ఆదిశంకరులు దర్శించి,అత్యంత మనోహరముగా కీర్తించినట్లుగా,

 " శరజ్జ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూట మకుటాం" గా ప్రవేశించిది నాట్యవేదికకు ఆ ఆనందదాయిని నందిని అద్భుత సహచరియై ఆనందతాందవమునకై.

    ఆ అద్భుత సౌందర్యరాశీని వీక్షించగలగటం స్తుతించగలగటము సామాన్యురాలినైనా నా తరమా?

   అమ్మ అనుగ్రహము దానికి మార్గమును చూపించింది

 త్వదీయం సౌందర్యం తుహినగిరి కన్యే కథమపి తులయితు.

    తల్లీ నీ సౌందర్యమును వర్ణించుటకు బ్రహ్మాదులే సమర్థులు కామంటున్నప్పుడు నేనేంత? కాని నిన్ను దర్శించగల శక్తిగల  నేత్రము కేవలము సదాశివునిది మాత్రమే.కనుకనే ,ఏవిధముగా అమరలలనలు ,

 యత్-ఆలోక-ఉత్సుకతతో, 

 ఆ జగజ్జనని దివ్యసౌందర్య దర్శన ఉత్సుకతతో మనసారా మహాదేవుని తపమాచరించి మనోభీష్టమును పొందినారో,అదే కరుణ మనందరికి సైతము అమ్మదివసౌందర్య దర్శనాశక్తిని అనుగ్రహించును గాక.

   అమ్మ నాట్యస్థలికి మామూలుగా రాలేదు.విలాసబంధు బంధురముగా వచ్చినదట.

 బంధు-అలంకారములతో-,బంధుర-నిండినదై వచ్చినదట.

    అవి  మనము చేసుకునే మానవ అలంకారములు కాదు.అమ్మ ధరాధరేంద్ర నందిని.లీలగా/విలాసముగా 

పంచభూతములను,పంచ తన్మాత్రలను,నదీజలములను,కొండలను-గుట్టలను,చెట్లను,పశుపక్ష్యాదులను,సూర్యచంద్రులను,నక్షత్రములను సకల చరాచర జగత్తులో చైతన్యముగా ప్రకాశిస్తూ,స్వామి తాండవము చేయు స్థలికి వచ్చినదట.

    అంటే శివ సృష్టిని శక్తివంతము చేస్తున్నది తల్లి.ఆ తల్లిని చూస్తూ మహాదేవుడు మరింత మురిపెముగా నర్తిస్తూ దిక్కులను తన తాండవముతో తన్మయత్వముతో ప్రకటించేశాడట.

    స్వామి విశ్వ విస్తరణమునకు హద్దులు నిర్ణయించే సమయమాసన్నమయినట్లున్నగా అమ్మ స్వామి కృపాకటాక్షవీక్షనముతో దిగంబరుని -చిదంబరునిగా మార్చివేసినది.వారిరువురి కృపాకటాక్షవీక్షనము "క్వచిత్"అరుదైనది-అపురూపమైనదికనుక దుర్ధరాపదలను నిరుద్ధ నిర్మూలించుచున్నవై "నిత్యకళ్యాణమును "జరిపించుచున్నవి ప్రమోదముతో. 

     మహాద్భుతమైన తాందవము స్వామిని-అమ్మను-మన్మదరిని ప్రమోద మానసులుగా మారుస్తున్నది.

   దృశ్యము-ద్రష్ట-దృష్టి అను మూడు అంసములు ఒకదానిలో మరొకటి మమేకమై మరొకటి గుర్తించలేని స్థితిలో నుంచుటయే "ప్రమోదము "కదా.

    తాందవము-తాండవించువాడు-తాందవమును దర్శించువారి సర్వం ఖలువిదం బ్రహ్మముగా మార్చుటయే మహాదేవుని మంచితనము.

