వైద్యనాథాష్టకము
**************
1.రఘువంశ నందనులు రమ్యముగ పూజింప
పశు-పక్షి-గ్రహములు ప్రార్థనలు సలుప
భవరోగ తిమిరాలు భస్మంబు గావింప
అందుకో దండాలు శ్రీ వైద్యనాథ.
2.ఉత్తుంగ గంగ నీజటన్ ఉయ్యాలలూగ
ముక్కంటి దయ నెలవంక పూవాయెలె సిగ
కదిలింప నెంచిన కామకథ ముగిసెగ
అందుకో దండాలు శ్రీ వైద్యనాథ.
3.త్రిపురాసురులను జయించితివి విలుకాడ
దుష్టత్వమును పినాకము దునుమాడ
ప్రత్యక్షలీలలను ముజ్జగములు కొనియాడ
అందుకో దండములు శ్రీ వైద్యనాథ.
4.చితిలోన నీచేతి స్పర్శను కోరిన ఎముక
సహకరిస్తుంది జీవికి సహనముతో కాదనక
నీ కనుసన్నలేగ సూర్యాగ్ని-చంద్రుల నడక
అందుకో దండాలు శ్రీ వైద్యనాథ.
5.బహుస్వల్ప పంచేంద్రియ జ్ఞాన పశుతతి
బహుళమోహ బంధితులేగ మానవజాతి
నికృష్ట కుష్ఠాది రోగహతి నీ భాతి
అందులో దండములు శ్రీ వైద్యనాథ.
6.వేదాంత వేద్యుడవు-యోగీశ్వరుడవు
ఆది-మధ్య-అంత రహితుడవు అనఘుడవు
ఆరోగ్యదాతవు-అనుక్షణ రక్షకుడవు
అందుకో దండాలు శ్రీ వైద్యనాథ.
7.విస్మయముకాద భస్మలేపనము చాలు
పిశాచ-దుఃఖార్తి నశియించి రాలు
అది నీ మహిమగ అవగతమైన పదివేలు
అందుకో దండాలు శ్రీ వైద్యనాథ.
8.శ్రీనీలకంఠుడు శ్రీకరుడు శివుడు
బూదిపూతలవాడు-గోడు విను రేడు
వాలాంబికేశుడు మనలను విడలేడు
అందుకో దండాలు శ్రీ వైద్యనాథ.
శ్రీ వైద్యనాథాష్టకమును మనఃసాక్షిగా స్మరించినా,జపించినా,
సర్వరోగహరము ఇది సర్వేశ్వరుని ఆన.
( ఏక బిల్వం శివార్పణం.)
ఓం తత్ సత్.
No comments:
Post a Comment