Posts

ALO REMBAVAY-09

Image
 తొమ్మిదవ పాశురం *************** తూమణి మాడత్తు  సుట్రుం విళక్కెళియ తూపం,కమళ త్తుయిల్ అణై మేల్ కణ్ వళరుం మామాన్! మగళే! మణికదవం తాళ్ తిరవాయ్ మామీర్! అవళై ఎళుప్పీరో! ఉన్ మగళ్ తాన్ ఊమైయో? అన్రి  స్సెవిడో? అనందలో? ఏమన్ పెరున్ తుయిల్ మందిరపట్టాళో? మామా ఎన్ మాదవన్-వైకుందన్" ఎన్రెన్రు నామం పలవుం నవిన్రు ఏలోరెంబావాయ్.   ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.   ******************************  మా  మాయన్-మహా మహిమాన్వితుడ  మాధవన్-మాధవా  వైకుందన్-వైకుంఠ వాసా  మా మాయన్-మహా మహిమాన్వితుడ  మాధవన్-మాధవా  వైకుందన్-వైకుంఠవాసా,అంటు    ఎన్రెన్రు-మరీ మరీ వినిపిస్తునది    హరినామ సంకీర్తనము.ఎక్కడ?   తూమణి-దోషరహితమైన మణులు పొదిగిన,  మాడత్తు-మేడ దగ్గర.  ఎవరు చేస్తున్నారు?బయట నున్న గోపికలు.   మణిమయకదవం తాళ్-మణిమయ తలుపు గడియపెట్టి ఉన్నది.దానిదగ్గర.  ఎందుకు చేస్తున్నారు-పెట్టి ఉన్న గడియను      గోపికను వచ్చి తెరువమని అభ్యర్థిస్తున్నారు.  తలుపు గడియ తీయమనవచ్చును కదా నేరుగా,  బయట నున్న గోపికలు స్వ గత ఆశ...

ALO REMBAVAY-08

Image
ఎనిమిదవ పాశురము. *****************   కీళ్వానం వెళ్ళెండ్రు ఎరుమై సిరువీడు   మేయాన్ పరందన కాణ్ మిక్కుళ్ళ పిళ్ళైకళుం   పోవాన్ పోగిన్రారై పోగామల్ కాత్తు   కూవువాన్ వందునిన్రోం కోగులం ఉడయ   పావాయ ఎళుందిరాయ్ పాడి పరై కొండు   మావాయ్ పిళందనై మల్లనె మాట్రినాయ్  దేవాదిదేవనై శెన్రునాం సేవిత్తాల్  ఆవా వెన్రాయాండు అరుడేలో రెంబావాయ్.    ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.  దేవదిదేవనె-శ్రీకృష్ణ పరమాత్మను  ఆవావెన్రు-త్రికరణ శుధ్ధితో  శెన్రుదాం-చెన్నుమీర  సేవిత్తాల్-సేవించుటకు  పావాయ్-ఓ గోపికా  ఎళుందిరాయ్-మేలుకో.  ఈ గోపిక బహిర్ముఖమగుటకు సుముఖముగా లేదు.చతుర భాషిణి.కనుక తగిన సమాధానములతో తాత్సారముచేస్తూ,వారిని పంపించేయాలనుకుంది.   అందుకే గోదమ్మ,  కీళ్వానం వెళ్ళెన్రు-   వానం-ఆకాశము   కీళ్వానం-తూరుపుదిక్కు,    ఆకాశములోని తూరుపు దిక్కు తన నల్ల రంగును వీడి( తమోగుణమును)   వెళ్ళెన్రు-తెల్లబడినది/తెల్లవారినది.  కణ్-చూడు అనగానే,  లోపలనున్న గోపిక,   ఆ ప్రకాశము తూరుపు దిక్కుది కాదన...