   మరువకు శివనామం మదిలో ఓ మనసా

   ఇహపర సాధనమే -సురుచిర పావనమే.



TANOTU NAH SIVAH SIVAM-04




 



      తనోతు నః శివః శివం-04

      *********************

 "వాగర్థావివ సంపృక్తౌ  వాగర్థ ప్రతిపత్తయే

  జగతః  పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ."

               (మహాకవి కాళిదాసు)



   మనలను తరింపచేయుటకు మహాదేవుడు మనోహరముగా తాండవమును ప్రారంభించాడు.తననుదుటి శోభలను మరింత శోభాయమానము చేస్తూ.

    ఆ శోభలను తిలకించి పులకించిపోదాం.

1 జటా కటాహ సంభ్రమ భ్రమ న్నిలింప నిర్ఝరీ

   ఎంతటి వాక్చమత్కారము.భ్రమ -సంభ్రమ అంటూ

  భ్రమణము-తిరుగుతోందిట గంగమ్మ.కాని మామూలుగా తనకు నచ్చినట్లు కాదు.తాండవ ప్రారంభమునకు ముందు ప్రశాంతముగా ప్రవహించిన ఝరీ-నదీప్రవాహము/నిర్ఝరీ-జీవనదీప్రవాహము/నిలింప నిర్ఝరీ-దివ్యమైన జీవనదీ ప్రవాహమునకు,

 సంభ్రమ-భయముతో కూడిన ఆశ్చర్యము కలిగినదట.

   దానికి కారణము జటాటవి అనుకున్న స్వామి కేశపాశము "జటాకటాహము"గా తన రూపును సవరించుకున్నది.

    ( నామిత్రులు ఇచ్చిన సలహామేరకు ఒక్కసారి గంగావతరణమును తలచుకుంటాను.) గంగమ్మ తానెటు పోవాలో తెలియక ఉన్నవేళ మహాదేవుడు తన జటలో అమరికగా పొందుపరచుకున్నాడు కదా.మళ్లీ అదే పరిస్థితి.ఎటు పోవాలో తెలియక గంగమ్మ ఆ పెద్ద గంగాళము వంటి స్వామి జటాజూటములో సంభ్రమాశ్చర్యములో సుడులు సుడులు తిరుగుతుండగా , ఆ  పరిభ్రమణము
    స్వామి నుదుటను ఆ తరంగములప్రకాశముగా  పరావర్తనము చెందినదట.

2.విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధనీ.

    గంగమ్మ వీచి-తరంగములు,విలోల-సుడులు తిరుగుచుండగా,

    ఎంతటి మహద్భాగ్యమును పొందుతున్నాయో వాటి కాంతులు

   మహాదేవునీ మూర్ధనీ-లలాటమును మరింత ప్రకాశవంతము చేస్తూ  సేవించుకుంటున్నాయి.

     ఈశ్వర చైతన్యము జలములో దాగి దాని ప్రవాహపు వేగమును పెంచుతూ ,కొత్త ఒరవడులను నేర్పి చిత్రములు చేయుచున్నది.ఓం నమః శివాయ.,

   ఇది గమనించిన పరమేశ్వరుని ఫాలనేత్రము 

3 ధగద్ధగ ద్ధగ జ్జ్వలల్లలాట పట్ట పావకే

      ధగధగలాడే     ఎర్రటి పట్టు ఉత్తరీయముగా   సొబగులు దిద్దుకుంటూ  స్వామి నుదుటను  ఎర్రటి తలపాగ తానైనది.., 


 4.కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ.


    అంతలోనే అమ్మో! స్వామికి వేడి తగులుందంటూ సన్నని చంద్రరేఖ సిగపూవుగా మారి శిఖను చేరింది.

    చంద్రశేఖరుని చేసింది ఈశ్వర చైతన్యము మురిసిపోతున్నది కొత్త సిరులతో.

