Posts

SIVATANDAVASTOTRAM(EKA SILPI TRILOECHANAE MATIRMAMA)-07.

Image
  కరాలఫాలపట్టికాధగద్ధగద్ధగజ్జ్వల- ద్ధనంజయాధరీ/  హృతీ  కృతప్రచండపంచసాయకే | ధరాధరేంద్రనందినీకుచాగ్రచిత్రపత్రక- -ప్రకల్పనైకశిల్పిని త్రిలోచనే మతిర్మమ || 7 ||      భాషాపరముగా గమనిస్తే ప్రస్తుత శ్లోకములో రెండు విరుద్ధ విషయములు త్రిలోచనుడు చేసినట్లు కీర్తించబడ్డాయి.  మొదటిది తన మూదవకన్నును యజ్ఞవేదికచేసి తాను ధనంజయుడై/అగ్నిరూపుడై పంచశరములవానిని/మన్మథుని యజ్ఞపురుషునకు హవిస్సుగా అర్పించునాడు.అంటే కాముని దహించివేసినాడు.  రెండవది తన మూడవకన్నును కామప్రకోపితమైన అమ్మవారి వక్షస్థలమును వస్త్రము చేసి తన మనసును కుంచె చేసి తానొక అసమాన శిల్పియై మకరికాపత్ర రచనను చేసినాడు.  అట్టి విరుద్ధస్వభావములు కల స్వామి త్రిలోచనునిపై   నా మనసు లగ్నమై యుండునుగాక అనునది శ్లోక భావము.  సాధకుని దృష్టిలో కాముని దహించినది-కామిని కుచములను సింగారించినది ఒకేఒక లోకాతీత శక్తి.  దానికి ఇంద్రియ లౌల్యము లేదు.సమ్హారము అను పేర అది జీవుని సంస్కరించి తిరిగి పంచకృత్యములను ప్రారంభించినది.  నిజమునకు మన్మథుడు చావలేదు.అహమును తొలగించుకుని,అనంగుడై తన కర్తవ్యమును నెరవేర్చుచున్నా...

SIVATANDAVASTOTRAM( NAH: NAMAT MAHAKAPALI SAMPADE) -06.

Image
  లలాటచత్వరజ్వలద్ధనంజయస్ఫులింగభా- -నిపీతపంచసాయకం నమన్నిలింపనాయకమ్ | సుధామయూఖలేఖయా విరాజమానశేఖరం మహాకపాలిసంపదేశిరోజటాలమస్తు నః || 6   ప్రస్తుత శ్లోకము స్వామి ఆయుధములే-ఆభరనములు/ఆభరణములే ఆయుధములు.అనగా ఆహార్యమే అనురాగముగా ఒకొప్పడు-ఆగ్రముగా ఒకొప్పడు మారుచుండునను చమత్కారమునకు నిదర్శనము.  రెండవశ్లోకము స్వామి ఫాలనేత్రము లలాటమున ధరించిన ఎర్రటి వస్త్రము వలె ధగధగ ప్రకాశించినదట .కాని ప్రస్తుతము ఆ కన్ను అలంకారముకాదు.స్వామి లలాటమనే యహ్నవేదికనుండి వెలువడిన ధనంజయ రూపమై పంచబాణుడైన మన్మథుని దహించివేసినది.  మరొక ఉపమానము చకోర బంధువుగా వెన్నెలలు కురింపించిన చంద్రరేఖ ప్రస్తుత శ్లోకములో అమృతకాంతిగల శిరోభూషణముగా విరాజిల్లుతోంది.    అవి పరాక్రమించిన-ప్రకాశించిన దానికి కారణములు వాటిని గుర్తించలేని మనోదౌర్బల్యమే.దానిని సవరించుటకు స్వామి ఘోర-అఘోర /అగ్ని-సోమాత్మకమును అర్థముచేయించుతకు చెప్పబడినవి.  "మహాకపాలి" బ్రహ్మ కపాల కథను చెప్పకనే చెప్పుచున్నది.ఓ సదాశివ నాకు నీ విశ్వాత్మకతను గుర్తించి అందులోని ఒక చిన్న సూక్ష్మమే నేనను భావనను నా యందు సదా నిలుపుము.   ఏక బిల్వం శివార్పణం...

