శ్రీచక్రధారిణి-08-సర్వసిద్ధిప్రద చక్రము
**************************
ప్రార్థన
*********
"తాదృశం ఖడ్గమాప్నోతి యేనహస్త స్థితేనవై
అష్టాదశ మహాద్వీప సమ్రాడ్భోక్తా భవిష్యతి."
ఇప్పటివరకు
***********
ఏదవ ఆవరణమైన "సర్వరోగహర చక్రము" లోని అష్టవిధ తత్త్వములను తెలుసుకుంటూ,అత్యంత ప్రధానమైన స+అష్ట+ అంగ నమస్కార (అష్టాంగములు పరమాత్మ చైతన్యమే అను భావన) పరమార్థమును గ్రహించాము,
మనము సులభముగా శ్రీచక్ర తత్త్వమును అర్థము చేసికొనుటకు రెండు భాగములుగా విభజించి పరిశీలిస్తే మనము మొదటి భాగమును పూర్తిచేసుకున్నాము.
ఏడు ఆవరణములలోత్రిగుణములు-అరిషడ్వర్గములు-చతుర్విధ పురుషార్థములు-అనేకానేకములై,అనేకనామరూపములతో-స్వభావములతోనున్న యోగినీ మాతలు-వారిని పాలిస్తున్న చక్రేశ్వరులు-ముద్రా శక్తులు-సిద్ధి దేవతలతో విస్తరించిసాగినది.ప్రతి ఆవరణము ఇంకొక దానితో సంబంధమును కలిగియున్నది.
ఇప్పుడు
*****
ఎనిమిదవ ఆవరణములోని త్రికోణము.సర్వ స్వతంత్రము.ఇక్కడ అన్నిసంక్షిప్తముగాఉంటాయి"
.కామకళ"
శివశక్తుల స్వరూపమైన పూర్ణబిందువు నుండి విడివడిన శక్తిస్వరూపము " కామకళ" అను నామముతో ఆశ్చర్యముగా జరుగుతున్న మార్పులను చూస్తున్నదట.ఆ మార్పుల /విస్తరణ వలయములే శ్రీచక్ర నవ+ఆవరనములుగా కీర్తింపబడుతున్నాయి.
పరమేశ్వరుడు పార్వతీదేవితో,
"ఉద్యత్ సూర్య సమప్రభం బంధూక కుసుమ ప్రభః
దర్వసిద్ధిప్రదం చక్రం సకలాలయం ఈశ్వరీ"
ఓ ఈశ్వరీ ఇది సర్వసిద్ధులను కలిగించే మండలము.
మూడు బిందువులనుకలుపుతూ త్రికోణము ఉంటుంది.తిర్కోణముతో పాటుగా ఊహా చతురస్రాకారము నాలుగు ఆయుధములతో ఉంటుంది.
చక్రేశ్వరి త్రిపురాంబ.
అతిరహస్యయోగినులుంటారు.సర్వబీజ ముద్రాశక్తి.
మనము చక్రమహత్వమును గ్రహించుటకు మూడు అంశములను పరిశీలిద్దాము.
1.ఊహాచతురస్రములోని ఆయుధములు
2.త్రికోణములోని బిందువులు
3.అతిరహస్య యోగినులు.
ఈ ఆవరనము నిధిధ్యాసనము ను వివరిస్తుంది.గురువు ద్వారా వినినదానిని-తర్కము ద్వారా స్థిరపరచుకొనిన దానిని-మరలమరల అన్వయించుకుంటూ అజ్ఞానమును పారద్రోలగలుగుట నిధిధ్యాసనము.
ఏనిమిదవ ఆవరనము జగన్మాత విస్తరణ ప్రధమదశ.
ఇక్కడ ద్వైతములుండవు.అంతా ఒక్కటిగానే భాసిస్తుంటుంది.నీవు అన్న ఊహ రానేరాదు.
ఆవరనములోనీకి ప్రవేశిస్తున్న సమయమున "ప్రణవము" నన్ను పరవశునిచేస్తున్నది.అవ్యక్తమైన ఆనందానుభూతి.
నా పాపిడిలో కదలికలు ప్రారంభమయినాయి.
నా కుడిచేయి బరువుగా అనిపించింది.కిందకు చూస్తుండగానే బాణిని మాత చాపిని మాతకు నా ఎడమచేతి దగ్గరకు రమ్మని సైగచేస్తున్నది.ఇంతలో నా ఎడమచేతిలో చాపిని మాత కూర్చుని ఉంది.కుడిచేతిలో బాణినిమాత-ఎడమచేతిలో చాపిని మాత.
నమ్మసక్యము కానివిధముగా తల్లులు పంచబానములుగా-వింటిగా నన్నుచేరారు.
అది సామాన్యమైఇన విల్లుకాదు.అటు-ఇటు కదలనిస్థిరచిత్తము .దానికి అనుగుణముగా పంచతన్మాత్రలు కుడిచేతిలోని బాణములుగా ప్రకాశిస్తున్నాయి.
నా కన్ను పరమాత్మను చూదగలదు.
నాజిహ్వ సంకీర్తనము చేయకలదు.
నాకర్ణము మహిమలనువినగలదు.
నాస్పర్శ పరమాత్మ ఉనికిని గమనించగలదు.
నానాసిక పరమాత్మతత్త్వమను పరిమళమును ఆఘ్రాణించగలదు.
