Posts

DAARIDRYA DAHANA STOTRAMU -MAHARSHI VASISHTAKRTAMU.

Image
 దారిద్ర దుఖః హరణ స్తోత్రము-వశిష్ట మహర్షి విరచితము.  ***************************** ****************** 1.నరకము దాటిస్తాడు-సకలము పాలిస్తాడు   శృతులను వినిపిస్తాడు-సుధలను కురిపిస్తాడు   సర్పాలను ధరిస్తాడు- కర్పూరపు కాంతివాడు   దరిద్రమును దహిస్తాడు-దయార్ద్ర హృదయుడు శివుడు. 2.. పాము కంకణముల వాడు-పార్వతి మెచ్చినవాడు    యమునికి యముడైనవాడు-తోయమును ధరించాడు    కరిచర్మము ఒలిచాడు-కళాధరుని మెచ్చినోడు      దరిద్రమును దహిస్తాడు-దయార్ద్ర హృదయుడు శివుడు. 3. జలధిని దాటిస్తాడు-జన్మలు తీసేస్తాడు    భక్తుల దగ్గరి వాడు-భ్రష్టుల శిక్షిస్తాడు    వెలుగు గుప్పిస్తాడు-స్మరణతో నర్తిస్తాడు     దరిద్రమును దహిస్తాడు-దయార్ద్ర హృదయుడు శివుడు    4. మూడు కన్నులవాడు-మువ్వల పాదముల వాడు    బూడిద పూతల రేడు-భువనైక మనోహరుడు    చర్మము ధరియించుతాడు-కర్మలు తొలగించుతాడు       దరిద్రమును దహిస్తాడు-దయార్ద్ర హృదయుడు శివుడు. 5. ముల్లోకములు వాడు-మూలస్...

RAKSHABANDHAN-2018

Image
 రక్షాబంధన పండుగ శుభాకాంక్షలు **************************** 1. కొంచము ముందో మరికొంచం వెనుకో ఒకే తల్లిగర్భములో ఒద్దికగా ఒదిగాము ఒదగనిచ్చినది బొడ్డుతాడు సహాయము. అదియేగ నేను నీ చేతికి కట్టిన దారము. 2. కొంచము తెలిసో మరికొంచము తెలియకో ఉమ్మనీటి మడుగులో ఒడుపుగా ఈదాము ఈదనిచ్చినది ఉమ్మనీటి సంస్కారము అదియేగ మెరిసే నీ కంటినీటి మమకారము . 3.కొంచము తడబాటో మరికొంచం పొరపాటో చిట్టిపొట్టి పాదాలతో అమ్మను గట్టిగా తన్నాము. తన్ననిచ్చినది తన్నినా తరగని తల్లిప్రేమ ఒరవడిఅదియేగ రక్షాబంధనపు ముడి. 4. కొంచము నగవులతో మరికొంచం తగవులతో నీవే ముద్దంటు నాకసలే వద్దంటు ఇద్దరము పెరిగాము వద్దన్నది చేసాననిఛెళ్ళుమనిపించినది నా చెంపదెబ్బ ఎర్రదనముఅదియేగ నీ నుదుట మెరిసేటి తిలకము. 5. కొంచము సేపు పచ్చి అంటు కొండముచ్చు నీవంటు అగ్గిమీద గుగ్గిలమై భగ్గుమన్నాము.రెచ్చిపోయి పచ్చగడ్డినే భగ్గుమనిపించినది ఆ చిచ్చు అదియేగ పచ్చగ ఉండాలని హారతిని తెచ్చు. 6. కొంచం సేపు అమ్మ అంటు మరికొంచం సేపు నాన్న అంటు అమ్మ ఒడి నాదంటు నాన్న భుజం నాదేనంటు నిన్ను రానీయననిఅన్నీ నావేనంటు బైఠాయించే వాళ్ళం అదియేగ నీ నోటిలోని తియ్యనైన...

