మూడవ పాశురం
***************
ఓంగి ఉలిగళంద ఉత్తమన్ పేర్పాడి
నాంగళ్ నంబావైక్కుచ్చాత్తి నీరాడినాల్
తీంగిన్రి నాడెల్లాం తింగళ్ ముమ్మారి పెయిదు
ఓంగు పెరుం శెన్నల్ ఊడు కయల్ ఉగళ్
పూంగువళై ప్పోదిల్ పొరివండు కణ్పడుప్ప
తేంగాదే పుక్కిరుందు శీర్తములై పట్రి
వాంగక్కుడం నిరక్కుం వళ్ళల్ పెరుం పశుక్కళ్
నీంగాద శెల్వం నిరైందు ఏలో రెంబావాయ్.
ఓం నమో భగవతే వాసుదేవాయ.
నంబావైక్కు-మనము వ్రతమును
చ్చాత్తి-చేద్దాము.
దేనిని ముగించిన తరువాత?
నీరాడినాల్-యమునలో స్నానము చేసిన తరువాత.
ఏ విధముగా నోమును చేద్దాము అంటే,
అళంద-కొలిచిన. దేనిని కొలిచిన?
ఉలగం-లోకములను, ఏ విధముగా?
ఓంగి-తనకు తానే తనరూపమును విస్తరించుకొనిన,
ఉత్తమన్-పరమాత్మను,
పేర్పాడి-నామ సంకీర్తనముచేస్తుంటే,
గోదమ్మ నవవిధ భక్తులలోని నామసంకీర్తన ప్రాశస్త్యమును మనకు తెలియచేస్తున్నది.త్రేతా యుగములో రాముని కన్న రామనామము అత్యంత మహిమాన్వితమైనదని చాటాడుగా.
అద్భుతములు ఆవిష్కరింపబడుతాయి అంటున్నది గోదమ్మ-గోపకాంతలతో.
మొదటిది-
తీంగిన్రి-దురితములు తొలగిపోతాయి/దుష్టత్వము వీడి పోతుంది.
అన్ని చోట్ల-
తింగళ్-నెలకు/మాసమునకు,
ముమ్మరిపెదు-మూడు వానలు కురుస్తాయి.
అప్పుడు,
ఓంగు పెరుం శెన్నల్-
పెరుం-పెద్దదైన/విశేషమైన,
ఓంగుశెన్నల్-పండిన పంట చేలు మనకు దర్శనమిస్తాయి.
విచిత్రం,
ఊడు-పంట చేల మధ్యలలో,
మళ్ళించిన నీటి ప్రవాహములలో,
కయిల్-చేపపిల్లలు,
ఉగళ్-కేరింతలు కొడుతు కనిపిస్తాయి.
రెండవది-
పూంగువళ్ళె ప్పోదిల్-
మధువును ఆస్వాదించుటకు పూలగుత్తుల మధ్యలో నున్న,
పొరివండు-ప్రకాశించుచున్న తుమ్మెదలు,
కణ్పడప్పల్-వీడలేక అక్కడే నిద్రిస్తుంటాయి.
మూడవది-
తీంగాదె పుక్కిరిందు-
స్థిరమైన గోశాలయందున్న గోవులు,
శీర్తములై పట్రి
చేపుకొని పాలతో నిండియున్న శిరములతో,
వాంగక్కడం-పాలు పితుకు కడవలను (తమకు తామే)
నిరైక్కుం-పాలతో నింపుతాయి.
ఎందుకంటే-అవి
పెరు పశుక్కళ్-ఉన్నతమైన/శ్రేష్ఠమైన గోవులు.
గో శబ్దమునకు వేదములు అని కూడ భావిస్తారు.కనుక గోకులము-గోశాల-గోక్షీరము-గోవిందుడు-గోపికలు-గోదమ్మ సర్వము వేదమయమే-నాదమయమే-మోదమయమే.
అవి పాలను కడవలలో ఎలా వర్షిస్తాయంటే,
వల్లాల్-అతిశయించిన ఉదారతతో,
తరగని సంపదలనుగ్రహించు స్వామి కరుణను గోపికలకు చెబుతున్న గోదమ్మ ,
ఈ పాశురములో ఆచార్యులను తమ శిష్యుల జ్ఞానసమృధ్ధి అను పుష్కలమైన పంటచేలను చూసి వాటి మధ్యలో ప్రవహించు (తమ హృదయ సంతోషములో) జలములలో ఎగురుచున్న చేప పిల్లలతో పోల్చి,మత్స్యావతారమును మర్మగర్భముగా కీర్తించినది.
స్వామి నామ సంకీర్తనమను ఝంకారముతో స్వామి దివ్యమంగళస్వరూపానుభూతిని వీడలేక ఉన్న తుమ్మెదలుగాను ప్రస్తుతించినది.
పెరు పశుక్కళ్ అంటు స్థితి కర్తను -మనకు అందించుచున్న అవ్యాజ కరుణ అను క్షీరమును ప్రస్తావించినది.
ప్రకృతిని పరమాత్మ స్వరూపముగా గుర్తించి సేవించుటయే సౌభాగ్యము.
త్రివిక్రముడు వామన మూర్తిగామూడు అడుగులతో ముక్తిప్రదాత అయినాడు.
గోకులములో మూడు వరములను అనుగ్రహించుటకు ముక్కుపచ్చలారని ముద్దుకృష్ణుడై మనలను మురిపిస్తున్నాడు.
అవి-
1-తారకము-అనగా అన్నము.
అహమన్నం-అహమన్నం
అహమన్నాద-అహమన్నాద.
ఇక్కడ గోవును-గోక్షీరము-దానిని గ్రహించువాడును పరమాత్మయే.
2.భోగ్యము-పాలు-నెయ్యి.
పాలతో ప్రారంభమై నెయ్యిగా మారువరకు జరుగు మార్పులు,
మనము ఐహికముతో ప్రారంభించి ఆధ్యాత్మికమునకు చేరు గమ్యము.
అంటే సంసారము సంస్కారముగా పరిణమించుట.
3.-పోషకము-అనగా అనుగ్రహఫలమైన తాంబూలము. ఆ పరమాత్మ కటాక్షమును అందుకొనగలుగుట.
వాటిని అందుకొనుటకు మనము అమ్మ చేతిని పట్టుకుని అడుగులను కదుపుదాము.
ఆండాళ్ తిరువడిగళే శరణం.
No comments:
Post a Comment