ALO REMBAVAY-07

Image
  ఏడవ  పాశురము   ****************  కీశు కీశెన్రెంగుం  ఆనైచ్చాత్తు కలందు  పేశిన పేచ్చరవం కేట్టిలైయో? పేయ్ పెణ్ణే     కాశుం పిరప్పుం కలగల ప్పక్కై ప్పేర్తు  వాశ నరుం కుళల్ ఆయిచ్చియర్ మత్తినాల్  ఓశై పడుత్త  తైరరవం కేట్టిలైయో?  నాయగ పెణ్ పిళ్ళాయ్ నారాయణన్ మూర్తి  కేశవనై పాడవుం నీకేట్టే కిడత్తియో  దేశం ఉడయేయాయ్ తిరనేలో రెంబావోయ్.  " నారాయణతే నమో నమో   నారద సన్నుత నమోనమో."   తమోనిద్రను వీడి తాదాత్మ్యములో నున్నవారు కొందరు,తన మదిలోని స్వామిని సేవించువారు మరికొందరు,తన్మయములో నున్న కొందరు,తలపు మార్చుకొనుటకు ఇష్టపడనివారు కొందరు,తలుపుతీయుటకు ఇష్టపడని వారు ఇంకొందరు,తనవాడేనని తనతోనే ఉండాలనే వారు కొందరు,తనివితీరని తాదాత్మ్యముతో పరిసరములను పట్టించుకోని వారు ఇలా వివిధ భావములతో,భంగిమలతో,అనుభవములతో ..... నున్న గోపికల రూపములలో నున్న ఆచార్యులను/ఆళ్వారులను తల్లి దయతో మనము దర్శించ బోతున్నాము. వీరిలో ఎవరు ఎక్కవభక్తికలవారో-ఎంతటి భాగ్యశాలురో చెప్పుట సాధ్యము కానిది.  నిద్రిస్తున్న వారిది పారవశ్యము.  మేల్కొలుపు వారిద...

ALO REMBAAVAAY-06

Image
     ఆరవ  పాశురం.    *************  పుళ్ళుం శిలంబినకాణ్ పుళ్ళరయన్ కోయిలిల్  వెళ్ళై  విళి శంగిన్ పేరరవం  కేట్టిలైయో?  పిళ్ళాయ్! ఎళుందిరాయ్! పేయ్ ములై నంజుండు  కళ్ళచ్చగడం కలక్కళియ క్కాలోచ్చి  వెళ్ళత్తరవిల్ తుయిల్ అమంద విత్తినై  ఉళ్ళత్తు కొండు ముని వర్గళుం యోగి గళుం  మెళ్ళ ఎళుందు అరి ఎన్న పేరరవం  ఉళ్ళంపుగుందు కుళిరేలో రెంబావాయ్.    వినరో భాగ్యము విష్ణుకథ    వెన్నుబలమిదియే విష్ణుకథ.    గోదమ్మ రెండవ పాశురములో,    తీక్కరళై సెన్రుదోం-అని శ్రవణేంద్రియ నిషిధ్ధ పనిని తెలిపినది.ఈ పాశురములో శ్రవణ భక్తిని ప్రస్తావిస్తూ,దాని సత్ఫలములను సాక్షాత్కరిస్తున్నది.  పరీక్షిత్తును పరమపదమునకు చేర్చినది శ్రవణభక్తియే కద.   అమ్మఈ పాశురములో మూడు శబ్ద సంకేతములను పెరుమాళ్ సేవకు పిలుపుగా మనకు పరిచయము చేయుచున్నది.  మొదటిది-  పుళ్ళుం-పక్షులు.  అవి ఎటువంటివి అంటే,    అనుష్ఠానము-అనుగ్రహము అను రెండు రెక్కలు కలిగిన జ్ఞానులు-పరమ హంసలు.     అవి ఏమిచేస్తున్నాయంటే,...

ALO REMBAAVAI-05

Image
 ఐదవ పాశురం *************** మాయనై మన్ను వడమదురై మైందనై తుయపెరునీర్ యమునై యరైవరై ఆయర్ కులత్తినిల్ తోన్రుం మణివిళక్కై తాయై క్కుడల్ విళక్కం శెయద దామోదరనై తూయోమాయ్ వందు నాం తుమలర్ తూవి త్తుళుదు వాయినాల్ పాడి మనత్తినాల్ శిందిక్క పోయ పిళైయుం పుగుదరువా నిన్రనవుం తీయనిల్ తూశాగుం శెప్పు ఏలోరెంబావాయ్.  ఓం నమో భగవతే వాసుదేవాయ.    ఎంపావాయై - మన వ్రతములో ఈ రోజు,    మనము దామోదరుని దగ్గరనుండి ఒక వరమును అడిగి అనుగ్రహించమని గట్టిగానే అడుగుదాము అంటున్నది గోదమ్మ గోపికలతో.  ఈ పాశురములో గోపికల వాక్చాతుర్యము-త్రికరణశుధ్ధి-గడుసుదనము కలగలిసి స్వామినే సెప్పు-గట్టిగా చెప్పు అని అడుగుతున్నవి.స్వామి వారికి ఏమని చెప్పాలో తెలుసుకొనే పయత్నమును చేద్దాము.     గోదమ్మ స్వామిని,  మైందనై-అని పిలుస్తున్నది.     బాహ్యమునకు ఓ బాలకా అని ధ్వనిస్తున్నప్పటికిని,  ఓ మూలమా/ ఓ పరబ్రహ్మమా/ ఓ నాయకా అని స్పష్టముగా ప్రతిధ్వనిస్తున్నది.   కనుకనే వెంటనే-మాయినై అని -స్వామి నీ యొక్క,  మన్ను-లీలా విభూతులు, వర్ణింపశక్యము  కానివి అంటున్నది.  ఏమి తెలియని వాడిలా...