     అదేమి విచిత్రమో కాని నా మనసు ఆ సుందరమూర్తితో ప్రతిక్షణము ఆడుకోవాలనుకుంటోంది.

    కాపాదమంటూ వే(ఆ)డుకుందాము ఆదిదేవునితో.

  

     విశేషములు

      ********

 1.కాలనిర్ణయమునకు  సంకేతముగా  కిశోరచంద్రుని పరిచయము.

   అలంకారము మాత్రమే కాదు,

    ముందు ముందు చరణములలో ఈ

   కిశోర చంద్రశేఖరుడు-తనకు జతను తెచ్చుకుని (శక్తివంతుడై)

   చకోర బంధుశేఖరుడుగా మారతాడు.

 2.హావభావముల పరిచయముగావింపబడినది.సృష్టి విస్తరణముతో పాటుగా మనోభావములు,
   పరిచయమవుతున్నవి.

    గంగమ్మకు సంభ్రమము-స్తోత్రకర్తకు "రతి" మిక్కిలి మక్కువ  ప్రకృతిసిద్ధములుగా ప్రస్తావింపబడినవి.

 3.పంచభూతములలో మూడవదైన "అగ్ని తత్త్వము" పరిచయమైనది.

 4.మనకు తెలిసిన వస్తువులతో మహదేవుని జటలను గంగాళము అంటూ,జ్ఞాన నేత్రమును ఎర్రటి ఉత్తరీయము అంటూ పోలికలను చెబుతూ,తెలిసిన వాని ద్వారా తెలుసుకోవలసిన దానిని చూపెడుతూ స్తోత్రము  పరమాత్మకు/ స్వామికి మనలను మరింత సన్నిహితులను చేస్తున్నది.

    కదిలేది ప్రపంచం-కదలనిది పరమాత్మ

      భజ శివమేవ నిరంతరం.

            ఏక బిల్వం  శివార్పణం.






Sunday, November 3, 2024

TANOTU NAH SIVAH SIVAM-03


      

   తనోతు నః శివః శివం-03

   ******************




 




 " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే


   జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ."


       (మహాకవి కాళిదాసు)




  మహాదేవుని కరుణ మాటలలో చెప్పలేనిది.మనసుతో ఆస్వాదించవలసినది.


   గంగమ్మను-వాసుకిని-డమరకుమును ప్రపంచమునకు పరిచయము చేసిన విశ్వేశ్వరుడు తన విశ్వరచనమును మరింత విస్తృతము చేస్తున్నాడు.


  "గంగాతరంగ కమనీయ జటాకలాపం-"


  తనజటల స్వరూపమును మార్చివేస్తున్నాడు.


 చిక్కులతో విడదీయరాని అటవి గమ్మత్తుగా పెద్ద గంగాళముగా తన రూపును సవరించుకుంటోంది.ఇది గంగమ్మకు ఒకపెద్ద సవాలు.తన పాటికి తాను ప్రశాంతముగా ప్రవహిస్తూ,స్వామి జటలను పావనముచేస్తూ,నాట్యవేదికను పవిత్రమొనరించానని తన సామర్థ్యమునకు పొంగిపోదా మనుకుంటే,

          అబ్బే1

 ఆ అవకాశమే లేకుండా చేస్తోంది స్వామి జట.ఎటువెళ్ళాలో తెలియక భయముతో కూడిన ఆశ్చర్యముతో సుడులుతిరగ తప్పదనుకుంటోంది పాపం.


  మహాదేవుడు తన లలాటమును విష్ణుపాదముల నుండి ఆవిర్భవించిన గంగాతరంగ భ్రమణము యొక్క కాంతులతో(వల్లరులు) తేజరిల్లునట్లు సేవాభాగ్యమును కల్పించినాడు.గంగమ్మ తల్లినిచూసిన మూడవకన్ను తాను సైతము ఎర్రని వస్త్రముగా స్వామి నుదుటిని సేవించుకుందామనుకుంటుమ్న్నది


   ఇదియే కదా చమత్కారము.


