Friday, October 11, 2024

SREECHAKRADHAARINI-09-SARVANAMDAMAYACHAKRAMU




 


   శ్రీచక్రధారిణి-09-సవానందమయచక్రము

   ****************************

 ప్రార్థన

 ******

 "తాదృశం ఖడ్గమాప్నోతి ఏనహస్త స్థితేనవై

  అష్టాదశ మహాద్వీప సమ్రాడ్భోక్తా భవిష్యతి."

 

  ఇప్పటివరకు

  ********

శూన్యము అని భ్రమింపచేసే బిందువుశూన్యముకాదు "పూర్ణము" అని తెలియచేస్తున్న శివశక్తుల నిక్షిప్త "మిశ్రబిందువునకు" శరణాగతులు.

  ఆదిశంకరులు "సౌందర్యలహరి స్తోత్రము" లో కీర్తించినట్లు,

       సకలమపి భిత్వా కులపథం

 "సహస్రారే పద్మే సహరసి పత్యా విహరసే"

  అని ప్రాణశక్తి యైన కుండలినీ ఊర్థ్వ పయనమును స్తుతించారు.

    జగన్మాత

 కులామృతై రసికా కులసంకేత పాలిని

 కులాంగనా కులాంతస్థా కౌళినీ కులయోగినీ

 అకులా సమయాంతస్థా.....సమయాచారతత్త్పరా.

    అని వశిన్యాదిదేవతలకు తన తత్త్వమును అనుగ్రహించినది.

      అమ్మ సదాశివ పతివ్రత.

  సదాశివుని పతిగా పొంది సేవించునది ఒక భవముగా స్వీకరిస్తే

  సదా ఎల్లవేళల సకలజీవుల ఉద్ధరనమే వ్రతముగా/నియమముగా అనుసరించు ఆదిశక్తి.

   ఆ వ్రతమే బిందువు నుండి విడివడి కామకళయై స్థూలప్రకృతిలోఅంతర్యామిగా దాగి,తనలో తనపతిని సూక్ష్మముగా దాచుకొనిచేతనులనూద్ధరిస్తూ,కుండలినిగా తనతో పాటుగా షత్చక్ర దర్శనమును చేయిస్తూ,నిరాకార-నిర్గుణ నిరంజనమైన నిత్యసంపూర్ణ తత్త్వములోనిక్షిప్తము చేసుకుంటుంది.

 ఇప్పుడు

 ****

  పరమేశ్వరుడు పార్వతీదేవితో,

  

 " త్రికోణం సర్వసంభూతి కారణం భూతిదం సదా

   బిందిచక్రం వరారోహే "సర్వానమ్మయం' పరం

   "సదాశివమయం" చక్రనాయకం  పరమేశ్వరి".

   శ్రీచక్ర మధ్యకర్ణికలో నున్న త్రికోణము సర్వమునూత్పత్తిచేయగల సామర్థ్యశక్తి.దీనినే "సర్వ సంభూతి చక్రము"అనికూడా కీర్తిస్తారు.ఈశ్వరత్వమును సిద్ధింపచేయునది. సదాశివునితో మమేకము కాగలుగుటయే ఈశ్వరత్వము.మమేకముచేయగల శక్తియే సౌందర్యము.

    మమేకస్థితి సదాశివతత్త్వము.శాశ్వత సర్వానందమయము.

  పర-అపర నయిక పరాపర రహస్యయోగిని గా అమ్మ విరాజమానమైనది.చక్రేశ్వరి మహాకామేశ్వరీదేవి.Yఓని/మూలకారనము ముద్రాశక్తి.షడంగదేవతార్చనము షడంగన్యాదముతో జరుపుకొను ప్రదేశము.

 అంటే సాధకుడు తనలోనే ఉన్న ఆత్మానంద పరంజ్యోతిని షోడశీ మంత్రానుష్ఠానముతో ,

 సత్యం-శివం-సుందరమును/సచ్చిదానంద స్వరూపిణిని పరమహంసయై ,

   హంస హంసాయ విద్మహే-పరమహంసాయధీమహి

   తన్నోహంసః ప్రచోదయాత్" గా పరిణితిని పొందుతాడు.


    సర్వం కామేశ్వర-కామేశ్వరి చరణారవిందార్పణమస్తు.

  మనముచ్చట

  **********

 అమ్మ నవావరణముల ప్రహసనములు మన భాషలో చెప్పుకోవాలంటే.

  మనమందరము కష్టాల జడివానలో సతమవుతున్నజీవులము.అమ్మ దయ అనే గొడుగును తెరిచి,విస్తరింపచేసి మనము ఆవానలో కొట్టుకునిపోకుండా తాను దగ్గర ఉండి సురక్షిత ప్రదేశమునకు చేరుస్తుంది.వానవెలిసిపోయింది.అమ్మ తన స్థూల విస్తరనానే గొడుగును మడచివేస్తుంది.పరమేశ్వరునికూడి ,

 "'జగతం పితరం వందే పార్వతీ పరమేశ్వరమై"

       పరవశిస్తుంటుంది.

 పరవశిస్తుంటుంది-పరిపాలిస్తుంటుంది

 పరిపాలిస్తుంటుంది-పరవశిస్తుంటుంది

  ప్రతీణువు తానై-ప్రతిక్షనముతానై.


 "పాహి-పాహి పరాత్పరి-పాలయమాం-పరిపాలయమాం"

  ప్రియమిత్రులారా,

    నా ఈ దుస్సాహసమును మన్నించి జగదంబ మనలనందరిని కంటికిరెప్పవలె కాచునుకాగ,

   కాత్యానాయవిద్మహే కన్యకుమారి ధీమహి

   తన్నోః దుర్గి ప్రచోదయాత్

  స్తోత్రం -స్తోత్రఫలము రెండును అమ్మనే.


     "అపరాధములను మన్నించవమ్మా

      ఆదిదేవి అమరసేవిత-నా

      అపరాధములను మన్నించవమ్మా."


  అమ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే.

  లోకాసమస్తాత్ సుఖినో భవంతు.

     

   "త్రిలోచన     కుటుంబినీం   -త్రిపురసుందరీం  ఆశ్రయేత్. 


             

     స్వస్తి.

     


No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...