అంతలోనే "పాశిని"మాత లాలనగానన్నుహత్తుకుని ప్రేమ అనే తాళ్లతో నన్నుచుట్టుతున్నది.
అనిర్వచనీయ ఆనందము నా నయనముల ద్వారా స్రవిస్తూ,వారిపాదములను అభిషేకిస్తున్నది.
ఇంతలో కిందకు వేలాడుతున్న (ఏడు చక్రముల వైపునకు) నన్ను ఆకర్షింది.కొంచము వంగి పట్టుకోబోయాను.అంతే,
అంకుశిని మాత కోపముతో దానిని తుంచివేసింది.
నామనస్సుస్థిమితబడినది.అమ్మకు నమస్కరించాను.నవ్వేసింది.
ఆ నలుగురుమాతలు నన్ను మూడుబిందువులున్న "త్రికోణము" లోనికిప్రవేశింపచేశారు.
2.త్రికోణములోని బిందువులు.
******************
అవి బిందువులు కావు.కరుణాసింధువులు.
"క్రీడంతు సర్వభూతానాం"/లీలా కల్పిత బ్రహ్మాండములను ప్రకటించుతకై ఏర్పరచుకొన్న,
ఇచ్చా-క్రియా-జ్ఞానశక్తులు.
మహా కామేశ్వరి-మహా వజ్రేశ్వరి-మహా భగమాలిని అని గౌణనామములతో కీర్తింపబడతారు వీరు.
స్థూల చక్రములలోని కామేశ్వరి కంటెభిన్నమైన శక్తి మహాకామేశ్వరి.ఈమె సృష్టి కారిణి.
స్థూలములోని వైష్ణవీ కంటె భిన్నమైనది మహా వజ్రేశ్వరి.స్థితి కారిణి.
స్థూలములోని భానుమండల మధ్యస్థ కంటె భిన్నమైన శక్తి మహా భగమాలిని.సంహారకారిణి.
ఈ మూడు శక్తులు పశ్యంతీ-మధ్యమ-వైఖరీ స్వరూపాలుగా కూడా సమన్వయించుకుంటారు.
ఆమహాశక్తులు నాలోనిచైతన్యమునూద్దీపింపచేస్తున్నాయి.
అతిరహస్యమైన అంతర్లీనమును అనుభవములోనికితెస్తున్నాయి.
3.అతిరహస్యయోగిములు
*************
ఎంతటి పరమాధుతము ఈ అంతర్లీనము.
నేను చూస్తుందగానే,
1.పృథ్వీ తత్త్వము జలతత్త్వముతో లీనమగుచున్నది
2.పృథ్వీ+జల తత్త్వములు అగ్నితత్త్వముతో లీనమగుచున్నాయి.
3.పృథ్వీ+జల+అగ్ని తత్త్వములు వాయుతత్త్వములో లీనమగుచున్నాయి.
4.పృథ్వీ+జల+అగ్ని+వాయు తత్తములు ఆకాశ తత్త్వములో లీనమై
అఖండముగా భాసించుచున్నది.
ఏకంసత్.
పంచభూతములు మాత్రమే కాదు
ఆవరనలు సైతము అదే పనిని ప్రారంభించాయి.
1.త్రైలోక్యమోహనము సర్వాశా పరిపూరకము తో కలిసిపోయింది.ఆ రెండు సంక్షోభణమునుచేరాయి.సృష్టి చక్రత్రయమును స్త్థితిచక్ర త్రయము తనలో లీనముచేసుకుంది.రెండు త్రయ చక్రములోఏడవచక్రమైన సర్వరోగహరమును చేరాయి.దానిని కలుపుకుని సర్వసిద్ధిప్రదచక్రములో అంతర్లీనముగా అలరారుతున్నాయి.
ఏకంసత్.
త్రిగుణములు లేవు
చతుర్వర్గములు లేవు
పంచభూతములు లేవు
అరిషడ్వర్గములులేవు
సప్తధాతువులు లేవు
అష్టదిక్కులు లేవు
ఏకం సత్
ప్రకట యోగినులజట్టు గుప్తయోగినులతో
వారిరువురి జట్టు గుప్తతర యోగినులతో
వారుముగ్గురిజట్టు సంప్రదాయ యోగినులతో
వారు నలుగురి జట్టు కులోత్తీర్ణ యోగినులతో
వారు ఐదుగురిజట్టు నిగర్భయోగినులతో
వారు ఆరుగురి జట్టు రహస్య యోగినులతో
వారు ఏడుగురి జట్టు అతిరహస్య యోగినులతో,
ఎప్పుడు ఎలా తెలియంత అతిరహస్యముగా
"ఏకం సత్" గాభాసిస్తున్నరు.
నేను అన్న శబ్దము-రూపము-ఉపాధి-ఉనికి పూర్తిగా సమసిపోతున్నాయి.శివశక్తైరూపమును దర్శించాలన్న తపనతో నున్న నన్ను అతిరహస్య యోగినులు అత్యంత రహస్యముగా నవనవోన్మేష నవావరనము లోనికి ప్రవేశింపచేబోతున్నారు.
యాదేవి సర్వభూతేషు దయారూపేణ సంస్థితా
నమస్తస్త్యై నంస్తస్త్యై నంస్తస్త్యైనమోనమః.
సర్వము కామేశ్వర-కామేశ్వరి చరణారవిందార్పణమస్తు.
No comments:
Post a Comment