 నీరు-నిప్పు సహనముతో-సమన్వయముతో స్వామి నుదుటను ప్రకాశించుట.(అగ్ని-సోమాత్మకము)


 పంచభూతములలో(భూతము  అనగా ఉనికిని ప్రకటించుకొనినది)  మూడవ భూతమైన అగ్ని ,భూమి-జలములతో వచ్చిచేరినది.


 అభిషేకము జరిగినది.  తదుపరి  అలంకారము సహజముకదా.


 "సీతాంశు శోభిత కిరీట విరాజమానం" 

       మహాదేవుడు  తన శిఖపై బాలచంద్రుని సిగపూవుగా అలంకరించుకొనుటకు ముచ్చట పడుతున్నాడేమో.


  ఈ బాల చంద్ర ధారణ రహస్యము మనకు ముందుముందు అర్థమవుతుంది.


 మొదటి చరణము "వీక్షణమును" ,   అనుగ్రహిస్తే,

       రెండవ చరణములో 

 స్వామి కరుణ అవ్యాజమై స్వామితో క్రీడించవలెనని అదియును నిండు మనసుతో,. ప్రతిక్షణము/అనిశము మహేశహృదయ క్రీడాసక్తగా మారాలనుకుంటున్నది

        నా మనసు.అంతలా మార్చివేస్తున్నాడు మహదేవుడు .


 మనసుకు -స్వామి కి మధ్యన సారథియైన రెండవ చరణ ము.


 " జటా కటాహ సంభ్రమ భ్రమ న్నిలింప నిర్ఝరీ


   విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధనీ


   ధగద్ధగ ధగజ్జ్వలల్లలాట పట్ట పావకే


   కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ."


   


     ఈ చరణ విశేషములను రేపటి బిల్వార్చనములో తెలుసుకునే ప్రయత్నము చేస్తాను.


   కదిలేదిప్రపంచం-కదలనిది పరమాత్మ.


    భజ శివమేవ నిరంతరం.


         ఏక బిల్వం శివార్పణం.



   




Saturday, November 2, 2024

TANOTU NAH SIVAH SIVAM-02

  

   తనోతు నః శివః శివం-02

    *****************

 " వాగర్థా వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తియే

   జగతః పితరం వందే "పార్వతీ పరమేశ్వరౌ".


   వాక్కు+అర్థము ఏవిధముగా అవిభాజ్యములై పారవతీ పరమేశ్వర రూపములో ఉన్నాయో అట్టి పరమేశ్వర తత్త్వమునకు వాగర్థ ప్రసాదనమునకై నేను నమస్కరించుచుచున్నాను.(మహాకవి కాళిదాసు)

 పూర్ణబిందువు ను పరమాత్మ తత్త్వముగా అన్వయించుకొను ఆగమశాస్త్రపండితులకు ,

 శ్రీవిద్యారహస్యాన్వితమైన "శ్రీచక్రము"-ఉపనిషత్సమానమైన "శివ తాండవ స్తోత్రము" పరస్పరము బింబ-ప్రతిబింబములే.


  చరణములోని నాలుగు పాదములు నాలుగు ప్రత్యేక విశవ్షములతో ప్రస్తావింపబడినవి.

1.ప్రపథమముగా గంగాజల ప్రవాహము నాట్య సభాస్థలిని పవిత్రమొనరించినది.

   జటాటవీ గలజ్జల ప్రవాహ పావితస్థలే.

     స్థలే-ప్రదేశము-పావిత స్థలే-పునీతముచేయబడిన ప్రదేశము,గలత్-ప్రవహ జలే-ప్రవాహ జలముతో పునీతము చేయబడినది ఆ నాట్యస్థలి.ఆ ప్రవాహ జలము తన పయనమును,

 జటాటవి-మహాదేవుని అటవి వంటి జడల మధ్యనుండి ప్రారంభించినది.

