Posts

0006

Image
  ధ్యాయేత్ ఈప్సిత సిధ్ధయేత్-06 *********************** మనసంతా ఒకటే గందరగోళం.మనము చూసేదేది నిజమైనది -శాశ్వతమైనది కాదా? శాశ్వతమైనది సులభముగా మనము దర్శించలేమా? లోపల బయట తానే యున్నదంటున్నారు కొందరు "జగమెవ్వని లోపలనుండు "అంటు. అంటే ఈ దృశ్యప్రపంచము ఎవరో మనకు తెలియని వాని లోపలఉందా? లోపల కనుక ఉంటే మనలను బయటనే ఉన్నట్లు ఎలా భ్రమింపచేస్తున్నది. ఇది భ్రమ తత్త్వమా? బ్రహ్మాండ తత్త్వమా? ఒక సందేహమునకు తోడుగా మరొక సందేహమును జతకలుపుకొనుటకా అన్నట్లు, పనులన్నీ చేసుకొని కాసేపు కాలక్షేపం కోసము చర్చావేదికను చూచుటకు టి.వి ముందు కూర్చున్నాను. కార్యక్రమము ప్రారంభమైనది.చర్చకు ఇరువర్గముల వారు అభిముఖముగా అసీనులైనారు.ఆసనముపై న్యాయనిర్ణేత వారిని గమనిస్తున్నారు. సహకారపరికరములుగా కొన్ని వస్తువులను ప్రవేశపెడుతూ చర్చా కార్యక్రమమును ప్రారంభింపచేసారు. వారిద్దరి మధ్యన రంగురంగు గులాబీలతో, అలంకరింపబడిన పుష్పగుచ్చమును ఉంచారు.గులాబీలలో కొన్ని ఎర్రవి.కొన్ని పసుపుపచ్చవి.కొన్ని తెల్లనివి.మరికొన్ని గులాబీ రంగువి.ఎన్నోరంగులతో మరెన్నో హంగులతో పరిమాళాలు వెదజల్లుతు అక్కడున్న వారిని పరవశింపచేస్తున్నాయి.ఏమా ...

0005

Image
   ధ్యాయేత్  ఈప్సిత సిధ్ధయేత్-05  ******************************  పార్కులో నేను-నా స్నేహితురాలు-వాళ్ల అమ్మగారు బెంచీమీద కూర్చుని ఉన్నాము.   బయట జనించిన సందేహము లోనికి పోయి పరిష్కారమును చూపనంటుంది.లోపలనున్న చైతన్యము బయటకు వచ్చి (నన్ను )సమాధానపరచుటకు రానంటున్నది.     హెచ్చుతగ్గుల ఇంద్రియముల గారడీల గురించి పెద్దవారు-అనుభవజ్ఞులైన ఆంటీని అడిగి నన్ను నేను సమాధానపరచుకుందా మనుకుంటు,    మౌనాన్ని భంగము చేస్తు మనసు విప్పేసాను.      ఫక్కున నవ్వింది  నా స్నేగితురాలు.పురాతన భావముల నా చెలి దర్శనశక్తి-శ్రవణ సక్తి అంటు చొప్పదంటు ప్రశ్నలను చొప్పిస్తు,నువ్వు తికమకపడుతు అమ్మను తికమక పడుతున్నావు అంది పరిహాసముగా.   ముమ్మాటికి నమ్మనుగాక నమ్మను.   దర్శనశక్తి-అన్న నీ ప్రశ్నకు సమాధానమును కెమెరా అను వస్తువుతో ఎప్పుడో సృష్టించబడినది.అది దృశ్యమును చూస్తుంది తన తెరపై బంధించి ఉంచుతుంది.అదియును నీవు కోరుకొన్న విధానములో.    శబ్దశక్తి అంటావా తేప్ రికార్డర్.నువ్వు చెప్పిన శబ్దమును వింటుంది.తనలో భద్రపరచుకుంటుంది.   ఎ.సి-హీటర్ అన...

