Monday, February 20, 2023

SIVATANDAVASTOTRAMU-01( " TANOTU NA SIVAH SIVAM)

 SLOKAM.

1.జటాటవీగలజ్జలప్రవాహపావితస్థలే

గలేవలంబ్య లంబితాం భుజంగతుంగమాలికామ్ |

డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం

చకార చండతాండవం తనోతు నః శివః శివమ్ || 1 ||

 


 ప్రస్తుత శ్లోకము పరమాత్మ సాకారమును అగ్నిసోమాత్మకముగా,అనగా ప్రజ్వలనము-ప్రకాశము మేళవించుకొనినట్లున్నదట.దానికి ఉదాహరనముగా స్వామి జటాజూటము-అందులో బంధింపబడియున్న గంగమ్మ అటు-ఇటు కదలలేక సుడులు తిరుగుచున్నదట.జటా స్వరూపము ఘోరత్వమునకు-గంగ జలము చల్లదనమునకు సంకేతములుగా నున్నవి.అంతేకాదు స్వామి ఫాలనేత్రము-అగ్ని తత్త్వమునకు-వేడికి-సిగలోని చంద్రరేఖ చల్లదనమునకు సాఖ్యముగా నున్నవట.స్వామి తాండవమునకు కైలాసము వేదికయైనది.ఆ వేదిక స్వామి తలపై నుండి జారిపడుచున్న గంగమ్మ దైవ ప్రవాహ జలముతో సంప్రోక్షితమైనది.నర్తకుడు కూడా తన గలములో సర్పమును మాలగా ధరించి సభామర్యాదతో గౌరవింపబడుతున్నాడు.మంగళవాయిద్య సూచకముగా స్వామి చేతనున్న డమరుకము ధ్వనులను చేయుచున్నదట.

ప్రథమ పాదము వేదిక ప్రాభవమును ప్రస్తావించుచున్నది.

 స్వామి చేయబోతున్నది చండ తాండవము-అనగా దానికదేసాటి.అసమానమైనది.ఆ తాండవము శివః-శుభస్వరూపునిచే,సివం-శుభములను-తనోతు-విస్తరింపచేయునది.

 సకలచరాచరములలోని ప్రతి అణువునందును చైతన్యమును జాగృత పరచునది.తద్వార స్థితికార్యమును నడిపించినది.అట్టి తాందవ వేదిక రంగస్థలము కైలాసము.దట్టమైన స్వామి జటాజూటములో బంధింపబడీ సురగంగ ప్రవాహము శిద్ధిచేసినది.ఏమిటి ఆ వేదిక.పంచభౌతిక శరీరమనే ముడివేసుకొనబడిన (బ్రహ్మ-విష్ణు-రుద్ర ముడులలో) దాగిన చిత్తును సాక్షాత్కరింప చేయు వేదిక.

 రెండవపాదములో స్వామి తన గలమున సర్పమును మాలగా చుట్టుకొనినాడట.


గలేవ లంబ్య లంబితాం భుజంగ తుంగ మాలికాం.


  స్వామి కంఠమును భుజంగములు చుట్ట్లు చుట్టుకొని ఉన్నవట.వాచ్యార్థముగా స్వామి తాండవమునకు ముందు సర్పాలంకృతుడైనాడు గౌరవసూచకముగా.ఇది వాచ్యార్థము.అంతరార్థమేమిటి.ఈ వాక్యమును అగ్ని-సోమాత్మక సంకేతమే.స్వామి గళము గరల జ్వాలతో అగిని కలిగియుండును.దానిని చల్లదనముగల పాములు చుట్టుకొని ఉన్నవట.అంటే స్వామి వేడిని-చల్లదనమును పక్క పక్కనే ధరించియున్నప్పటికిని అవి పరస్పర్ము నిబద్ధతతో నుండునట్లు నియంత్రించుచున్నాడు.

 మూడవ వాక్యము.

 .డమడ్దమ నినాదవడ్దమర్వయం,


 గంగమ్మను,వాసుకిని అనుసరిస్తు,డమరుకం డమడమ నినాదముతో స్వామి చేతిని అలంకరించి,అర్వయం -ప్రకాశించుచున్నది.

 నాదం తనుమనిశం-శంకరం_ అన్నాడు త్యాగరాజు.

 మంగళ వాయిద్య సంకేతముగా స్వామి తన డమరుక నాదముతో మంగలవాయిద్యములను మ్రోగిస్తున్నాడట.నాదము తానుగా-పదము అమ్మగా సర్వజగములకు శుభములనొసఫుటకు,అనగా సకలజీవులను కదిలించుటకు స్వామి సన్నద్ధుడగుచున్నాడు.అట్టి స్వామి మనలను సమ్రక్షించునుగాక.

  ఏక బిల్వం శివార్పణం.





No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...