VEDA SAARA SIVA STOTRAMU

 వేదసార శివ స్తోత్రము.( శ్రీ ఆదిశంకరాచార్య కృతము.)  ***************************** ************************** 1.స్వార్థ సంహార సంకేతముగాగ గజచర్మము   శాశ్వతత్త్వ పునీతముగాగ  గంగావతరణము   మనోవికార మర్దనము గద మన్మథ సంహరణము   మరువకే ఓ మనసా! శివ నామస్మరణము. 2.పంచకార్య నిర్వాహకుడు ఆ పంచముఖములవాడు   భస్మాలంకృతుడు  వాడు   భవతాపహరుడు   అపురూప నేత్రుడు వాడు త్రిపుర సంహారకుడు   మరువకే ఓ మనసా! శివ వ్యాపకత్వము. 3.గరళము కంఠకైవశముగాగ దేవతలు పరవశము   శివ వరప్రసాదము శిలాదసుత నందివాహనము   ప్రమథగణ విలాసము ఆ ప్రమోదమయ కైలాసము   మరువకే ఓ మనసా! మహేశ పాద పంకజము. 4.ఇడ-పింగళ-సుషుమ్న నాడులు ఈశ్వర శూలము   మహేశ శిరోభూషణము శశి, మనో నిగ్రహము   జాహ్నవి జగత్కళ్యాణము జంగమ జటాజూటము   మరువకే ఓ మనసా ! శివ పరిపూర్ణ తత్త్వము. 5.సర్వ సృష్టికారణ భవుడు వాడు స్వయంభువుడు   సృష్టి-స్థితి-లయ స్పష్టరూపుడు శుభుడు   నిరాకారుడు-ప్రకటిత ఓంకార రూపుడు   మరువకే ఓ మనసా !శివపాద శరణమ...

SIVA APARAATHA KSHAMAPANA STOTRAMU.

  శివ అపరాథ క్షమాపణ స్తోత్రము ( శ్రీ శంకర భగవత్పాదులు) ******************************************************************** 1. పూర్వకర్మ చుట్టుకున్న పుట్టబోవు శిశువును    మలమూత్రముల మధ్యనున్న మందభాగ్యుడను నేను    నీ ఎరుకలేని దుర్భర గర్భనరకవాసిని,శివ    అవ్యాజకరుణామూర్తి,నా అపరాథమును క్షమించు. 2.చిత్తు కనుగొనలేని పొత్తిళ్ళ శిశువును   మలము పురుగులతో నన్ను గిల్లుచున్నది,   ఇంద్రియములను కదిలించలేని వానిని,శివ   అష్టాంగమూర్తి,నా అపరాథమును క్షమించు 3.పంచముఖుని తలచని పడుచువాడిని నేను   పంచేంద్రియ పాములు కరుచుచున్న వాడను   విచక్షణనే మరచిన వింతవ్యామోహిని,శివ   అంబికా పతి,నా అపరాథమును క్షమించు. 4.పశుపతినికొలువని ముసలివాడిని నేను   కృశియించిన ఆది-వ్యాధి పీడితుడను   జ్ఞాపక శక్తి లేని అజ్ఞాన జలధిని,శివ   అభయప్రదాత, నా అపరాధమును క్షమించు. 5. పంచాభిషేకములు చేయనివాడను    పంచభక్ష్యములు-ధూపదీపములు    అర్పించగలేని అజ్ఞానిని ,శివ    అంగజ సంహార, నా అపరాధమును క్షమించు. 6....

RISHI UPAMANYU KRUTA ARTHANAAREESVARA ASHTAKAMU.