0004

Image
    ధ్యాయేత్ ఈప్సిత సిధ్ధయేత్-04 ******************************  ఆలోచనలలో మునిగియున్న నన్ను మరొక సందేహము ముందర నిలిచి,సతమతము చేస్తున్నది నా దినచర్యను ఒక సిధ్ధాంతముగా మారుస్తు.  వాటి సంగతి సరే.మరి నా సంగతి ఏమిటి? నిన్న రాళ్ళ ఉప్పు పట్టుకుని వస్తున్నప్పుడు నా ఇంద్రియములైన కళ్ళు-స్పర్శ దానిని ఉప్పుగా గుర్తించి నాకు చెప్పినవి.   మిగిలిన మూడు ఇంద్రియములు తటస్థముగా నునాయి.   అదే ఉప్పును నేను నీళ్ళగిన్నెలో వేసి  పది నిమ్షములు చిన్నపని చేసుకుని వచ్చాను.   ఈ మధ్య మతిమరుపు మరీ ఎక్కువైపోతున్నది నాకు.ఇంతకీ ఉప్పును నీళ్ళగిన్నెలోవేసానా/లేదా? ఎలా తెలుస్తుంది నాకు?      నాకు సహాయపడిన కళ్ళు-స్పర్శ నే తిరిగి సహాయమడుగుతాను అంటు......   కాని విచిత్రము.అవి నిస్సహాయములుగా మారినవి.    నా కళ్ళు ఉప్పును చూడలేమంటున్నవి.నా స్పర్శ కూడా ఆ నీళ్ళలో ఉప్పు ఉన్నదో/లేదో తాను చెప్పలేనంటున్నది.     మరొక విచిత్రము.ఇవి చేయలేని పనిని మరొక ఇంద్రియము తాను చేసిపెడతానన్నది.అదే  అదే..  గమ్మత్తుగ..     నా జిహ్వ నేను చెప్పగలను అం...

0003

Image
    ధ్యాయేత్ ఈప్సిత సిధ్ధయేత్-03  ***************************  నన్ను వెంటాడుతు,నాతో ఆడుకుంటున్న ఆలోచనలను అర్థము చేసుకోవడము ఎలా?  పూలలోనికి రంగులు ఎందుకు/ఎలా వస్తున్నాయి? వచ్చినవి నిలవకుండ ఎందుకు వాడిపోతున్నాయి?   పూలకే కాదు పండ్లకు-సకలమునకు రంగురూపులను అందిస్తూ,వాటిని కొనసాగనీయకుండా హరించివేస్తున్నది ఎవరు?   మన శరీరాకృతిలో మార్పులను తెప్పిస్తున్నది ఎవరు? మనలను పక్కకు దొర్లునటుల పారాడునటుల,లేచి నిలబడునటుల, తప్పటడుగులు వేస్తూ,కింద పడుతు లేస్తూ నడుచునట్లు చేస్తున్నది ఎవరు? ఏడుపు ఒక్కటే చేతనైన మన గొంతు అనేక శబ్దములతో పాటు,ఎన్నెన్నో భాషలను  ధారాళముగా ఎలా మాట్లాడగలుగుతున్నది.ప్రతి అవయవము అవసరమైనప్పుడు మాత్రమే దానిలోనికి శక్తినెలా తెచ్చుకుంటున్నది.ఏమిటి ఈ మాయాజాలము?      పసికందుగా కదలలేని కాళ్ళు-అవయములు (కొందరిలో మాత్రమే) అద్భుత నాట్య భంగిమలను ప్రదర్శింపకలుగుతున్నవి.కాని కొంతకాలము మాత్రమే. గట్టిగా వస్తువును పట్టుకోలేని చేతులు పెద్ద పెద్ద బరువులను ఎత్తుతు బహుళజనాదరణను పొందుతు ప్రస్తుతింపబడుతున్నవి.అద్భుత చిత్రలేఖనమును,శి...

0002

    ధ్యాయేత్ ఈప్సిత సిధ్ధయేత్-02  ****************************   అలా ఆలోచనలతో తోటలోకి అడుగులు కదిపానో లేదో నా దృష్టి నిన్న నన్ను స్వాగతించిన గులాబీల మీద పడింది.  అంతే వేగముగా నన్ను అంతర్మథనములోనికి తోసివేసింది.   మొన్నటి రోజున అవి మొగ్గలు.అంతకు ముందు అవి చెట్టు లోపల ఎక్కడ దాగి ఉన్నాయో,వాటికి,వానిని దాచుకున్న ఆ గులాబీ మొక్కకే తెలియాలి.    నిన్న అరవిచ్చిన రేకులతో,విరబూసిన సోకులతో,రంగుల హంగును సింగారించుకొని,మురిసిపోతు విరిసినాయి.  ఎంతటి ఆకర్షణీయము వాటి సౌందర్యము.  ఎంతటి ఆఘ్రాణనీయము వాటి పరిమళము.   ఒకేసారి తమ పరిపూర్ణతతో కన్నులను,పరిమళముతో మనసును ఆస్వాదించమంటు ఆహ్లాదపరిచాయి.  ఇంతలోనే ఎంతమార్పు?    రేకులతో పాటు సోకులు నేలరాలినవి.  ఎక్కడికి పోయినది వాటి  నామరూప గుణ వైభవము?  ప్రత్యేకతలైన రంగు-రూపు-పరిమళములతో కూడిన ఆకర్షణ?  మార్పుకు కారణమైన కూర్పును చేసినదెవరు?    వాటి అవస్థలను బట్టి లేత మొగ్గ,మొగ్గ,విసనమునకు సిధ్ధముగా నున్న మొగ్గ,అరవిరిసిన పువ్వు,వాడిన పువ్వు,నేలరాలిన పువ్వు గా నిర్మించి,న...

