తనోతు నః శివః శివం-12
*****************
" వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే
జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ"
'సర్వంబు తానుగా శర్వుడాడెను నేడు
నృత్యంకర! ప్రమథ గణ కింకర"
నః-మా అందరికి
మహా కపాలి-విశ్వనకు శీర్షము వంటి (సహస్రశీర్షా పురుషః)
అస్తు సంపదే-సంపదలను అనుగ్రహించును గాక.
ప్రస్తుత స్తోత్రములో స్వామి మన్మథుని భక్షించి వెన్నెలల ద్వారా జగములను రక్షించుచున్నాడట.అంటే ధర్మ సంస్థాపనమును తన తాందవము ద్వారా/నిలింప తాందవము ద్వారా అమలుచేస్తున్నాడట.
పాహి పరమేశ్వరా-పాహిజగదీశ్వరా
ఇన్నిలోకములన్ని ఒకటియై (నీ) కన్ను చూపించు
" ఓ ఆది భిక్షు! ఓ జగత్చక్షు"
చరణము
******
" లలాట చత్వర జ్వలద్ధనంజయ స్ఫులింగ భా
నిపీత పంచసాయకాం నమన్నిలింప నాయకం
సుధామయూఖ లేఖయా విరాజమాన శేఖరం
మహాకపాలి సంపదే శిరోజటాలమస్తు నః."
1.లలాట చత్వర జ్వలత్ ధనంజయ స్ఫులింగ భా
స్వామి లలాటము అనేయజ్ఞ వేదిక -భా-ప్రకాశిస్తున్నది.
స్ఫు-లింగ---లింగ సంకేతముగా నున్నది.
స్ఫులిత్-దివ్యతేజమునకు సంకేతముగా స్వామి ఫాలభాగము జ్వలిస్తున్నది.
ఆ జ్వాలలు
2.నిపీత పంచసాయకం నమః నిలింప నాయకం
నిరుపమాన నాయకుడా నీకు నమస్కారములు.
నీవు పంచబాణుని/పంచబాణములను ఆహుతులుగా స్వీకరిస్తూ
నిపీత త్రాగుతూ-నీనుదుటిని జ్వలింపచేస్తున్నావు.
మన్మథ బాణములు తెల్లకలువ-నల్లకలువ-చంపకము-అశోకము-మామిడి అని భావిస్తారు.ఇవి సున్నితముగాకనిపిస్తూనే జగములను చింతాక్రాంతము చేస్తాయి.తల్లడిల్లునట్లు /తాపమునకు గురిచేస్తాయి.స్వామి తన జ్ఞాన నేత్రము ద్వారా వాటిని హరించి వేసాదట.
అయ్యో పూవులను దహించిన వానికి భక్తులు నమస్కరిస్తున్నారు.
మరీవిడ్డూరం అనుకుంటే పొరబాటే.
అవి పంచేంద్రియములకు సంకేతము.మనకు తెలియకుండానే మనము వాటికి వశమై మతి గతి తప్పుతాము కనుక మహాదేవుడు వాటిని మాయము చేస్తున్నాడు తన తాందవముతో.
" ప్రతి సంజె యందు తాందవ మాడ రుద్రుండు
గతి తప్పకను సర్వ బ్రహ్మాండములు నిలుచూ
అదీసంగతి.
"లయ తప్పెనా భువికి లయమప్పుడె తోచు
లయ తప్పెన గిరికి భయమప్పుడె పాకు"
ఓ జగత్ పరిపాల! ఓ మహాకాళ
పాహి పరమేశ్వరా! పాహి జగదీశ్వరా.
ఎటు చూసిన అగ్నిజ్వాలలు.పునీతుడైన మన్మథుడు
జగములన్నింటితో పాటుగా తాను కూడా చల్లబడుతున్నాడు ఏ విధముగా నంటే,
3.సుధామయూఖలేఖయా విరాజమాన శేఖరం( కరుణతో)
అగ్నిసోమాత్మకము కదా ఆదిదేవుని తత్త్వము.
అగ్ని తాపమును తొలగించుటకు సోముడు ఏం చేస్తున్నాడంటే,
' కైలాసగిరి మహాకర ముద్రికలు తగిలి
వెన్నెలలు భ్రమసిపడి అమృతము కురిసినవి" (అజ్ఞాత కవి-ఆకాశవాణి గీతము)
అగ్నినేత్రము తన పనిని పూర్తిచేసుకుని యథాస్థానమును చేరినది.అదే అదనుగాస్వామి జటలలోనున్న చంద్ర రేఖ/చంద్రలేఖ సుధా-మయూఖములను అమృతకిరణములను వర్షించసాగినది శివునికరుణగా.
4 మహాకపాలి సంపదే శిరోజటాలం అస్తు నః.
అనంతశీర్షుడు/మహాకపాలి/మూర్తీభవించిన జ్ఞానము,నః-మనందరిపై,సంపదే-సంపదలను అనుగ్రహించును గాక.
పరమేశ్వర తాండవము-ప్రపంచ తారణము.
మాయామోహసాగరము నుండి మనలను దరిచేర్చుచున్న నావ.
విశేషము
**********
యావత్ భారతదేశము ఈ పవిత్ర సన్నివేశమునే "హోళికా సంహారము 'కామ దహనము" "కాముని పున్నమి అనే పేర్లతో ఉత్సవముగా జరుపుకుంటుంది ప్రతిఫాల్గుణ పూర్ణిమ పవిత్ర తిథి యందు.
కదిలేది ప్రపంచము-కదలనిది పరమాత్మ
శివ భజమేవనిరంతరం.
ఏక బిల్వం శివార్పణం.