  అర్థనారీశ్వర అష్టకము.ఋషి ఉపమన్యు కృతము.   ***************************************** 1.నల్లని మొయిలుకాంతి నాతల్లి కచము   ఎర్రని మెరుపు కాంతి శివ జటాజూటము   గిరినేలు నా తల్లి-ఉర్వినేలు నా తండ్రి   అర్థనారీశ్వరమై నన్ను ఆశీర్వదించు. 2.రత్నకుండల కాంతితో అమ్మ కర్ణములు   సర్పభూషణ కాంతితో స్వామి కర్ణములు   శివ నామము ప్రీతి-శివా నామము ప్రీతి   అర్థనారీశ్వరమై నన్ను ఆశీర్వదించు. 3.మందార మాలలతో  మా తల్లి గళము   కపాలమాలలతో స్వామి మంగళము   దివ్య వస్త్రము దాల్చి-దిక్కులను దాల్చి   అర్థ నారీశ్వరమై  నన్ను ఆశీర్వదించు. 4.పద్మార్చనతో నున్నది మాతల్లి పాదము   సర్పసేవితమైన  సాంబశివ పాదము   చంద్ర ప్రకాశముతో-చంద్రాభరణముతో   అర్థనారీశ్వరమై నన్ను ఆశీర్వదించు. 5.అద్భుత ప్రదర్శనము మా తల్లి లాస్యము   ఆసన్న  ప్రళయము మా తండ్రి తాండవము   సరిసంఖ్య కనులతో-బేసి కన్నులతో   అర్థనారీశ్వరమై నన్ను ఆశీర్వదించు. 6.నీలి కలువల కాంతి అమ్మ నయనములు   వికసిత కలువలు మా అయ్య నేత్రములు   జగ...

BRAHMAJNAANAVALEE STOTRA MAALIKA.

Image
 బ్రహ్మజ్ఞాన వళీమాల-శ్రీ ఆదిశంకరాచార్య విరచితము  *****************************************   కలిసిలేను-కలువబోను   తెలియరాను నిజం నిజం   నశ్వరము నే కానే కాను   సచ్చిదానందమును నేను.   నిత్యము నేను-శుద్ధము నేను   సర్వవ్యపిని  నిజం నిజం   ఆకారము నే కానేకాను   సచ్చిదానందమును నేను.   సత్యము నేను-సాక్షిని నేను   పాప రహితము నిజం నిజం   పతనము నే కానేకాను   సచ్చిదానందమును నేను.   చైతన్యమునేను-జడము నేను   ఆనందరూపము నిజం నిజం   నాశనము నే కానేకాను   సచ్చిదానందమును నేను.   శాంతము నేను-ఆనందము నేను   ఆత్మానందము నిజం నిజం   ప్రకృతిని నే కానేకాను   సచ్చిదానందమును నేను.   తనువు కాను-మనసు కాను   సుఖరూపమును నిజం నిజం   నానారూపిని నే కానేకాను   సచ్చిదానందమును నేను.   గుణమును కాను-దోషమును కాను   పరంజ్యోతిని నిజం నిజం   మాయను నే కానేకాను   సచ్చిదానందమును నేను.   మాయను కాను-మర్మము కాను   స్వయంప్రకాశము నిజం ని...

SRI VAIDYANAATHAASHTAKAM

Image
  వైద్యనాథాష్టకము   **************  1.రఘువంశ నందనులు రమ్యముగ పూజింప    పశు-పక్షి-గ్రహములు ప్రార్థనలు సలుప    భవరోగ తిమిరాలు భస్మంబు గావింప    అందుకో దండాలు  శ్రీ వైద్యనాథ.  2.ఉత్తుంగ గంగ నీజటన్ ఉయ్యాలలూగ    ముక్కంటి దయ నెలవంక పూవాయెలె సిగ    కదిలింప నెంచిన కామకథ ముగిసెగ    అందుకో దండాలు  శ్రీ వైద్యనాథ.  3.త్రిపురాసురులను జయించితివి విలుకాడ    దుష్టత్వమును  పినాకము దునుమాడ    ప్రత్యక్షలీలలను ముజ్జగములు కొనియాడ    అందుకో దండములు  శ్రీ వైద్యనాథ.  4.చితిలోన నీచేతి స్పర్శను కోరిన ఎముక    సహకరిస్తుంది జీవికి సహనముతో కాదనక    నీ కనుసన్నలేగ సూర్యాగ్ని-చంద్రుల నడక    అందుకో దండాలు  శ్రీ వైద్యనాథ.  5.బహుస్వల్ప పంచేంద్రియ జ్ఞాన పశుతతి    బహుళమోహ బంధితులేగ మానవజాతి    నికృష్ట కుష్ఠాది రోగహతి నీ భాతి    అందులో దండములు  శ్రీ వైద్యనాథ.  6.వేదాంత వేద్య...