0001

Image
     ధ్యాయేత్  ఈప్సిత సిధ్ధయేత్-01    *******************************  హోరెత్తిన సముద్రపు అలల వలె అరసెకను ఆగకుండా,నాలో  ఆలోచనలు జోరు మీద ఉన్నాయి.   నన్ను నేను చూసుకుంటుంటే దూసుకుని వస్తున్నాయి.  ఎంత విచిత్రము ఈ మానవ ఉపాధి?ఉపాధి.   ఒక బొట్టుగా తల్లిగర్భము లోనికి పవేశించి,బుడగగా మారి,ఎన్నో సంఘర్షణలను ఎదురుకుంటూ,క్రమక్రమముగా ఒక ఉపాధిని(రూపును) సంతరించుకుని,ఒకేఒక శబ్దమును (ఏడుపును) మాత్రము తనతో వెంటబెట్టుకుని వస్తుంది ఏదో సాధించేయాలని,ఎందరో తనను మెచ్చుకోవాలని ఎలా సాధించాలో ఏ కోశానలేని ఆశలరాశియై.   వెన్నెముక అడ్దముగానే ఉండి,తాను నిలబడలేదు.పొరలతో కప్పియున్న కనులు వేనిని సరిగా చూడలేవు.మలమూత్ర విసర్జనలలోనే కదలలేక-మెదలలేక  మలినపడుతు-మథనపడుతూ.అసహ్యమైనా-అసహనమైనా.   ఏమి చూసుకొని దానికంత ఉత్సాహము?    అమ్మను పిలవాలన్నా-అనుకున్నవి చేయాలన్నా దానికున్న ఒకేఒక ఆయుధము-ఆసరా ఏడుపు ఒక్కటే.      గమ్మత్తు.దీనిపై ఎవరు ఎపుడు ఏ మంత్రము వేస్తారో కాని,ఇంద్రియములతో సందడి మొదలు పెడుతుంది మెల్లమెల్లగా.    పొరలు వీడి...

DHYAAYAET IPSITA SIDHDHAYAET-10

Image
    ధ్యాయేత్  ఈప్సిత సిధ్ధయేత్-10   ********************************   సర్వము తానెయైన వానిని దర్శిస్తూ,  బ్రహ్మమొక్కటే-పరబ్రహ్మమొక్కటే" అనిసంకీర్తిస్తీ,బ్రహ్మానందములో మునిగిపోయాడు ఆ అన్నమయ్య పాత్రధారి.     బహిర్ముఖమగుటకు ఇష్టపడుటలేదు.  మూలకారణంబిది  అని సన్నగా సన్నగా గొణుగుతున్నాడు.ఆది అనాది మధ్యయు కూద ఇదియే అంటున్నాడు.  మీరు అంటున్న ఇది-ఏది స్వామి అని ప్రశ్నిస్తూ అతనిని బహిర్ముఖుని చేసారు ఎదుటనున్న వారు.    బ్రహ్మము-దానిని కనుగొనినప్పుడు కలిగే బ్రహ్మానందము అని చెమర్చిన కన్నులతో బదులిచ్చాడు వారికి.   బహుళానందులను మించినదా ఆ బ్రహ్మానందము? సందేహము సందడి చేసినది అక్కడ.   అసలు బహుళానందములు అంటే అడగటం అతని వంతయింది.    అంటేఎన్నో విధములుగా-ఎన్నో పర్యాయములు ఎన్నో ప్రదేశములలో,ఎన్నో నామరూపగుణములతో విసుగు చెందక మనలను ఆనందపరిచేది అత్యుత్సాహముతో వచ్చింది సమాధానము.   సమాధానముగా చిరునవ్వు తొ అన్నమయ్యపాత్ర నుండి తన ఆహార్యమును తొలగించుకొని భాగవతారుగా అసలైన నామరూపములతో వారితో  తన సంభాషణమును ప్రారంభించారు. ...