SIVATANDAVASTOTRAM(SRIYAI CHIRAAYA JAAYATAAM)-05

Image
  సహస్రలోచనప్రభృత్యశేషలేఖశేఖర ప్రసూనధూళిధోరణీ విధూసరాంఘ్రిపీఠభూః | భుజంగరాజమాలయా నిబద్ధజాటజూటక శ్రియై చిరాయ జాయతాం చకోరబంధుశేఖరః || 5 ||    మొదటి శ్లోకములో శివమును విస్తరింపచేయవలెనన్న ఆకాంక్షను వ్యక్తపరచిన సాధకుడు ప్రస్తుత శ్లోకములను శ్రియమును /సంపదలను స్వామి తాండవము విస్తరింపచేయవలెనన్ను ఆకాంక్షను తెలుపుతున్నాడు.   ఇప్పటివరకు మనతో స్వామి జటలను,గంగమ్మను,కరిచర్మమును,డమరుకశబ్దమును ఆహార్యములో చూపిస్తూ,అగ్నిసోమాత్మకుని అర్థనారీశ్వరునిగా ఆరాధిస్తూ ఆ పవిత్ర తాందవము సకల చరాచరములను ఏ విధముగా చైతన్యము చేస్తున్నదో వివరిస్తున్న సాధకుడు మనకు దేవతలను వారి వినయ నమస్కారములతో రాలిపడిన పుప్పొడులతో వింతరంగులో ప్రకాశించుచున్న స్వామి పాదపీఠమును సాక్షాత్కరింపచేయుచున్నాడు.    సాథకుని ఆకాంక్ష స్వామి సంపదలను సకలజగములపై విస్తరింపచేయుట.  ఆ విషయమును నాలుగు విశేషములద్వారా మనకు తెలియచేస్తున్నాడు.  స్వామి సిగను కీర్తించునప్పుడు చంద్రుని చకోరబంధువుగా. వెన్నెలతాగి ప్రాణమును నిలుపుకొనునది చకోరపక్షి.దానిని అనుగ్రహించు శక్తిని పొందిన చంద్రుని సిగపూవుగా ధరించినవాడు స్వామి.శాపవశమైన చం...

SIVATANDAVASTOTRAMU( ADBHUTA VINODAM BHIBHARTU)04

Image
 4.జటాభుజంగపింగళస్ఫురత్ఫణామణిప్రభా కదంబకుంకుమద్రవప్రలిప్తదిగ్వధూముఖే | మదాంధసింధురస్ఫురత్త్వగుత్తరీయమేదురే మనో వినోదమద్భుతం బిభర్తు భూతభర్తరి || 4 ||  మొదటి శ్లోకములో స్వామి తాండవ స్థలిని-స్వామి తాండవవము ద్వారా సమస్త మంగళములను విస్తరింపచేయుటను ప్రస్తావించిన సాధకుడు,  రెండవ శ్లోకములో స్వామి ఆహార్యమును అట్టి మంగళ తాండవమును తన చిత్తములో నిలుపుకొనవలెనను ఆకాంక్షను తెలియచేసినాడు.  మూడవ శ్లోకములో తాండవ వినోదమునందించు వస్తువుల యొక్క అగ్ని-సోమాత్మకతను అన్వయిస్తూఏ వానిలో దాగిన అర్థనారీశ్వర పరమార్థమును ప్రస్తుతిస్తూ ఆ నందము యొక్క శాశ్వతవమును ఆకాంక్షిస్తున్నాడు.   ప్రస్తుత శ్లోకములో సాధకుడు రెండేరెండు ఉపమానములను 1) సర్పములు 2)గజచర్మము తీసుకుని అనుపమాన స్వామి తేజమును తెలియచేస్తున్నాడు.  ఇప్పటి వరకు మనము స్వామి జటలు అడవి వలె నున్నవని,కటాహము వలె నున్నవని చెప్పుకొనినాము.     ఇప్పుడు ఆ జటలు పాములచే చుట్టబడినవట.అంటే మొదటి శ్లోకములో గళమున అలంకారముగా హారము వలె మెరిసిన సర్పము/సర్పములు చరచర పాకి జటలను చుట్టుకొనినవట.కాదు కాదు  స్వామి తన జటలను ఎర్రని వర్ణములుగల...

SIVATANDAVASTOTRAMU-(ETU VASTUNI-MANOVINODAM)-03

Image
 3.ధరాధరేంద్రనందినీవిలాసబంధుబంధుర స్ఫురద్దిగంతసంతతిప్రమోదమానమానసే | కృపాకటాక్షధోరణీనిరుద్ధదుర్ధరాపది క్వచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని || 3 ||   శివములను సర్వత్ర విస్తరింపచేయు శివతాండవమును సదా నా మనసులో చూడాలనే ఆకాంక్షను వ్యక్తము చేసిన సాధకుని పురాకృతపుణ్యమా అనునట్లుగా అగ్నిసోమాత్మకమిన శివస్వరూపము అర్థనారీశ్వరముగాను సాక్షాత్కరించుచున్నది.తనకోరికను తీర్చుటకు ఆలంబనములైన సంఘటనలను సైతము వ్యక్తము చేయుచున్నది.అవి స్వామి అమ్మతో కలిసి జతగా చేయు తాండవము ద్వారా కరుణావీక్షనములను ప్రసరింపచేయుచు దుర్భరమైన ఆపదలను దూరముచేయుచున్నాడట.అంతే కాదు తనకున్న వైరాగ్యమునకు-వ్యాపకత్వమునకు గుర్తుగా దిగంబరుడిగా ప్రకాశించుచున్నాడు.అన్నీ తానే-అంతా తానైన చైతన్యము సమస్త జగములను జాగృతపరచుచున్నవేళ సమస్త సంతతి ప్రమోదముతో నిండియుండునుకదా.దానికి కారణమైన శివశక్త్యాత్మకమైన చైతన్యము నన్ను వీదకుండుగాక.  స్వామి స్వరూపమునకు సంకేతము దిగంబరములను అనగా దిక్కులనే వస్త్రములుగా ధరించినవానిని-అఖండుని దర్శిస్తూ,దుర్లభమైన ఆపదలను సైతము దగ్గరికి చేరనీయని దయావీక్షణము నన్ను ఆశీర్వదించుగాక.    ఏక బిల్వం శివార్పణం....

