2.జటాకటాహసంభ్రమభ్రమన్నిలింపనిర్ఝరీ-
-విలోలవీచివల్లరీవిరాజమానమూర్ధని |
ధగద్ధగద్ధగజ్జ్వలల్లలాటపట్టపావకే
కిశోరచంద్రశేఖరే రతిః ప్రతిక్షణం మమ || 2.
మమ పతి క్షణం రతిః-ప్రస్తుత శ్లోకములో మనకు సాధకుడు తెలియచేస్తున్న ఆకాంక్ష.
రతిః-స్థిరమైన ఆనందమును శివతాండవము ద్వారా పొందవలెనన్నది కోరిక. కాని మొడటి శ్లోకములు మంగళాశాసనముగా స్వామి శుభంకరుడై తన తాండవము ద్వారా శుభములకు సమస్తమునకు విస్తరింపచేస్తాడని కీర్తిస్తున్నది.
కాని భాషాపరముగా అన్వయించుకుంటే అది
చ కార చండ తాండవం-జరిగిపోయిన తాండవము.అందులో కేవలము రంగస్థలము ఏ విధముగా సంప్రోక్షణము గావింపబడినదో,స్వామిని సర్పము ఏ విధముగా చుట్టుకొని సత్కరించినదో,డమరునాదము స్వామి కదలికలకు మంగళ వాయిద్యముగా మ్రోగినదో కీర్తించబడినది.
కాని సాధకుని చిత్తములో అది నిత్య-సత్య చైతన్య తాండవము.దానిని ప్రతిక్షణము అనుభవిస్తూ ఆనందపడటమే ఆకాంక్ష.కనుక రెండవ శ్లోకములో,
శాశ్వతానందమును పొందుతకు సహకరించుచున్న నాలుగు ఉపమానములను సాధకుడు ప్రస్తావించుచున్నాడు.
1.మొడటిది-స్వామి
మూర్థని-శిరము పైభాగము.అది ఇప్పుడు అడవిగా నున్న జటలతో లేదు.దాని రూపమును అందమైన తీగెలతో చుట్తుకొనబడిన విశాలమైన పాత్రగా -జటా కటాహముగా స్పురింపచేయుచున్నది.జటలు అగ్నికి సంకేతము.ఇదే విషయము మన దక్షయజ్ఞ కథనము-బ్రహ్మకపాల వృత్తాంతము తెలియచేయుచున్నది.అట్టి అగ్నితత్త్వమైన జటాకటాహములో,
నిలింప నిర్ఝరీ-దేవ ప్రవాహమైన సురగంగానది,
సంభ్రమముతో భ్రమించుచున్నది.సుడులు తిరుగుచున్నది.స్వామికి ఆత్మ ప్రదక్షిణమును అత్యంత భక్తితో చేయుచున్నది.
అగ్ని-సోమాత్మక స్వరూపమును దర్శించి ధన్యతనొందుటకు నా మది పరుగులుతీయుచున్నది.
మరొక సంకేతమును సాధకుడు గమనించుచున్నాడు.
2. స్వామి ఫాలపట్టికగా పావకము-అగ్ని నేత్రము
ధగధ్ధగధగముగా జ్వలిస్తున్నదట.
పరమాద్భుతము.దానికి కొంచము పైన స్వామి సిగలో లేత చంద్రరేఖ చల్లదనము వెదజల్లుతూ ప్రకాశిస్తున్నదట.
అట్టి అగ్నిసోమాత్మక స్వరూపమును నా చిత్తమును వీడకుండునుగాక అని సాధకుని ప్రార్థన.
ఇందులో సాధకుడు నిజముగా స్వామిని అర్థించునది సుఖ-దు:ఖాతీత సమస్థితి యని గ్రహించవలెను.
ఏక బిల్వం శివార్పణం.
No comments:
Post a Comment