ALO REMBAAVAI-04

Image
  నాల్గవ పాశురము ************* ఆళిమళై కణ్ణా! ఒన్రు నీ కై  కరవేల్ ఆళియుల్  పుక్కు ముగందు కొడార్ త్తేరి ఊళి ముదల్వన్ ఉరువం పోల్ మెయికరుత్తు పాళియన్ తోళుడై ప్పర్బనాబన్ కైయిల్ ఆళిపోల్ మిన్ని వలంబురి పోల్   నిన్రదిందు తాళాదే శార్ఙ్ ముదైత్త శరమళై  పోల్ వాళ ఉలగనిల్ పెయిదిడాయ్ నాంగళుం మార్గళి నీరాడ మగిళిందు ఏలోరెంబావై.  ఓం నమో భగవతే వాసుదేవాయ నమః *****************************    కణ్ణా! - ఓ శ్రీకృష్ణా!    నాం-గలం-మా అందరికి-గోపికా సమూహమునకు,       మళిందు-మహోత్సాహముతో,    మార్గళి నీరాడ-భగవత్గుణ వైభవమను యమునలో స్నానము చేయుటకు      (దయతో)   పెయిదిడాయ్-వర్షములను కురిపించుము.    అవి తడి-పొడి చినుకులు-అర-కొర వానలు,నీ ఔదార్యమునకు భంగమును కలిగించేవి కాకూడదు.   కనుక నీవు త్రేతాయుగములో శ్రీరాముడు ఏ విధముగా, తన,   శార్ఞ్గం -విల్లును ఎక్కుపెట్టి (శత్రువులపై)   ఉదైత్త-గురిచూసి కురిపించిన,   శరైమళై-బాణ వర్షము వంటి,   కుండపోత వర్షములను కురిపించుము.     ...

ALO REMBAAVAI-03

Image
 మూడవ పాశురం *************** ఓంగి ఉలిగళంద ఉత్తమన్ పేర్పాడి నాంగళ్ నంబావైక్కుచ్చాత్తి నీరాడినాల్ తీంగిన్రి నాడెల్లాం తింగళ్ ముమ్మారి పెయిదు ఓంగు పెరుం శెన్నల్ ఊడు కయల్ ఉగళ్ పూంగువళై ప్పోదిల్ పొరివండు కణ్పడుప్ప తేంగాదే పుక్కిరుందు శీర్తములై పట్రి వాంగక్కుడం నిరక్కుం వళ్ళల్ పెరుం పశుక్కళ్ నీంగాద శెల్వం నిరైందు ఏలో రెంబావాయ్.   ఓం నమో భగవతే వాసుదేవాయ.   నంబావైక్కు-మనము వ్రతమును   చ్చాత్తి-చేద్దాము.    దేనిని ముగించిన తరువాత?     నీరాడినాల్-యమునలో స్నానము చేసిన తరువాత.   ఏ విధముగా నోమును చేద్దాము అంటే,   అళంద-కొలిచిన. దేనిని కొలిచిన?   ఉలగం-లోకములను, ఏ విధముగా?   ఓంగి-తనకు తానే తనరూపమును విస్తరించుకొనిన,   ఉత్తమన్-పరమాత్మను,   పేర్పాడి-నామ సంకీర్తనముచేస్తుంటే,   గోదమ్మ నవవిధ భక్తులలోని నామసంకీర్తన ప్రాశస్త్యమును మనకు తెలియచేస్తున్నది.త్రేతా యుగములో రాముని కన్న రామనామము అత్యంత మహిమాన్వితమైనదని చాటాడుగా.    అద్భుతములు ఆవిష్కరింపబడుతాయి అంటున్నది గోదమ్మ-గోపకాంతలతో.  మొదటిది-    తీంగిన్ర...