SIVATANDAVASTOTRAM-02 ( RATI PRATI KSHANAM MAMA)

Image
 2.జటాకటాహసంభ్రమభ్రమన్నిలింపనిర్ఝరీ- -విలోలవీచివల్లరీవిరాజమానమూర్ధని | ధగద్ధగద్ధగజ్జ్వలల్లలాటపట్టపావకే కిశోరచంద్రశేఖరే రతిః ప్రతిక్షణం మమ || 2.     మమ పతి క్షణం రతిః-ప్రస్తుత శ్లోకములో  మనకు సాధకుడు తెలియచేస్తున్న ఆకాంక్ష.  రతిః-స్థిరమైన ఆనందమును శివతాండవము ద్వారా పొందవలెనన్నది కోరిక. కాని మొడటి శ్లోకములు మంగళాశాసనముగా స్వామి శుభంకరుడై తన తాండవము ద్వారా శుభములకు సమస్తమునకు విస్తరింపచేస్తాడని కీర్తిస్తున్నది.  కాని భాషాపరముగా అన్వయించుకుంటే అది  చ కార చండ తాండవం-జరిగిపోయిన తాండవము.అందులో కేవలము రంగస్థలము ఏ విధముగా సంప్రోక్షణము గావింపబడినదో,స్వామిని సర్పము ఏ విధముగా చుట్టుకొని సత్కరించినదో,డమరునాదము స్వామి కదలికలకు మంగళ వాయిద్యముగా మ్రోగినదో కీర్తించబడినది.  కాని సాధకుని చిత్తములో అది నిత్య-సత్య చైతన్య తాండవము.దానిని ప్రతిక్షణము అనుభవిస్తూ ఆనందపడటమే ఆకాంక్ష.కనుక రెండవ శ్లోకములో,  శాశ్వతానందమును పొందుతకు సహకరించుచున్న నాలుగు ఉపమానములను సాధకుడు ప్రస్తావించుచున్నాడు. 1.మొడటిది-స్వామి   మూర్థని-శిరము పైభాగము.అది ఇప్పుడు అడవిగా నున్న జటలతో...

SIVATANDAVASTOTRAMU-01( " TANOTU NA SIVAH SIVAM)

Image
 SLOKAM. 1.జటాటవీగలజ్జలప్రవాహపావితస్థలే గలేవలంబ్య లంబితాం భుజంగతుంగమాలికామ్ | డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం చకార చండతాండవం తనోతు నః శివః శివమ్ || 1 ||    ప్రస్తుత శ్లోకము పరమాత్మ సాకారమును అగ్నిసోమాత్మకముగా,అనగా ప్రజ్వలనము-ప్రకాశము మేళవించుకొనినట్లున్నదట.దానికి ఉదాహరనముగా స్వామి జటాజూటము-అందులో బంధింపబడియున్న గంగమ్మ అటు-ఇటు కదలలేక సుడులు తిరుగుచున్నదట.జటా స్వరూపము ఘోరత్వమునకు-గంగ జలము చల్లదనమునకు సంకేతములుగా నున్నవి.అంతేకాదు స్వామి ఫాలనేత్రము-అగ్ని తత్త్వమునకు-వేడికి-సిగలోని చంద్రరేఖ చల్లదనమునకు సాఖ్యముగా నున్నవట.స్వామి తాండవమునకు కైలాసము వేదికయైనది.ఆ వేదిక స్వామి తలపై నుండి జారిపడుచున్న గంగమ్మ దైవ ప్రవాహ జలముతో సంప్రోక్షితమైనది.నర్తకుడు కూడా తన గలములో సర్పమును మాలగా ధరించి సభామర్యాదతో గౌరవింపబడుతున్నాడు.మంగళవాయిద్య సూచకముగా స్వామి చేతనున్న డమరుకము ధ్వనులను చేయుచున్నదట. ప్రథమ పాదము వేదిక ప్రాభవమును ప్రస్తావించుచున్నది.  స్వామి చేయబోతున్నది చండ తాండవము-అనగా దానికదేసాటి.అసమానమైనది.ఆ తాండవము శివః-శుభస్వరూపునిచే,సివం-శుభములను-తనోతు-విస్తరింపచేయునది.  సకలచరాచరములలో...