   శ్రీ చక్ర పరముగా అన్వయించుకుంటే ఇది భూపుర  రహస్య సంకేతము.

  

   ఆ ప్రవాహము ఈశ్వరుని జటాటవి నుండి తన కదలికలను ప్రారంభించి కల్మషములను తొలగించివేసినది.

  అంటే ఈశ్వర చైతన్యము జలరూపముగా తనను  తాను ప్రకటించుకొనుచు పృథ్వీ తత్త్వమును పునీతము చేస్తున్నది .

 2.రెండవ పాదములో భుజంగము ప్రకటించబడినది.

    గలేవ లంబ్య లంబితాం భుజంగ తుంగ మాలికాం



  గలేవ-స్వామి కంఠమునకు,లంబ్య-చుట్లు,లంబితాం-చుట్టుకుని,భుజంగ-వాసుకి,తుంగ-పవిత్రమైన,మాలికాం-హారముగా తనను తాను అలంకరించుకొనినది.

 3.డమడ్డమ డ్డమడ్డమ న్నినాద వడ్డమర్వయం.

  డమరు-డమరుకము-అర్వయ-ప్రకాశించుచున్నది.

  

  గంగ-వాసుకి స్వామికి అలంకారములై అనవరతము సేవించుట గమనించి,డమరుకము తాను సైతము డమ-డమ ధ్వనితో స్వామి కరముననిలిచి ప్రణవముతో ప్రకాశించుచున్నది.సర్వాంగ సుందరుడైన సదాశివుడు చేయుచున్న,

4.చకార చండ తాండవం "తనోతు నః శివః శివం."

      గంగను-వాసుకిని-డమరుకమును ధరించిన స్వామి చేయుచున్న,

 చకార-మంగళకరమైన,చండ-ప్రకాశవంతమైన,కాంతి+కరుణతో మిళితమైన తాండవము మనందరిపై మంగళములను వర్షించునుగాక.


    

  విశేషములు

  *******

 స్వామి తన కదలికలతో అటవి అంటూ భూతత్త్వమును+జలము అంటూ ,జలతత్త్వమును,డమరుక నాదము అంటూ సోహం ప్రాణశక్తిని నిక్షిప్తము చేసి విశ్వరచనకై తన సాకార చైతన్యమును అమరిన కదలికల ద్వారా విస్తరింపచేస్తున్నాడు.

 మొదటి పాదములో పంచభూతముల సృష్టి,రెండవ పాదములో లబ్య లంబితాం-చుట్లుచుట్లుగా చుట్టుకుంటూ,అంటూ పంచకృత్యముల ప్రస్తావనను నిక్షిప్తముచేసారు.అదేవిధముగా మూలాధారము కుండలిని చుట్లుచుట్టుకుని ఉండటం,అనాహత శబ్దముతో హృదయ స్థానము లోని ప్రణవమును నిక్షిప్త పరచి,విశ్వవిస్తరణమును చేయుచు ఈశ్వరచైతన్యము ఆర్భటి రీతిలో చేయు తాండవము శుభములను మనందరిపై  విస్తరించునుగాక.

   స్వామి ప్రాభవమును రేపటి బిల్వార్చనములో తెలుసుకునే ప్రయత్నమును చేస్తాను.

  కదిలేది ప్రపంచం-కదలనిది పరమాత్మ

      భజశివమేవ నిరంతరం.

          ఏక బిల్వం శివార్పణం.

 


  

Friday, November 1, 2024

TANOTU NAH SIVAH SIVAM-01

 


  తనోతు నః శివః శివం-01

  *******************


 " కైలాసగిరి  నుండి కాశికై

   కాశికాపురి  నుండి దాసికై

   దాసికై ఈ దక్షవాటికై

   దయచేసినావయా హరహర హరహర."


   లోక కళ్యానమునకై ఈశ్వరచైతన్యము సూత్రధారియై కొందరిని పాత్రధారులుగా మలుస్తుంది.వారిని అంటిపెట్టుకుని ఉండమని ఇంద్రియములను పిలుస్తుంది.వాటిని అరిషడ్వర్గములతో ఆటలాడుకొమ్మంటుంది.అయ్యో పాపం అంటూ అక్కునచేర్చుకుంటుంది.దానికిఉదాహరణమే,

 నిరాకారము-నిరంజనము-నిర్గుణమైన ఈశ్వరచైతన్యము సాకారమై,తనతో పాటు మరికొన్నింటిని,మరికొందరినితాను ఆడుచున్న ఆటలో భాగస్వాములనుచేస్తుంది.తానొకవైపు-తన చైతన్య ప్రకటనము మరొకవైపు ఉండేటట్లు చేస్తుంది.

   

     పరమాత్మతత్త్వము మనకు ఒకాద్భుత స్తోత్రరాజమును అందించాలనుకుంది.దానికి మరొకరిని కర్త అనుకునేటట్లుగా చేసి సంఘటనలను పొందుపరిచినది.వాటితే మనకేమి సంబంధము లేదు అనుకుంటే మనము పప్పులో కాలేసినట్లే.

 ప్రతి ఒక్కరి బదులుగా ఆ పాత్రలు భక్తిభావముతో స్వామిని సేవించుకుంటూ మనకు మార్గదర్శకముగా మారతాయి.మంచి-చెడు విచక్షణను కలిగించటానికి రెండుగా ప్రకటనమవుతాయు.వాటి మధ్యన సంఘర్షణను కలిగిస్తూ మనలను సంస్కరిస్తుంటాయి.


   తన పాద తాడనమును అంశముగా చేసి-తాండవమును అనుగ్రహించాడు.

   తన స్వరూప-స్వభావములను లోకవిదితము చేయుటకు,రవమును బ్రహ్మాండముగా చేయగల తనభక్తుడైన రావణ బ్రహ్మను ఎంచుకున్నాడు.అతనికి "మాతృభక్తి" అనే మహాపాశమును చుట్టబెట్టాడు.కైకసి శివార్చనకు విఘ్ణమును కలిగించి,తన పథకమును నిర్విఘ్నముగా కొనసాగించాడు.

  గమనిస్తే ఇక్కడ అన్నివిచిత్రములే.అన్నీ విరుద్ధములే.


 దక్షిణా పథము నుండి-ఉత్తరాపథమైన కైలాసమునకు 

 ప్రయాణము.

  రావణుడు గ్రహీత -సదాశివుడు దాత.

  జీవుడు ప్రదర్శించినది శక్తి-దేవునికి కావలిసినది భక్తి.

  రావణునిది అహంకారము-సదాశివునిది మమకారము.

  రావణునిది ఆగ్రహము-సదాశివునిది అనుగ్రహము

  రావణుడు కోరుకున్నది ఆత్మలింగము-సదాశివుడు ఇచ్చినది ఆత్మసాక్షాత్కారము

  వారికి మధ్యన సారథి అయినది స్తోత్రము.

 మొదటి చరణము

 **********

 " జటాటవీ గలత్ జల ప్రవాహ పావితస్థలే

   గలేవలంబ్య లంబితాం భుజంగ తుంగ మాలికాం

   డమడ్డమ డ్డమడ్డమ న్నినాద వడ్డ మర్వయం

   చకార-చండ తాండవం "తనోతి నః శివః శివం."

      ఈ చరణ విశేషములను రేపటి బిల్వార్చనలో తెలుసుకునే ప్రయత్నము చేస్తాను.

    కదిలేది ప్రపంచం-కదలనిది పరమాత్మ

.

         భజశివమేవ నిరంతరం.

        ఏక బిల్వం శివార్పణం.


 .

  


TANOTU NAH SIVAH SIVAM-12

    తనోతు నః శివః శివం-12   *****************   "  వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే      జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...